
మన ఫిల్టర్ కాఫీ నెంబర్ 1
ఉదయాన్నే.. ఓ గ్లాస్ కాఫీ గొంతులో వేడిగా దిగుతూ.. దాని రుచిని నాలుక మీద అనుభవిస్తూ ఉంటే.. ఆ ఆనందం మాటల్లో వర్ణించలేం.. అలాంటి మనకాఫీ టేస్ట్ జాబితాలో..
తెలతెలవారుతుండగా ఒక కప్పు కాఫీ తాగందే ఏమి తోచదు.. ఎవరికైనా సరే.. కాఫీ అలా జీవితాల్లో పెనవేసుకుపోయింది. ప్రపంచ వృద్ది రేటు సున్నా నుంచి రెండు దాటడానికి నానా అవస్థలు పడుతోంది. కానీ కాఫీ వృద్ది మాత్రం ప్రతి ఏటా రెండంకెల వేగంతో దూసుకుపోతోంది. అందులో భారతదేశం కూడా ఉంది. వ్యాపారపరంగా టాప్ 20 మార్కెట్ కలిగిన దేశాల్లో మనకు స్థానం దక్కింది.
ప్రపంచ వ్యాప్తంగా అనేక రకాల వెరైటీల కాఫీలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇందులో కెఫిన్ ప్రధానంగా కనపడుతుంది. ఇలా భారతీయులు అమితంగా ఇష్టపడే కాఫీల్లో సౌత్ ఇండియన్ కాఫీ టేస్ట్ అట్లాస్ జాబితా ప్రకారం రెండోస్థానంలో ఉంది. ఈ జాబితాలో క్యూబన్ ఎస్ప్రెస్సో అగ్రస్థానం లభించింది. ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 38 రకాల కాఫీలను టేస్ట్ లను పరిశీలించి ఈ జాబితా ప్రకటించింది.
'క్యూబన్ ఎస్ప్రెస్సో' డార్క్ రోస్ట్ కాఫీ, చక్కెరను ఉపయోగించి తయారు చేసిన తియ్యటి ఎస్ప్రెస్సో షాట్‌ను కలిగి ఉంటుంది. కాఫీ కాచేటప్పుడు ఇందులో చక్కెర కలుపుతారు. ఇది స్టవ్‌టాప్ ఎస్ప్రెస్సో మేకర్‌లో లేదా ఎలక్ట్రిక్ ఎస్ప్రెస్సో మెషిన్‌లో తయారు చేయబడుతుంది. తయారీ శైలి కాఫీ పైన లేత గోధుమ రంగు నురుగును కూడా కలిగిస్తుంది
భారతీయ ఫిల్టర్ కాఫీ సాధారణ, సమర్థవంతమైన భారతీయ కాఫీ ఫిల్టర్ యంత్రాన్ని ఉపయోగించి తయారు చేస్తారు. ఈ మెషిన్ స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేశారు. ఇందులో రెండు గదులు ఉంటాయి. ఈ కాఫీ తయారీ దక్షిణ భారతదేశంలో విస్తృతంగా ప్రాచుర్యం పొందింది.
ఈ బ్రూవింగ్ టెక్నిక్ ఫలితంగా చాలా రుచిగా, నిండుగా ఉండే కాఫీని సాధారణంగా పాలతో కలుపుతారు. చక్కెరతో తియ్యగా ఉంటుంది. ఇది సాంప్రదాయకంగా ఒక టంబ్లర్‌తో పాటు సాసర్‌తో వడ్డిస్తారు. కొన్నిసార్లు, కాఫీ, గోరువెచ్చని పాలు కలిపి ఒక పాత్ర నుంచి మరొక పాత్రకు నిరంతరం పోస్తారు, అది గాలిలోకి వెళ్లి నురుగుగా మారుతుంది.
TasteAtlas ద్వారా ర్యాంక్ చేయబడిన ప్రపంచంలోని టాప్ 10 కాఫీల జాబితా :
1. క్యూబన్ ఎస్ప్రెస్సో (క్యూబా)
2. సౌత్ ఇండియన్ కాఫీ (భారతదేశం)
3. ఎస్ప్రెస్సో ఫ్రెడ్డో (గ్రీస్)
4. ఫ్రెడ్డో కాపుచినో (గ్రీస్)
5. కాపుచినో (ఇటలీ)
6. టర్కిష్ కాఫీ (టర్కీయే)
7. రిస్ట్రెట్టో (ఇటలీ)
8. ఫ్రాప్పే (గ్రీస్)
9. ఐస్కాఫీ (జర్మనీ)
10. వియత్నామీస్ ఐస్‌డ్ కాఫీ (వియత్నాం)
Next Story

