విజయ్ తో కాంగ్రెస్ నాయకుడి సమావేశం
తమిళనాడు కాంగ్రెస్ లో కలకలం.. ఏఐసీసీకి ఫిర్యాదు
By : The Federal
Update: 2025-12-07 08:06 GMT
మహలింగం పొన్నుస్వామి
తమిళగ వెట్రి కజగం(టీవీకే) అధ్యక్షుడు, నటుడు విజయ్ కాంగ్రెస్ కు చెందిన ప్రముఖ నాయకుడు, ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ లీడర్(ఏఐపీసీ) చైర్మన్ చక్రవర్తి కలవడం తమిళనాడు కాంగ్రెస్ లో కలకలం రేగింది.
తక్షణమే అతడిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని తమిళనాడు కాంగ్రెస్ హైకమాండ్ ను కోరినట్లు తెలిసింది. తమిళనాడు కాంగ్రెస్ కమిటీ(టీఎన్సీసీ) అధ్యక్షుడు కే. సెల్వపెరుంతగై, చక్రవర్తి పై ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
సెల్వ పెరుంతగై తన సన్నిహితులతో కలిసి శుక్రవారం సాయంత్రం తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలకు ఏఐసీసీ ఇన్ ఛార్జ్ గిరిశ్ చోడంకర్ ను సంప్రదించి, తక్షణ జోక్యం చేసుకోవాలని కోరినట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.
మొన్న పట్టినపాక్కంలోని ఆయన నివాసంలో దాదాపు గంట సేపు రహస్యంగా ప్రవీణ్ చక్రవర్తితో విజయ్ సమావేశం అయ్యారు. ఆయన మాట్లాడటం పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిందని, వచ్చే ఎన్నికలలో డీఎంకే తో జరిగే సీట్ల పంపకాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని వారు ఆరోపిస్తున్నారు.
ఏఐసీసీ ఇన్ చార్జ్..
చోడంకర్ నేతృత్వంలోని ఏఐసీసీ ఐదుగురు సభ్యుల కమిటీ బుధవారం డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తో ప్రాథమిక చర్చలు జరిపిన కొద్ది రోజులకే ఈ పరిణామం చోటు చేసుకుంది.
‘‘ఇది ఏదో యాధృచ్చికంగా జరిగిన సంఘటన కాదు. డీఎంకేతో మన పొత్తును పట్టిష్టం చేసుకోవాల్సిన కీలక సమయాల్లో ప్రవీణ్ చేస్తున్న ఇలాంటి చర్యలు గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి’’ అని టీపీసీసీ సీనియర్ నాయకుడు ‘ది ఫెడరల్’ తో అన్నారు.
లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో చక్రవర్తికి ఉన్న సాన్నిహిత్యం కారణంగా అతడి చర్యలు పార్టీకి తీవ్ర నష్టం కలిగించాయని, ఇది హైకమాండ్ ఇచ్చిన సంకేతాలుగా భావిస్తారని కొన్ని వర్గాలు తెలిపాయి.
మొన్న సాయంత్రం సెల్వ పెరుంతగైతో జరిగిన ఫోన్ సంభాషణలో చోడంకర్ కు ఈ ఫిర్యాదు గురించి తెలియజేసినట్లు వర్గాలు తెలిపాయి. ప్రవీణ్- విజయ్ సమావేశం పార్టీ ఐక్యతకు దాని ప్రభావాల గురించి ది ఫెడరల్ ఏఐసీసీ ఇన్ ఛార్జీని ప్రశ్నించగా, ఆయన ఏ విషయాలు చెప్పలేదు.
‘‘ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సమావేశం. దానిపై నేను ఏమి చెప్పలేను’’? అని చోడంకర్ చెప్పారు. అలాంటి వ్యక్తిగత సంభాషణలు పార్టీ అధికారిక విషయాలపై ఎటువంటి ప్రభావాన్ని చూపవని అన్నారు.
పార్టీ అనలిటిక్స్ విభాగానికి అధిపతిగా, రాహుల్ కు కీలక వ్యూహకర్తగా చక్రవర్తి ఉన్నాడు. ఇది జాతీయ నాయకత్వం తెలిసి జరిగిందా? టీవీకే తో అన్వేషణాత్మక చర్చలకు దారితీస్తున్నారా? అనేది ముందు ముందు తెలుస్తుంది.
‘‘సెల్వ పెరుంతగైకు సమాచారం ఉంది. నేను ఈ విషయాన్ని హై కమాండ్ కు తెలియజేస్తాను’’ అని ఆయన ది ఫెడరల్ తో అన్నారు. ‘‘నేను నాయకత్వానికి ఏమి చెబుతానో మీకు చెప్పలేను’’ అన్నారు.
