'కాంతార' డివోషనల్ యూనివర్స్ లోకి ఎన్టీఆర్?
నిర్ణయం వెనుక అసలు కథ....;
'కాంతార' యూనివర్స్‌లో ఎన్టీఆర్ ఎంట్రీ అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు, సినీ విశ్లేషకులు దీన్నో గొప్ప కాంబినేషన్‌గా చూస్తున్నారు. రిషబ్ శెట్టి మిస్టిక్ ఫోక్ నారేటివ్‌కు ఎన్టీఆర్ మాస్ స్క్రీన్ ప్రెజెన్స్ జత కలిస్తే – అది కేవలం ఓ సినిమా కాదు, పాన్-ఇండియా కల్చరల్ ఫెనామెనా అవుతుందని అంటున్నారు. ఇప్పటికే #NTRinKantara3, #DivineTiger వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్‌లోకి రావడం మొదలైంది. ఈ క్రేజ్‌కు నిదర్శనం. ఈ నేపధ్యంలో ఎన్టీఆర్ వంటి స్టార్ హీరో ..ఇలాంటి డివోషనల్ సినిమాలకు ఎంట్రీ ఇస్తే ఏం జరుగుతుంది. మార్కెట్లు ఏ విధంగా స్పందిస్తాయో చూద్దాం.
“Cinema is not just a story. It’s mythology in motion.” – Alejandro González Iñárritu (బాబిల్, 21 గ్రామ్స్ ,అమెరోస్ పెరోస్ వంటి క్లాసిక్స్ డైరక్టర్)
ఇండియన్ సినిమా ఇప్పుడు ఒక కొత్త మోడ్‌లోకి, మోడల్ లోకి మారుతోంది. బాహుబలి మొదలు, కాంతారా వరకు — జస్ట్ యాక్షన్ కాదు, ఆధ్యాత్మికత, దేవతలు, పౌరాణిక అనుభూతులు ప్రధాన సెంటిమెంట్‌గా మారాయి. ఇప్పుడు ఇది కేవలం ఒక సినిమా ట్రెండ్ కాదు… ఇది కల్చరల్ పిలుపుగా విశ్లేషకులు చెప్తున్నారు. రిషబ్ శెట్టి రాసి, నటించి, దర్శకత్వం వహించిన ఈ సినిమాతో ఆయనకు జాతీయ స్థాయిలో విశేష గుర్తింపు లభించింది. ఇక ఇప్పుడు ఆయన దృష్టంతా కాంతార 2 పైనే ఉంది. ఇది త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే అసలైన బాంబ్ కాంతార 3 రూపంలో పేలబోతోందని సమాచారం. రెండో భాగం కథలోనే మూడో భాగానికి ఓ బలమైన లీడ్ ఇవ్వబోతున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. కాంతార 3ను మరింత గ్రాండ్‌గా, పాన్-ఇండియా స్థాయిలో తీర్చిదిద్దాలని రిషబ్ శెట్టికి స్పష్టమైన వ్యూహం ఉందట.
ఇందులో భాగంగా ఒక ప్రముఖ స్టార్ హీరోను ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకురావాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ స్టార్ ఎవరో కాదు — మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని ఇండస్ట్రీలో గట్టిగానే చర్చ నడుస్తోంది. ఇటీవల రిషబ్ శెట్టి, ఎన్టీఆర్ కలిసి ఒక ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించినట్టు సమాచారం. అదే సమయంలో కాంతార 3 కు సంబంధించిన ప్రాథమిక చర్చలు జరిగిపోయినట్టుగా న్యూస్. మోస్ట్ ఇంట్రిగ్యూయింగ్ విశేషం ఏంటంటే — కాంతార 2 లోనే ఎన్టీఆర్ పాత్రకు ఓ సీక్రెట్ లీడ్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ నేపధ్యంలో ఎన్టీఆర్ వంటి హీరో, రిషబ్ శెట్టి వంటి డైరెక్టర్ చేతుల్లో ఓ డివైన్ యూనివర్స్‌లో అడుగుపెడితే, దాని ప్రభావం గణనాతీతంగా ఉంటుంది. ఎందుకు అంటే... కాంతారా కన్నడ చిత్రంగా మొదలై, దేశమంతా ఓ కల్ట్ ఫీనామెనాగా మారింది. భూదేవత, భూతకోల, ధార్మిక ఆచారాలతో వచ్చిన ఈ మిస్టిక్ థ్రిల్లర్ – యూరప్, జపాన్, అమెరికా వంటి మార్కెట్లలోను థియేటర్లో విడుదల అయ్యింది. ఇది మూడ్‌గా లేదు, మార్కెట్‌గా స్థిరపడుతోంది.
