ఢిల్లీ పేలుడు: అత్మాహుతి దాడి కోణంలోనూ విచారణ..

ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (IED) తప్పుగా అమర్చడం వల్ల విధ్వంస తీవ్రత తగ్గిందన్న దర్యాప్తు అధికారులు

Update: 2025-11-12 13:53 GMT
Click the Play button to listen to article

ఢిల్లీ (Delhi) ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు(Car blast)లో 12 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన కేంద్రం NIAకు అప్పగించడంతో దర్యాప్తులో వేగం పెరిగింది. పేలుడుకు ఉపయోగించిన కారును పుల్వామాకు చెందిన వైద్యుడు ఉమర్ నబీ వాడుతున్నాడని కనుగొన్న పోలీసులు.. హర్యానాలోని పొరుగున ఉన్న ఫరీదాబాద్ నుంచి ప్రధానంగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోవడంతో ఉగ్రవాద లింకులపై దృష్టి సారించారు. మంగళవారం జమ్మూ, కశ్మీర్ పోలీసులు నబీ తల్లి నుంచి DNA నమూనాను తీసుకొని సంబంధాన్ని నిర్ధారించారు.

ఢిల్లీ-ఎన్‌సిఆర్, పుల్వామా, జమ్మూకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో భద్రతా సంస్థలు ఉగ్రవాదులతో సంబంధాలున్న అనుమానితులను పట్టుకోవడానికి దాడులు నిర్వహిస్తున్న నేపథ్యంలో భయం, నిరాశలో ఉమర్ ఆత్మాహుతి దాడికి ఏమైనా పాల్పడ్డాడా? అనే కోణంలో కూడా పోలీసు దర్యాప్తు చేస్తున్నామని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఘటనా స్థలంలో దొరికిన ఆధారాలను బట్టి చూస్తే ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (IED) తప్పుగా అమర్చడం వల్ల భారీ విధ్వంసం జరగలేదని సూచిస్తుందని అధికారి తెలిపారు.

సోమవారం సాయంత్రం రద్దీగా ఉండే సమయంలో ఎర్రకోట పేలుడు సంభవించింది. ముగ్గురు వైద్యులు సహా ఎనిమిది మందిని అరెస్టు చేసి, 2,900 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. జైష్-ఎ-మొహమ్మద్, అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్ లతో సంబంధం ఉన్న "వైట్ కాలర్" టెర్రర్ మాడ్యూల్‌ ఈ దాడిలో బయటపడింది. 

Tags:    

Similar News