తెలంగాణకు రెండో రోజూ కొనసాగుతున్న పెట్టుబడుల జడివాన
తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానిక ముందుకొచ్చిన పలు సంస్థలు. రెండో రోజు రూ.1,11,395 కోట్ల పెట్టుబడులు.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 రెండో రోజున కూడా తెలంగాణకు భారీగా పెట్టబడులు వస్తున్నాయి. సదస్సులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు అవుతున్నారు. వరుస ఒప్పందాలను కుదుర్చుకుంటున్నారు. ఒక్కరోజులోనే పలు రంగాల్లో భారీ MoUs కుదిరి మొత్తం రూ.1,11,395 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి లభించాయి. పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా, బయోటెక్, డేటా సెంటర్లు, క్లీన్ ఎనర్జీ వంటి విభాగాలలో అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చాయి. మొదటి రోజు మొత్తం రూ.2.43 లక్షల కోట్ల పెట్టబడులు వచ్చాయి. రెండో రోజు కూడా తెలంగాణ పెట్టబడులను ఆకర్షించడంలో ఇదే దూకుడు కనబరుస్తోంది. మంగళవారం మధ్యాహ్నానికే రూ.1,11,395 కోట్ల పెట్టబడులను ఆకర్షించింది.
సదస్సు రెండో రోజు చేసుకున్న ఎంఓయూ ఒప్పందాలు..
పర్యాటక రంగంలో ₹7,045 కోట్ల పెట్టుబడులు
పర్యాటక రంగంలోనే 10,000 ప్రత్యక్ష, 30,000 పరోక్షంగా ఉద్యోగాలు సృష్టించేలా అనేక ప్రాజెక్టులు ముందుకు వచ్చాయి.
ఫుడ్‌లింక్ ఎఫ్అండ్‌బీ హోల్డింగ్స్ (Foodlink F&B హోల్డింగ్స్) (₹3,000 కోట్లు) – భారత్ ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ కన్వెన్షన్ & ఎగ్జిబిషన్ సెంటర్
డ్రీమ్ వ్యాలీ, సరస్ ఇన్‌ఫ్రా (Dream Valley, Sarus Infrs) – ఒక్కొటీ ₹1,000 కోట్లతో గోల్ఫ్ డెస్టినేషన్, కల్చరల్ సెంటర్
అట్మాస్పియర్ కోర్ హోటల్స్, పోలిన్ గ్రూప్, ఫ్లూయిడ్రా ఇండియా (Atmosphere Core Hotels, Polin Group, Fluidra India) వంటి అంతర్జాతీయ కంపెనీలు వెల్‌నెస్ రిట్రీట్, ఆక్వా పార్క్, ఆర్టిఫిషియల్ బీచ్ వంటి ప్రత్యేక ప్రాజెక్టులు
సలాం నమస్తే దోసా హట్ (ఆస్ట్రేలియా) – రాష్ట్రవ్యాప్తంగా కారవాన్ పార్కులు
ఫిల్మ్, సమ్మేళన రంగంలో కూడా పురోగతి సాధించబడింది. IIFA ఉత్సవాలు, ASEAN దేశాలతో కల్చరల్ భాగస్వామ్యాలు, టోనీ బ్లేర్ ఇన్స్టిట్యూట్ సలహాలు రాష్ట్ర టూరిజం దిశలో కీలకమవనున్నాయి.
ఫుడ్, FMCG రంగంలో భారీ విస్తరణ
గోద్రేజ్ గ్రూప్ (₹150 కోట్లు) – డెయిరీ సామర్థ్యాన్ని రోజుకు 5 లక్షల లీటర్లకు విస్తరణ
Fertis India (₹2,200 కోట్లు) – ఫుడ్ & అగ్రికల్చర్ R&D, రేర్ షుగర్స్ తయారీ
KJS India (₹650 కోట్లు) – F&B మాన్యుఫాక్చరింగ్ యూనిట్–2 విస్తరణ
Vintage Coffee (₹1,100 కోట్లు) – ప్రీమియం ఫ్రీజ్-డ్రైడ్ కాఫీ ప్లాంట్
Reliance Consumer Products (₹1,500 కోట్లు) – FMCG తయారీ సదుపాయాలు
డేటా సెంటర్లతో తెలంగాణ టెక్ హబ్‌గా
డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగంలో భారీ పెట్టుబడులు MoUs రూపంలో వెల్లువెత్తాయి.
Infrakey DC Parks (₹70,000 కోట్లు) – AI-రెడీ 1GW డేటా పార్క్
AGP Group (₹6,750 కోట్లు) – హైపర్‌స్కేల్ DC క్యాంపస్, BESS
JCK Infra (₹9,000 కోట్లు) – డేటా సెంటర్ సర్వీసులు
Aqylon Nexus – 50 MW క్లీన్ ఎనర్జీ ఆధారిత నెట్-జీరో డేటా సెంటర్
Purview Group – గ్లోబల్ కేపబిలిటీ సెంటర్, 50 MW డేటా సెంటర్ (3,000 ఉద్యోగాలు)
ఫార్మా, బయోటెక్ రంగంలో బలమైన పెట్టుబడులు
హెరో, భారత్ బయోటెక్, అవరోబిందో, గ్రాన్యూల్స్ ఇండియా, బయాలాజికల్ ఈ వంటి ప్రముఖ కంపెనీలు తెలంగాణను తమ విస్తరణకు ప్రధాన కేంద్రంగా ఎంచుకున్నాయి.
Hetero (₹1,800 కోట్లు) – పెద్ద ఎత్తున ఫార్ములేషన్స్ ప్లాంట్లు, 9,000 ఉద్యోగాలు
Bharat Biotech (₹1,000 కోట్లు) – CRDMO ఫెసిలిటీ
Aurobindo Pharma (₹2,000 కోట్లు) – కాంప్లెక్స్ జనరిక్స్ & బయోసిమిలర్స్
Granules India (₹1,200 కోట్లు) – పెప్టైడ్ & ఆంకాలజీ CDMO
Biological E (₹3,500 కోట్లు – కొత్త పెట్టుబడి) – వ్యాక్సిన్, R&D & CDMO విస్తరణ; 150 ఎకరాలు అవసరం
తెలంగాణ రాష్ట్రం పర్యాటకం, ఆరోగ్యం, టెక్నాలజీ, డేటా సెంటర్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షిస్తోంది. అంతర్జాతీయ కంపెనీల పెద్ద ఎత్తున ఆసక్తి తెలంగాణను భారత్ ఫ్యూచర్ సిటీ విజన్ దిశగా వేగంగా తీసుకెళ్తోంది. ఉద్యోగావకాశాలు, పరిశ్రమల విస్తరణ, గ్లోబల్ భాగస్వామ్యాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు భారీ ఊతం ఇవ్వనున్నాయి.