'సమయం' కే కథ రాయిస్తున్న పవన్ కళ్యాణ్!
మరో రీమేక్ లో పవన్… ? కానీ అసలైన ట్విస్టు స్క్రిప్ట్‌లోనే ఉంది!;
పవన్ కళ్యాణ్ సిని ప్రయాణంలో మళ్లీ ఒక రీమేక్ చర్చల్లోకి వచ్చింది. గతంలో ఆయన రీమేక్ లు చేసి సూపర్ హిట్ లు కొట్టినవి ఉన్నాయి. ఖుషీ, గబ్బర్ సింగ్ లాంటి సినిమా రీమేక్ ల గురించి అయితే ఇంక చెప్పక్కర్లేదు. అయితే బ్రో సినిమా రీమేక్ అప్పుడు రకరకాల కామెంట్స్ వినపడ్డాయి. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా..తమిళ హిట్ తేరీ రీమేక్ అన్నప్పుడు కామెంట్స్ వినపడ్డాయి.
అయితే అవన్నీ పవన్ కళ్యాణ్ లెక్క చేయనవే. ఆయన చేయాలనుకన్నవి చేసేస్తూంటారు. ఆ క్రమంలోనే ఇప్పుడు ఆయన మరో రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అయితే అయితే ఇప్పుడు వరస సినిమాలు చేతిలో ఉన్నప్పుడు పనిగట్టుకుని రీమేక్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?
అయితే అందుకు కారణం ఒకప్పుడు గ్రాండ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ప్లాన్ చేసిన సురేందర్ రెడ్డి – రామ్ తల్లూరి సినిమానే అంటున్నారు. ఏళ్ల తరబడి స్టాల్ అయిన తర్వాత ఇప్పుడు మళ్లీ తెరపైకి వస్తోంది. అఖిల్ తో చేసిన ఏజెంట్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సురేందర్ రెడ్డి ఒక సినిమా ఉంటుందని అనౌన్స్ చేశారు. ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రామ్ తాళ్లూరి ఆ సినిమా నిర్మించడానికి రెడీ అయ్యారు. అయితే ఆ సినిమా ప్రకటించడమే కానీ ఆ తర్వాత ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తను మొదలు పెట్టిన సినిమాలనే పూర్తి చేయడానికి టైం తీసుకునే పరిస్దితి వచ్చింది. అలాంటిది కొత్త సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లడం అంటే అది వెంటనే సాధ్యం అయ్యే పరిస్థితి కనిపించలేదు. అప్పట్లో భారీ బడ్జెట్, పెద్ద షెడ్యూల్‌తో రూపొందించాలన్న ఆలోచన నుంచి పవన్ ఇప్పుడు పూర్తిగా వెనక్కి వెళ్లిపోయారు. తాజా సమాచారం ప్రకారం, ఆయనే స్వయంగా స్క్రిప్ట్‌ను పూర్తి చేయమని సూచించారని తెలుస్తోంది.
అయితే ఇప్పుడు భారీ సినిమా ఎక్కువ డేట్స్ అవసమైన సినిమా వద్దని, సింపుల్ సినిమా చేయాలనేదే అసలైన ఐడియా? అని తెలుస్తోంది. అందుకు ఏకైక మార్గం రీమేక్. అందుకోసం తమిళ రీమేక్ ని చూడమని పురమాయించినట్లు తెలుస్తోంది. ఒక తమిళ హిట్ రీమేక్ చేయడం. తక్కువ డేస్‌లో పూర్తయ్యే, కానీ మాస్‌కి నచ్చే కంటెంట్ ఉండేలా డిజైన్ చేయాలన్నదే పవన్ పర్సనల్ గైడెన్స్.
Agent ఫెయిల్యూర్ తర్వాత సురేందర్ రెడ్డికి ఇదే ఛాన్స్?
‘Agent’ డిజాస్టర్ అయ్యిన తర్వాత సురేందర్ రెడ్డి కెరీర్ ఓ డైలమోలో చేరింది. ఇప్పుడు పవన్‌తో రీ ఎంట్రీ అంటే, అది సర్దుబాటు కంటే రిడెంప్షన్. పవన్ పాపులారిటీ, రాజకీయ బిజీ షెడ్యూల్ రెండూ కలిపి, త్వరగా షూట్ అయే సినిమా కావాలి. అందుకే భారీ కథ కాదు, హై ఎమోషనల్ డ్రామా – క్రిస్ప్ స్క్రీన్‌ప్లే ఉండే రీమేక్‌పై ఫోకస్.
పవన్ ఇప్పటికే OG ఫినిష్ చేసి, సెప్టెంబర్ రిలీజ్‌కు రెడీ అయ్యారు. ఉస్తాద్ భగత్ సింగ్ కూడా చివరి దశలో ఉంది. ఇప్పుడు ఈ రీమేక్ క్లియర్ అయితే, ఎలక్షన్స్ ముందు మూడో సినిమా కూడా కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది. ఆయనకు సినిమాల్లో ఉండే సమయం లిమిటెడ్ – అందుకే ఈ "quick yet quality" ఫార్ములా.