ఇలాంటి సమయంలో ఒక జాతీయస్థాయి మాస్ హీరో అయిన ఎన్టీఆర్ ఈ యూనివర్స్‌లో అడుగుపెడితే... మిస్టిక్ సినిమాలకి కమర్షియల్ స్కేలు మూడు రెట్లు పెరుగుతుంది. ఎన్టీఆర్ ఇప్పుడు మాస్ హీరో కాదు, పాన్-ఇండియా ఫేస్. RRR తర్వాత ఆయన క్రేజ్ నేషనల్ గానే కాదు, ఇంటర్నేషనల్ గా కూడా విస్తరించింది. Oscars, Golden Globes వేదికలపై ‘Naatu Naatu’ చూసినప్పుడు ఆ ఎనర్జీని మెచ్చుకోని వారు లేరు.
* ఎన్టీఆర్...ఈ మిస్టిక్ డివోషనల్ యూనివర్స్లోకి తీసుకెళ్తే?కలిసొచ్చేదేంటి
హైదరాబాద్, బెంగుళూరు, ముంబై టికెట్ సేల్స్ ఒక ఎత్తు.
న్యూయార్క్, లండన్, మెల్బోర్న్ సబ్‌కల్చర్ థియేటర్స్ మరో ఎత్తు.
* బిజినెస్ పరంగా వచ్చే భారీ ప్లస్‌లు
A. Box Office Scalability
Kantara ఒంటరిగానే ₹150Cr గ్రాస్ చేసింది, ఇది Rs. 16Cr బడ్జెట్ సినిమాకు అద్భుతం.
ఎన్టీఆర్ Presence తో Kantara 3 ఒక్క ఫస్ట్ వీకెండ్‌లో ₹300Cr దాటి వెళ్లే ఛాన్సుంది.
ఇది బాహుబలి, RRR తరహాలో ఒక event cinemaగా నిలవచ్చు.
B. Satellite + Digital Rights Explosion
RRR తర్వాత ఎన్టీఆర్ సినిమాలకు హిందీ డబ్, అంతర్జాతీయ డిస్ట్రిబ్యూషన్‌కి ప్రీమియం మార్కెట్ ఏర్పడింది.
Kantara 3 వంటి మిస్టిక్ కంటెంట్ కోసం Netflix, Prime Video లాంటి OTTలు ముందుగానే ₹100Cr+ కు తీసుకోవచ్చు.
C. Brand Collaboration Potential
Ayodhya, Kashi, Kedarnath వంటి బ్రాండ్లతో కలిపే spiritual tourismని కూడా tie-in చేయగల స్కోప్ ఉంటుంది.
NFTs, Merchandise, Folk-Themed Mobile Games వంటివి పెద్దగా మార్కెట్ చేయొచ్చు.
* ఎన్టీఆర్ కి ఇలా చేయటంతో ఏం కలిసి వస్తుంది?
1. కొత్త జానర్‌కి ఎంట్రీ ,నేషనల్ క్రిటిక్స్ కి పని
ఎన్టీఆర్ ఇప్పటివరకు చేసిన పాత్రలు ఎక్కువగా మాస్ యాక్షన్, డ్రామా ఆధారిత పాత్రలే. కానీ కాంతార తరహాలో మిస్టిక్, డివోషనల్, ఫోక్ మాజిక్ కలిపిన సినిమాలు ఆయన కెరీర్‌లో లేవు. ఇలాంటి కొత్త జానర్‌లోకి అడుగుపెట్టడం వలన… కొత్తగా కనిపించగలగుతారు. యాక్టింగ్ స్కోప్ పెరిగి, తనలోని వైవిధ్యం ప్రూవ్ చేసుకోవచ్చు. నేషనల్ క్రిటిక్స్ కూడా లోతుగా గమనించే పాత్ర అవుతుంది.
2. పాన్-ఇండియా స్టర్డమ్ మరింత బలోపేతం
RRR తర్వాత ఎన్టీఆర్‌ను ఉత్తర భారతదేశంలో కూడా పెద్ద స్థాయిలో గుర్తించారు. కానీ అందులో రాజమౌళి క్రెడిట్ కూడా ఉంది. ఇక కాంతార 3 లాంటి విభిన్నమైన, దేశవ్యాప్తంగా పూజించబడే ఫోక్ థీమ్ ఉన్న సినిమాల్లో నటిస్తే…బెంగళూరు, చెన్నై, కోయంబత్తూరు, కేరళ, మహారాష్ట్ర మార్కెట్లలో మునుపటి కన్నా బలమైన ఫాలోయింగ్ ఏర్పడుతుంది.
