కేటీఆర్‌కు ఐపీఎస్‌ సంఘం వార్నింగ్

చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కు తమకుందన్న అధికారులు.

Update: 2025-11-12 16:27 GMT

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఐపీఎస్ అధికారుల సంఘం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కు తమకుందని స్పష్టం చేసింది. డీజీపీ, పోలీసు వ్యవస్థను ఉద్దేశించి కేటీఆర్.. ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. ఈ విషయంలో తాము డీజీపీకి మద్దతుగా ఉంటామని అన్నారు. ఈ మేరకు ఐపీఎస్ అధికారుల సంఘం ఓ ప్రకటన విడుదల చేసింది. డీజీపీ శివధర్ రెడ్డి, మొత్తం పోలీస్ వ్యవస్థను టార్గెట్ చేసుకుని అవమానించేలా కేటీఆర్ మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసు వ్యవస్థపై నిజమైన అభ్యంతరాలు ఉంటే అలా బహిరంగంగా దూషించడం, నోటికొచ్చినట్లు మాట్లాడటంకాదని, చట్టబద్ధంగా వాటిని లేవనెత్తాలని పేర్కొంది.

ఇటువంటి వ్యాఖ్యలు ప్రజలను తప్పుదారి పట్టించే అవకాశం ఉందని, అదే విధంగా పోలీసుల నిష్పాక్షికత, వృత్తి గౌరవన్ని దెబ్బతీస్తాయిన వ్యాఖ్యానించింది. అదే విధంగా డీజీపీ రాష్ట్ర పోలీసుల వ్యవస్థకు అధిపతి అని, అటువంటి వ్యక్తికి పరువు నష్టం కలిగించేలా చేసే వ్యాఖ్యలు సరైనవి కాదని పోలీసుల సంఘం తెలిపింది. రాజకీయ ప్రయోజనాల కోసం సర్వీస్‌లో ఉన్న అధికారులపై నిరాధారమైన ఆరోపణలు చేయడం మంచి పద్దతి కాదని పేర్కొంది.

Tags:    

Similar News