ఒకే కుటుంబంలో ముగ్గురు, నాలుగుసార్లు సర్పంచ్‌లు
1995లో చీకటిమామిడి గ్రామానికి తొలిసారి సర్పంచ్‌గా ఎన్నిక.
భవనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలోని చీకటిమామిడి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు నాలుగు పర్యాయాలుగా సర్పంచ్‌లు అయ్యారు. ఒకరి తర్వాత ఒకరుగా వరుసగా సర్పంచ్ స్థానాలను దక్కించుకున్నారు. ఆ కుటుంబీకులు పదవిలో ఉండి చేస్తున్న పనితీరుకు మెచ్చి గ్రామస్తులు కూడా వేరే వారికి అవకాశం ఇవ్వదల్చుకోలేదేమో. ఈ ఘనత మచ్చ చంద్రమౌలిగౌడ్ కుటుంబానిదే. 1995లో చీకటిమామిడి గ్రామానికి తొలిసారి సర్పంచ్‌గా మచ్చ చంద్రమౌళిగౌడ్ ఎన్నికయ్యారు. ఐదేళ్లూ ప్రజలతో మమేకమైన గ్రామ అభివృద్ధికి ఆయన పాటుపడ్డారు. దాంతో 2001లో కూడా ఆయనకే ఓటు వేశారు గ్రామస్తులు. కాగా 2007లో చంద్రమౌళి గౌడ్ తల్లి కళావతి.. సర్పంచ్ పోటీలో నిల్చున్నారు. ఆమెను కూడా గ్రామస్తులు గెలిపించుకున్నారు.
ఆమె కూడా సర్పంచ్‌గా ప్రజలతో మమేకమై పనిచేశారు. 2013లో చంద్రమౌళిగౌడ్ సోదరుడు శ్రీనివాస్ ఎంపీటీసీగా విజయం సాధించారు. ఆ తర్వాత చంద్రమౌళి గౌడ్ సతీమణి మచ్చ వసంత 2019 సర్పంచ్ ఎన్నికల్లో నిలబడి విజయం సాధించారు. దాదాపు 20ఏళ్ల పాటు ఆ కుటుంబం గ్రామాభివృద్ధి కోసం పనిచేసింది. ప్రస్తుతం రాష్ట్రమంతా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న వేళ.. చీకటిమామిడి తదుపరి సర్పంచ్ ఎవరు అవుతారు? అన్నది ఆసక్తికరంగా మారింది.