జూబ్లీ గెలుపుతో కాంగ్రెస్ లో సంబురాలు

జూబ్లీహిల్స్ గెలుపు వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖాతాలోనే పడుతుంది అనటంలో సందేహంలేదు

Update: 2025-11-14 07:33 GMT
Congress Candidate Naveen Yadav wins Jubilee By poll

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో అనధికారికంగా కాంగ్రెస్ అభ్యర్ధి వల్లాల నవీన్ యాదవ్ గెలిచినట్లే అనుకోవాలి. శుక్రవారం ఉదయం 8 గంటలకు మొదలైన పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు దగ్గర నుండి ఈవీఎం ఓట్ల లెక్కింపులో కూడా నవీన్ ప్రతిరౌండులోను తనమెజారిటిని కంటిన్యు చేస్తునే ఉన్నాడు. 101 పోస్టల్ బ్యాలెట్లతో కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. వీటిల్లో కాంగ్రెస్(Telangana Congress)అభ్యర్ధికి 47, బీఆర్ఎస్ అభ్యర్ధి మాగంటి(Maganti Sunitha) సునీతకు 43, బీజేపీ అభ్యర్ధి లంకల దీపక్ రెడ్డికి 11 పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ల ఓటింగ్ సరళిని గమనించిన తర్వాత కాంగ్రెస, బీఆర్ఎస్(BRS) మధ్య పోటీ బాగా టఫ్ గా ఉంటుందనే ఆలోచన మొదలైంది.

దానికి తగ్గట్లే ఈవీఎంల ఓట్ల కౌంటింగ్ మొదటిరౌండులో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ మీద వచ్చిన ఆధిక్యం కేవలం 62 ఓట్లు మాత్రమే. ఇదేఒరవడి మిగిలినరౌండ్లలో కూడా కంటిన్యు అవుతుందని పోటీ బాగా టైట్ గా ఉంటుందని అనుకున్నారు. అయితే రెండో రౌండులో బీఆర్ఎస్ పై కాంగ్రెస్ కు 1184 ఓట్ల మెజారిటి, మూడోరౌండులో సుమారు 2 వేల మెజారిటి రావటంతో మూడోరౌండ్ ముగిసేసమయానికి నవీన్ 3 వేల కంఫర్టబుల్ లీడుకి చేరుకున్నారు. అక్కడినుండి రౌండు రౌండుకు కాంగ్రెస్ అభ్యర్ధి మెజారిటి పెరిగిందే కాని ఎక్కడా తగ్గలేదు. చివరకు 8వ రౌండు ముగిసేసమయానికి నవీన్ సుమారు 22 వేల ఓట్ల మెజారిటికి చేరుకున్నాడు. దీంతోనే కాంగ్రెస్ అభ్యర్ధి ఉపఎన్నికలో కంఫర్టబుల్ గా గెలుపు దిశగా ప్రయాణిస్తున్నాడు అన్నవిషయం అర్ధమైపోయింది. గెలుపును కేంద్రఎన్నికలకమీషన్ అధికారికంగా ప్రకటించాల్సుంది.

12.30 గంటలకు 8 రౌండ్లు ముగియగా మరో రెండు రౌండ్ల కౌంటింగ్ బాకీఉంది. 9వ రౌండు కౌంటింగ్ మొదలైంది. నిజానికి 4.01 లక్షల ఓట్లలో ఉపఎన్నికలో పోలైంది కేవలం 1.95 లక్షల ఓట్లు మాత్రమే. ఏడు డివిజన్లలో కలిపి 30 కాలనీలు, 70 బస్తీలున్నాయి కాబట్టి ఓటింగ్ బ్రహ్మాండంగా జరుగుతుందని మొదట్లో చాలామంది అనుకున్నారు. అయితే ఆశ్చర్యంగా 2023 సాధారణ ఎన్నికలో జరిగిన పోలింగ్ 48శాతం ఓట్లే ఇపుడు కూడా పోలయ్యాయంతే.

అనధికారికంగా నవీన్ గెలుపు ఖాయమైపోయిన నేపధ్యంలో పార్టీ ఆఫీసు గాంధీభవన్ లో సంబరాలు తారాస్ధాయికి చేరుకున్నాయి. నవీన్ గెలుపుకు దాదాపు మూడువారాలు అవిశ్రాంతిగా పనిచేసిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు గాంధీభవన్ కు చేరుకుని సంబరాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఇంట్లో లక్ష్మీపూజను ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలో నవీన్ వ్యక్తిగత ఆఫీసులోను, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర పెద్దఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ఈరోజు సాయంత్రం ఉపఎన్నిక ఫలితంపైన ప్రత్యేకంగా మంత్రులతో రేవంత్ భేటీ అవబోతున్నారు. తర్వాత రేవంత్ మీడియాతో మాట్లాడుతారని సమాచారం. కాంగ్రెస్ గెలుపు సంకేతాలు కనబడగానే బీఆర్ఎస్ అభ్యర్ధి మాగంటి సునీత, బీజేపీ అభ్యర్ధి దీపక్ రెడ్డి కౌంటింగ్ కేంద్రంనుండి వెళ్ళిపోయారు. అలాగే బీఆర్ఎస్, బీజేపీ నేతలు కూడా ఎక్కడా కనబడలేదు.

Tags:    

Similar News