చేవెళ్ల ప్రమాదం నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్స్ ఏర్పాటు

నిబంధనలు ఉల్లంఘిస్తే ఇక కఠిన చర్యలు తీసుకోవడమే లక్ష్యం.

Update: 2025-11-12 13:50 GMT

చేవెళల బస్సు ప్రమాదం నేపథ్యంలో రోడ్ సేఫ్టీపై తెలంగాణ రోడ్డు రవాణా శాఖ ఫోకస్ పెట్టింది. నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై కఠన చర్యలు తీసుకోవడం కోసం ప్లాన్ ఆఫ్ యాక్షన్‌ను రూపొందించింది. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా 33 ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలను మూడు ఫ్లైయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేయాలని నిశ్చయించింది. సచివాలయంలో రవాణా శాఖ ముఖ్య అధికారులతో రవాణా శాఖ మంత్రి పొన్నంప్రభాకర్ నిర్వహించిన సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు. దీనికి సంబంధించిన మార్గర్శకాలపై కూడా చర్చించారు. ఈ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు ప్రతిరోజూ విధిగా ఆకస్మిక తనిఖీలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రాంతాలపై సదరు బృందాలకు సమాచారం ఇవ్వనున్నారు.

ఈ బృందాలు ఓవర్ లోడ్ లారీలు, బస్సులు, మనరల్ ట్రాన్స్‌పోర్ట్ సాండ్, ఫ్లైయాష్, స్టోన్, బిల్డింగ్ మెటీరియల్స్, వాహనాల ఫిట్‌నెస్, పొల్యూషన్, చలానాలు‌ను తనిఖీ చేస్తాయి. వాటికి అదనపు పెనాల్టీతో పాటు వాహనాలను సీజ్ చేసేలా చర్యలు తీసుకుంటారు. ఒక్కో ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్‌లో డిటిసి ఎంవీఐ , ఏఎంవీఐ ఇతర సిబ్బంది ఉండనున్నారు. ఇటీవల రద్దు చెస్ పోస్ట్ లో పని చేసిన సిబ్బందిని కూడా ఎన్ఫోర్స్మెంట్ లో చేసేలా ఆదేశాలు జారీ చేశారు. ఎన్ఫోర్స్మెంట్ బృందాలు ప్రయాణికులతో వెళ్తున్న ఆటోలు , వ్యవసాయ సంబంధిత ట్రాక్టర్ లపై వేధింపులకు గురి చేయరాదని ఆదేశాలు జారీ చేశారు.

జెటిసి (ఎన్‌ఫోర్స్‌మెంట్) రాష్ట్ర ఎన్‌ఫోర్స్‌మెంట్ స్క్వాడ్‌ను జిల్లాల నుండి మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్(MVI) లేదా అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్(AMVI)లతో ఏర్పాటు చేస్తారు. ఈ స్క్వాడ్ నెలవారీ రొటేషన్ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు చేస్తుంది. జెటిసి-హైదరాబాద్, డిటిసిలు ప్రభుత్వ సెలవు దినాలతో సహా అన్ని సమయాల్లో కనీసం ఒక ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం రోడ్డుపై ఉండే విధంగా యాక్షన్ ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్‌లోని జెటిసి ,రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ , సంగారెడ్డి DTCలు ప్రతి వారం కనీసం రెండుసార్లు అంతర్-రాష్ట్ర కాంట్రాక్ట్ క్యారేజ్ (CC) బస్సులపై తనిఖీలు నిర్వహిస్తారు. ఈ విధంగా యాక్షన్ ప్లాన్ రూపొందించనున్నారు. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకుండా తిరిగే వాహనాలు, ముఖ్యంగా భారీ, మధ్య తరహా వస్తువుల వాహనాలు ప్రయాణీకుల వాహనాలు, విద్యా సంస్థ బస్సులు సీజ్ చేయబడతాయి. వస్తువుల వాహనాలలో ఓవర్‌లోడింగ్ వాహనాలను స్వాధీనం చేసుకోవాలి. అదనపు లోడ్‌ను ఆఫ్‌లోడ్ చేయకుండా అనుమతించకూడదు. సంబంధిత అధికారులు ప్రారంభ పాయింట్ల దగ్గరే ఓవర్‌ లోడింగ్ ముప్పును అరికట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే గత వారం చేవెళ్ల బస్సు ప్రమాదంతో నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలపై మంత్రి పొన్నం ఫోకస్ పెట్టారు. ఇప్పటి వరకు నిబంధనలు ఉల్లంఘంచిన వాహనాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఆరా తీశారు. వారం రోజుల వ్యవధిలో 2576 వాహనాల పై కేసులు నమోదు చేశారు. ఇందులో ఓవర్ లోడ్ తో వెళ్తున్న 352 లారీలు , 43 బస్సుల పై కేసులు నమోదు చేశారు.. ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ లు వేగవంతం అయ్యేలా చూడాలని ఆదేశించారు. రవాణా శాఖ సిబ్బందికి ప్రతి 30 మందికి ఒక బ్యాచ్ చొప్పున శిక్షణ ఇవ్వాలి. మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడానికి మహిళా ఆటో అనుమతులు ఇచ్చేలా కార్యాచరణ తీసుకోవాలి. వచ్చే రోడ్ సేఫ్టీ మంత్ పై ప్రజల్లో విసృత అవగాహన కల్పించాలనీ ఆదేశించారు.

Tags:    

Similar News