తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ సస్పెండ్

Producer :  Chepyala Praveen
Update: 2023-12-03 12:11 GMT
DGP ANJAN KUMAR

తెలంగాణ ఇన్ చార్జ్ డీజీపీ అంజన్ కుమార్ ను ఈసీ సస్పెండ్ చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన నేఫథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు సస్పెన్షన్ ఆర్డర్ లో పేర్కొంది. మరి కొద్దిసేపట్లో ఈ ఉత్తర్వులు చీఫ్ సెక్రటరీకి పంపనున్నట్లు తెలిసింది. ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే మధ్యాహ్నం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఇన్ చార్జీ డీజీపీ వెళ్లి కలిసి పుష్ఫ గుచ్ఛం అందించి అభినందించడం వివాదాస్పదమయింది. ఈ సంఘటనను సీరియస్ గా తీసుకున్న ఈసీ, వెంటనే డీజీపీని సస్పెండ్ చేశారని తెలుస్తోంది. అలాగే రేవంత్ ను కలిసిన సీఐడీ చీఫ్ మహేశ్ భగవత్, సంజయ్ కుమార్ జైన్ లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వెంటనే వీటికి వివరణ ఇవ్వాలని కోరింది. ఈ మధ్యాహ్నం 11.30 కే రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో అంజనీ కుమార్  కలుసుకున్నారు. దీనితో ఆగ్రహించిన ఎన్నికల కమిషన్ ఆయన తరువాత ఉన్న సీనియర్ అధికారిని వెంటనే డీజీపీగా నియమించాలని ఆదేశించింది. అందువల్ల రాష్ట్రంలో తదుపరి సీనియర్ ఐపీఎస్ అధికారులైన రాజీవ్ రతన్, గుప్తా ఎవరో ఒకరు తెలంగాణ డీజీపీగా నియమితులయ్యే అవకాశం ఉంది.  

Tags:    

Similar News