మరో వైపు సురేందర్ రెడ్డికి కూడా పవన్ కళ్యాణ్ ఒక్కడే ఆప్షన్ లా ఉన్నాడు. మరో పెద్ద హీరో అవకాశం ఇస్తాడా లేదా అన్నది తెలియని పరిస్దితి. సో సురేందర్ రెడ్డి నెక్స్ట్ సినిమా విషయంపై వెంటనే తేల్చుకోవాల్సి ఉంది. దాంతో పవన్ కళ్యాణ్ ని మెప్పించే కథతో ఎలా వస్తాడా అన్నది చూడాలి. మాస్ డైరెక్టర్ గా స్టార్ డం తెచ్చుకున్న సురేందర్ రెడ్డి కెరీర్ ఇలా తలకిందులు అవుతుందని అతను కూడా ఊహించి ఉండడు. ఈ టైం లో పవన్ సినిమా పడి అది సూపర్ హిట్ ఐతే మాత్రం సూరి మళ్లీ కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు.
ఎలాంటి కథే ఉండాలి
ఈ క్రమంలో సురేందర్ రెడ్డి కొన్ని అంశాలు దృష్టిలో పెట్టుకుని చేయాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్దితుల్లో పవన్ కళ్యాణ్‌ను ఒక సాధారణ హీరోలా చూస్తే పొరపాటే. ఒకవైపు ఆయన స్టార్‌డియం ఉన్న నటుడు మరోవైపు ప్రజల్లో తన నాయకత్వం నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్న పార్టీ అధినేత – జనసేనా వ్యవస్థాపకుడు. ఈ రెండు పాత్రల మధ్య సమతుల్యతతో ఆయన ముందుకు వెళ్తున్నారు. అందుకు తగ్గట్లే ఉండాలి కథ. సినిమాల్లో ఎక్కువ రోజులు ఖర్చు చేస్తే రాజకీయాలు నెమ్మదిస్తాయి. రాజకీయాల్లో పూర్తిగా లీనమైతే సినిమాల నుంచి క్రేజ్ తగ్గే ప్రమాదం. అందుకే పవన్ ఎంచుకున్న వ్యూహం: తక్కువ డేస్ – ఎక్కువ రీచ్ – టైమ్ ఎఫిషియెన్సీ అనే స్క్రిప్ట్ సెలెక్షన్ ఫిలాసఫీ.
స్క్రిప్ట్ సెలెక్షన్ ఎలా ఉంటుందంటే..
గతంలో పవన్ కళ్యాణ్ సినిమా ఎంచుకుంటే, అది ఎమోషనల్ అండ్ ఫిజికల్ ఎనర్జీ ఎక్కువగా అవసరపడే కథలే అయ్యేవి (అత్తారింటికి దారేది, ఖుషి వంటి సినిమాలు). కానీ ఇప్పుడు:
తక్కువ హీరో, విలన్ డైనమిక్స్, విడుదలకి ఈజీ మార్గం, ప్లాన్ చేసిన డేస్‌లో షూట్ క్లోజ్ అయ్యేలా బౌండ్ స్క్రిప్ట్ . ఈ మార్పు అనేది ఒక మెచ్యూర్డ్ స్ట్రాటజీ. ఇది పవన్ ఒక్కరిలో కాదు — రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ లాంటి పాలిటికల్ యాక్టర్‌లందరిలోనూ కనిపించే లక్షణం: కేవలం నటించడం కాదు, ప్రాజెక్ట్ ఆర్థిక-రాజకీయ సమయాన్ని ప్లాన్ చేయడం. సురేందర్ రెడ్డి వంటి డైరెక్టర్లు, "పవన్ కాల్"కు నో చెప్పే అవకాశం లేదు. ఇది డైరెక్టర్లకు షార్ట్ ఫార్మ్ ఛాలెంజ్.
పవన్ స్ట్రాటజీ
మరో రీమేక్ లా కనిపించినా, ఇది పవన్ ప్లాన్ చేసిన పాలిటికల్ టైమ్ మేనేజ్‌మెంట్ స్ట్రాటజీ. ఫాస్ట్ షూట్, మాస్ హిట్, దర్శకుడికి ఛాన్స్ – అన్నీ ఒకే స్క్రిప్ట్‌లో బ్యాలెన్స్ చేయడం ఇదే మొదటిసారి కావచ్చు.మరో ప్రక్క అభిమానులు మాత్రం రీమేక్ ప్రాజెక్ట్‌లు అయినా, దానికి పవన్ టచ్ వస్తే అది మార్కెట్‌లో కొత్తగా కనిపిస్తుందన్నదనే నమ్మకంతో ఉన్నారు.