సీపీఎం నేత తమ్మినేని ఆరోగ్య పరిస్థితి విషమం!

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రానికి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది.ఆయన గుండె, కిడ్నీ ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు;

Update: 2024-01-16 15:37 GMT
tammineeni

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితి క్రిటికల్‌గా ఉందంటున్నారు హైదరాబాద్‌ గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రి వైద్యులు. ఇంటెన్సివ్‌ కేర్‌లో ఆయనకు వైద్యం అందిస్తున్నారు. మెడిసిన్స్‌ సాయంతో క్రిటికల్‌ కేర్‌లో ఆయనకు వైద్య సాయం అందిస్తున్నారు.


ఇవాళ ఖమ్మంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ AIG ఆస్పత్రికి తరలించారు. తమ్మినేని వీరభద్రంకు ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌ కారణంగా..శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడిందని ఖమ్మం వైద్యులు తెలిపారు. దీంతో వెంటనే ఆయన్ను హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారు తమ్మినేని వీరభద్రం. ఆయనకు వివిధ రకాల వైద్య పరీక్షలు చేశారు. ఆరోగ్యపరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. గతంలో తమ్మినేని వీరభద్రంకు ఏఐజీ ఆస్పత్రిలోనే స్టెంట్స్‌ వేశారు. గత సెప్టెంబర్‌లో మరోసారి గుండెకు సంబంధించిన సమస్య రావడంతో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఛాతీలో నొప్పి ఎక్కువ కావడంతో ఖమ్మంలోని స్థానిక ఆస్పత్రికి తరలించారు.


ఇప్పటికే తమ్మినేని వీరభద్రం ఆరోగ్యపరిస్థితి తెలుసుకునేందుకు మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. వైద్యులతో మాట్లాడారు. తమ్మినేని కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు.

Tags:    

Similar News