3. ఇంటర్నేషనల్ ఫెస్టివల్ రీచ్
Kantara లాంటి చిత్రాలు ఫ్రాన్స్, జపాన్, టోరంటో వంటి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో స్క్రీనింగ్ అవుతున్నాయి. ఎన్టీఆర్ వంటి స్టార్ అక్కడ నటిస్తే, అదే స్థాయిలో ఎన్టీఆర్ కు… ఆర్ట్-హౌస్ ఆడియన్స్‌లో గుర్తింపు, ప్రతిష్టాత్మక పురస్కారాల దృష్టిలో స్థానం, ఒక మల్టీ-లెవెల్ యాక్టర్‌గా గుర్తింపు లభిస్తుంది.
4. కమర్షియల్ పరంగా మైలురాయి
ఎన్టీఆర్, రిషబ్ శెట్టి కాంబోతో వచ్చే సినిమాకు OTT ప్లాట్‌ఫామ్స్, థియేట్రికల్ బిజినెస్ మీద భారీగా ఆఫర్లు రావడం ఖాయం. కేవలం తెలుగు మార్కెట్‌కి కాదు — హిందీ, కన్నడ, తమిళం, మలయాళం డబ్బింగ్‌లతో ₹1000Cr కలెక్షన్ క్లబ్ టార్గెట్ చేయగలదు. మెర్చండైజింగ్, ఫోక్ కల్చర్ టూరిజం, థీమ్ బేస్డ్ స్పినాఫ్‌లు అనే కొత్త మార్కెట్లను కూడా టచ్ చేయొచ్చు.
5. హీరోగా ఇమేజ్ ట్రాన్స్ఫర్మేషన్
ఇది ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఎన్టీఆర్‌కు కొత్త ఇమేజ్‌ను తీసుకువస్తుంది. పౌరాణికత, భక్తి, మానవతా విలువల చుట్టూ తిరిగే పాత్రలు ఎప్పుడూ సుదీర్ఘకాలిక గుర్తింపునిస్తాయి. . "NTR as a Divine Force" అనే కాన్సెప్ట్ — అది ఓ కల్ట్ following తెచ్చే అవకాశముంది.
6. మల్టీవర్సు/యూనివర్స్ బిల్డింగ్‌లో భాగస్వామ్యం
Kantara Universe ఒక కదులుతున్న ఫ్రాంచైజీగా మారుతోంది. Kantara 1 → 2 → 3… ఇది భవిష్యత్తులో Kantara Origins, Kantara Legends, Kantara Anthology వంటి స్పినాఫ్‌లు చేసే స్కోప్‌ను కలిగి ఉంది. ఎన్టీఆర్ ఇప్పుడు ఇందులో ఎంట్రీ ఇస్తే, ఆయన పాత్ర భవిష్యత్తులో అంతిమ స్థాయికి వెళ్లే "Deity Avatar" అయ్యే అవకాశముంది. రిషబ్ శెట్టి లాంటి కథల మాస్టర్ చేతుల్లో, ఎన్టీఆర్ పాత్ర ఒక నూతన పౌరాణిక బలంగా కలకాలం నిలవొచ్చు — not just a hero, a myth in the making.
ఫైనల్ గా..
కాంతారా అనేది మాస్ స్టైలే కాకుండా ఫిలాసఫీ + పవర్ కలిపే కథా భూమిక. సాంప్రదాయం మీద ఆధారపడే పాత్రలో ఓ స్టార్ హీరో కనిపించడం, అనుభవాతీతమైన నమ్మకాన్ని తెస్తుంది. ఈ కాంబినేషన్ కనుక నిజంగా జరిగితే.. పాన్-ఇండియా కాదు… పాన్-కల్చరల్ సినిమా కావచ్చు ! ఎన్టీఆర్ – కాంతారా లాంటి కథనంలో చేయడం కేవలం ప్యాన్-ఇండియా మార్కెట్ కోసం కాదు. ఇది భారత్‌లోని భిన్న సంస్కృతుల్ని ఒకే స్క్రీన్ మీద కలిపే ప్రయత్నం. ఇది మిస్టిక్ యూనివర్స్‌ని కమర్షియల్‌గా, ఫిలాసాఫికల్‌గా, కళాత్మకంగా లెవలప్ చేసే అవకాశం.