టీఎన్ పీసీసీ చీఫ్ కు గురించి..
సీట్ల పంపకాలపై డిమాండ్లు, సంకీర్ణ ప్రభుత్వ ఆకాంక్షలను బహిరంగంగా చెప్పవద్దని టీఎన్సీసీ నాయకులు సూచించింది. ఎందుకంటే ఇది డీఎంకేతో చర్చలను ప్రమాదంలో పడే అవకాశం ఉంది. 2024 లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి, డీఎంకే కు మధ్య కొన్ని పొరపచ్చాలు వచ్చాయి.
దీనికి కారణం ప్రవీణ్ చక్రవర్తి అనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణం వల్లే మైలదుత్తురై స్థానం డీఎంకే ఇవ్వలేదని తెలిసింది. మొదట్లో దక్షిణ చెన్నై, తరువాత మైలదుత్తురైకి కాంగ్రెస్ ఎంపిక అభ్యర్థులకు డీఎంకే మద్దతు తెలపలేదు.
ఈ నిర్ణయం జాతీయ నాయకత్వంలో అనేక మంది నాయకులను చికాకు పెట్టింది. ఇప్పుడు చక్రవర్తి, టీవీకే వంటి పార్టీలతో రహస్యంగా చర్చలు జరపడానికి దారీ తీసిందని, ఇదీ డీఎంకేకు అనుమానాలు కలిగించిందని టీఎన్ పీసీసీ వర్గాలు తెలిపాయి.
ఈ సమావేశానికి మరింత బలం చేకూరుస్తూ చెన్నైలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నివాళులు అర్పించడానికి వచ్చిన సెల్వపెరుంతగై మాట్లాడుతూ.. అలాంటి సమావేశం గురించి తనకేమీ తెలియదని స్వరం మార్చాడు.
అనుమతి లేకుండా ఈ సమావేశం జరిగితే జాతీయ నాయకత్వం పూర్తిగా చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఇంతకుముందు కరూర్ ఎంపీ జోతిమణి విజయ్ తో సమావేశం అయ్యారని, అయితే అది కాకతాళీయంగా జరిగిందని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఇది అలా జరిగింది కాదని అన్నారు.
అవును నేను కలిశాను: చక్రవర్తి
ది ఫెడరల్ సోదర సంస్థ అయిన పుతియ తలైమురై టీవీ విజయ్ చక్రవర్తిని సంప్రదించింది. విజయ్ తో సమావేశం అయినట్లు ఆయన అంగీకరించారు. కానీ ఆయన ఎలాంటి వివరాలు అందించలేదు.
‘‘అవును, నేను విజయ్ ను కలిశాను. కానీ ఇది నేను టీవీకేలో చేరడం గురించి మాత్రం కాదు. అంతా చేస్తున్న ప్రచారం తప్పు. ప్రస్తుతానికి నేను చెప్పగలిగింది ఇదే’’ అని ఆయన చెప్పడం ఊహగానాలకు ఆజ్యం పోసింది.
ఈ సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేత, అధ్యక్షుడు కానీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆశీస్సులు ఉన్నాయని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. యువత, పట్టణ ఓటర్లలో టీవీకే ఆకర్షణ పెరుగుతోందని, ఇంటలిజెన్స్ సంస్థలు దీన్ని గమనిస్తున్నాయని అభివర్ణిస్తున్నాయి.
తమిళనాడు కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. టీవీకే చేస్తున్న రాజకీయ ర్యాలీలు జనం భారీగా హజరవ్వడం చూస్తునే, విజయ్ కు స్టార్ పవర్ ఉందని నమ్ముతోందని, అదే సమయంలో డీఎంకే ను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తుందని చెప్పారు.
‘‘అధికార భాగస్వామ్యానికి విజయ్ బహిరంగంగా ఉండటం వలన కాంగ్రెస్ లోని కొందరు మరికొన్ని సీట్లు లేదా సంకీర్ణ ప్రభుత్వం కోసం ఒత్తిడి పెంచుతున్నారు. ప్రవీణ్ పాత్ర దానిని మరింత పెరగడానికి దారి తీసింది’’ అని చెన్నైకు చెందిన పరిశీలకుడు ప్రియన్ అన్నారు.
టీవీకేను చేరుకునేందుకు కాంగ్రెస్ చేసే ఏ ప్రయత్నమైన స్టాలిన్, డీఎంకేను అసహనంగా కలిగించింది. విజయ్ తో చక్రవర్తి సమావేశం పై బీజేపీ ప్రతిస్పందించింది. రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ మాట్లాడుతూ.. ఈ సమావేశం డీఎంకే- కాంగ్రెస్ ఫ్రంట్ లో గందరగోళాన్ని బయటకు తెచ్చిందని అన్నారు.