బీహార్‌లో ప్రారంభమైన ఓట్ల లెక్కింపు
మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు రెండు విడతలో (నవంబర్ 6, 11 తేదీల్లో) పోలింగ్ - రెండు దశల్లో నమోదయిన పోలింగ్ శాతం 67.13.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఉదయం 8 గంటలకు మొదలైంది. బీహార్ నుంచి వచ్చిన ముందస్తు నివేదికల ప్రకారం .. NDA ఆధిక్యంలో ఉంది. కానీ ప్రతిపక్ష కూటమి కూడా వేగంగా ఆధిక్యంలోకి దూసుకుపోతోంది. అయితే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మొత్తం 243 స్థానాలకు నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరిగింది. ఓటింగ్ శాతం 67.13గా రికార్డుయ్యింది.
నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ అభ్యర్థి అనంత్ సింగ్ ఎన్నికల ప్రచారానికి ముందు జన్ సురాజ్ పార్టీ మద్దతుదారుడు దులార్ చంద్ యాదవ్ హత్య కేసులో నవంబర్ 2వ తేదీన అరెస్ట్ అయ్యారు. దులార్ యాదవ్ మోకామాలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా హత్యకు గురయ్యారు. ఈ కేసులో పోలీసులు హత్య కేసు నమోదు చేసి, అనంత్ సింగ్‌తో సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో అనంత్ కుమార్ సింగ్ 11,055 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారని ఈసీఐ తెలిపింది.
బీహార్‌లో మహాఘట్‌బంధన్ 58 సీట్ల ఆధిక్యానికి పడిపోయింది. మరోవైపు ఎన్డీఏ ఆధిక్యం 180 దాటింది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ మనన్ మిశ్రా మాట్లాడుతూ.. "ఎన్డీఏ పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఇది కేవలం ప్రధాని మోదీ,నితీష్ కుమార్ వల్లే... బీహార్ ప్రజలు ఫలితాన్ని చూపించారు. ఇప్పుడు, తేజస్వి యాదవ్ లేదా మరెవరి బెదిరింపులు పనిచేయవు. INDI కూటమి నాయకులు ఇప్పుడు తమ ఇళ్లలో దాక్కున్నారు. బీహార్ ప్రజలు చాలా తెలివైనవారు. నేపాల్ లేదా బంగ్లాదేశ్ ప్రజల్లా కాదు..." అని పేర్కొన్నారు.
మహాగట్‌బంధన్ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి గా వున్న ఆర్జేడీ తేజస్వి యాదవ్ రాగోపూర్ నుండి 1,273 వోట్ల వెనుకంజ లో ఉన్నారు. లాలూ యాదవ్ మరో కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ 10,000 ఓట్లతో మహుయా నుండి వెనుకంజ లో వున్నారు. బీహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా లఖిసరాయ్ నుండి ఆధిక్యం లో వున్నారు. జేడీయు కు చెందిన అనంత్ సింగ్ మోకామ్ 11,000 ఓట్ లతో ఆధిక్యం లో వున్నారు.
ఎన్డీఏ కూటమి అభ్యర్థులు లీడ్‌లో కొనసాగుతున్నారు. గెలుపు సంబరాలకు సిద్ధమవుతున్నారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సయ్యద్ షానవాజ్ హుస్సేన్ మాట్లాడుతూ.. "ఫలితం స్పష్టంగా కనిపిస్తోంది. మేము గెలవబోతున్నాం. బీహార్ ప్రజలు ప్రధాని మోదీ, నితీష్ కుమార్, ఎన్డీఏపై విశ్వాసం ఉంచారు. 20 సంవత్సరాల ప్రభుత్వానికి అనుకూలంగా ప్రజలు ఓటు వేశారు." అని అన్నారు. 1/24 రౌండ్ కౌంటింగ్ తర్వాత అలీనగర్ నుంచి బీజేపీకి చెందిన మైథిలి ఠాకూర్ 1826 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు. ఇక ఆర్జేడీ రెబల్, జేజేడీ అధినేత తేజ్ ప్రతాప్ మహువాలో వెనుకబడి ఉన్నారు. ఎల్జేపీ (రామ్ విలాస్) 5,823 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
ఎన్డీఏ కూటమి బీహార్ లో 190 సీట్లలో ముందువరస లో వుంది. కాంగ్రెస్ యిది ప్రజలకు ఎలెక్షన్ కమిషన్ కు మద్యన జరుగుతున్న పోటీగా పేర్కొంది. కమిషన్ బీజేపీ తో కుమ్మక్కు అయ్యిందని ఆరోపించింది. ఎన్డీఏ లో జెడియు కు 83 సీట్ లలో ఆధిక్యం ఉండగా. బీజేపీ 80 సీట్లలో ముందుంది. మహాగట్‌బంధన్ 49 సీట్లలో ముందు వుండగా. కాంగ్రెస్ ఆరు సీట్లలో సిపిఐ (ఎమ్ఎల్) మరో ఆరు సీట్లలో ముందుంది. బిజెపి కి సంబందించిన మైథిలి ఠాకూర్ అలీనగర్ నుండి ఆధిక్యం లో వున్నారు. ఆర్జేడీ తేజస్వి యాదవ్ రాగోపూర్ నుండి ఆధిక్యం లో వున్నారు. బీహార్ ఉప ముఖ్యమంత్రి లఖిసరాయ్ నుండి ఆధిక్యం లో వున్నారు. జేడీయు కు చెందిన అనంత్ సింగ్ మోకామ్ 11,000 ఓట్ లతో ఆధిక్యం లో వున్నారు.
