తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించిన రేవంత్

సోనియాగాంధీ పుట్టినరోజునే తెలంగాణ తల్లి విగ్రహాాలను ఆవిష్కరించిన రేవంత్

Update: 2025-12-09 06:36 GMT
Revanth unveils Telangana Talli statutes

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మంగళవారం తెలుగుతల్లి విగ్రహాలను ఆవిష్కరించారు. తెలంగాణ ఏర్పాటు ప్రకటన వెలువడిన రోజు కాబట్టి డిసెంబర్ 9వ తేదీన తెలంగాణతల్లి విగ్రహాలను(Telangana Talli statues) ఆవిష్కరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. అప్పటి నిర్ణయంలో భాగంగానే ఈరోజు రేవంత్(Revanth) వర్చువల్ గా విగ్రహాలను ఆవిష్కరించారు. మామూలుగా అయితే ఏదో జిల్లా కేంద్రానికి వెళ్ళి విగ్రహాన్ని రేవంత్ ఆవిష్కరించుండాల్సింది. రెండురోజుల(Telangana Global Summit) తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2047 కారణంగా ఈరోజు రేవంత్ చాలా బిజీగా ఉన్నారు. అందుకనే సమ్మిట్ వేదిక మీదనుండే రేవంత్ వర్చువల్ గా విగ్రావిష్కరణ చేశారు.

గతంలోనే సెక్రటేరియట్ లో తెలంగాణతల్లి విగ్రహాన్ని ప్రతిష్టించిన విషయం అందరికీ తెలిసిందే. అదే తరహాలో అన్నీ జిల్లాకేంద్రాల్లోని కలెక్టర్ కార్యాలయాల్లో ఈరోజు విగ్రహాల ఆవిష్కరణ జరిగింది. ఒక్కోవిగ్రహం ఎత్తు 12 అడుగులుంది. విగ్రహాన్ని ఏర్పాటుచేసిన దిమ్మ ఎత్తు 6 అడుగులుంది. దిమ్మె+విగ్రహం ఎత్తు కలిపి 18 అడుగులుంది. ఒక్కో విగ్రహం ఏర్పాటుకు. 17.50 లక్షల చొప్పున ప్రభుత్వం రు. 5.80 కోట్లు గతంలోనే మంజూరుచేసింది. రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో ఈ విగ్రహాలు తయారయ్యాయి.

విగ్రహం రూపురేఖలు ఎలాగున్నాయంటే సంప్రదాయ పల్లెటూరి మహిళా రైతును గుర్తుచేస్తుంది. ఆకుపచ్చ చీరకు పసుపుపచ్చ బంగారురంగు అంచు(బార్డర్)ఉంది. చేతిలో మొక్కజొన్న, గోధుమ, సజ్జ కంకులున్నాయి. మొక్కజొన్న, గోధుమ ప్రధానపంటలుగాను సజ్జలను అంతర్ పంటగా సాగుచేస్తుంటారు రైతులు. నుదిటిపై ఎర్రని రూపాయికాసంత బొట్టుతో, కాళ్ళకు కడియాలు, ముక్కుపుడక, చెవులకు కమ్మలు, చేతులకు మట్టిగాజులు, మెడలో గుండు పూసల హారంతో చిరునవ్వు చిందిస్తున్న తెలంగాణతల్లి విగ్రహం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈరోజుకు మరో విశేషం ఉంది. అదేమిటంటే కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధి పుట్టినరోజు కూడా.

Tags:    

Similar News