బీహార్ లో 243 సీట్ లలో ఎన్డీఏ 175 సీట్ లలో ముందంజ లో వుంది. ఎన్డీఏ కూటమిలో 163 సీట్ లలో ముందంజ లో వుంది. కూటమి లో వున్న బీజేపీ 78 సీట్ ల లో జేడీ యు 76 లో ఆధిక్యం లో వుంది. మహాగట్‌బంధన్ లో ని ఆర్జేడీ 49 సీట్ లలో కాంగ్రెస్ 8 సీట్ల ల లో సిపిఐ (ఎమ్ఎల్) రెండు సీట్ లలో ముందు వరస లో వుండగా సిపిఐ వుందు వుంది. ఆర్జేడీ తేజస్వి యాదవ్ రాగోపూర్ నుండి ఆధిక్యం లో వున్నారు. బీహార్ ఉప ముఖ్యమంత్రి లఖిసరాయ్ నుండి ఆధిక్యం లో వున్నారు. బిజెపి కి సంబందించిన మైథిలి ఠాకూర్ అలీనగర్ నుండి ఆధిక్యం లో వున్నారు. బిజెపి కి సంబందించిన మైథిలి ఠాకూర్ అలీనగర్ నుండి ఆధిక్యం లో వున్నారు.
ECI ట్రెండ్స్ ప్రకారం..పోలింగ్ సరళిని చూస్తే.. JD(U) అతిపెద్ద సింగిల్ పార్టీగా అవతరించింది. ఇప్పటి దాకా లీడ్‌లో ఉన్న పార్టీల వివరాలు పరిశీలిస్తే..
BJP: 50
JD(U): 58
LJP (RV); 15
HAM-ఎస్: 4
RJD: 30
Congress: 10
CPI-ML: 2
AIMIM : 1
VIP: 1
CPM: 1
మోకామాలో అనంత్ సింగ్ (JD-U) ఇప్పటికీ ఆధిక్యంలో ఉండగా.. BJP మంగళ్ పాండే (BJP) సివాన్‌లో వెనుకబడి పోయారు. బీహార్ మంత్రి, బీజేపీ నాయకుడు నితిన్ నబిన్ 1/31 రౌండ్ ఓట్ల లెక్కింపులో ముందంజలో ఉన్నారు. అయితే ఆ పార్టీకి చెందిన రేణు దేవి మొదటి రౌండ్ తర్వాత బెట్టియాలో ముందంజలో ఉన్నారు.
బీహార్ లో ని 243 సీట్ లలో 160 సీట్ ల లోలో బీజేపీ ఆధిక్యం లో వుంది. మహుయా నుండి తేజ్ ప్రతాప్ యాదవ్ వెనుకంజ లో వున్నారు. ఆర్జేడీ తేజస్వి యాదవ్ రాగోపూర్ నుండి ఆధిక్యం లో వున్నారు. బీహార్ ఉప ముఖ్యమంత్రి లఖిసరాయ్ నుండి ఆధిక్యం లో వున్నారు. బీజేపీ కి సామ్రాట్ చౌధరి చెందిన తారపూర్ నుండి ఆధిక్యం లో వున్నారు. బిజెపి కి సంబందించిన మైథిలి ఠాకూర్ అలీనగర్ నుండి ఆధిక్యం లో వున్నారు.
బీహార్ లో మ్యాజిక్ సంఖ్య దాటిన ఎన్డీఏ 122 నియోజక వర్గాల లో ఆధిక్యం లో వుంది. కాంగ్రెస్ కేవలం 20 స్థానాలలో మాత్రమే ఆధిక్యం లో వుంది. 80 స్థానాలలో ఆధిక్యంలో వుంది. ఒక స్థానం లో జన్ సూరాజ్ పార్టీ ముందు వరసలో వుంది. బిజెపి కి సంబందించిన మైథిలి ఠాకూర్ అలీనగర్ నుండి ఆధిక్యం లో వున్నారు. మహుయా నుండి తేజ్ ప్రతాప్ యాదవ్ ఆధిక్యం లో వున్నారు.