‘షారుక్’ తో నటించడమంటే సాహసమే: జూహీ చావ్లా

తన సినీ కెరీర్ లో ఎన్నో చిత్రాలు ఉన్నప్పటికీ ఇప్పటికే ‘డర్’ మూవీ తో పోషించిన పాత్ర అంటే ఎంతో ఇష్టమని జూహీ చావ్లా చెప్పారు.

Update: 2024-11-14 06:06 GMT

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తెరపై అనేక పాత్రలకు ప్రాణం పోశాడు. ఆయన అబ్సెసివ్ ప్రేమికుడిగా నటించిన చిత్రం ‘డర్’. కింగ్ ఖాన్ తన పేరును క..క..క.. కిరణ్ అని పలకడం ప్రేక్షకులను ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ సినిమా విడుదలై కొన్ని సంవత్సరాలు గడిచిన ప్రజలు ఈ చిత్రాన్ని, షారుక్ ఖాన్ డైలాగ్ లను మర్చిపోరు. షారుక్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడమంటే సాహసం చేయడం లాంటిదే అని  జూహీ చావ్లా చెప్పారు. 

ఈ చిత్రంలో ఖాన్ కు జోడిగా జుహీ చావ్లా తో పాటు , సన్నీ డియోల్ నటించారు. అయితే డర్ చిత్రంలో మొదట యష్ చోప్రా షారుక్ ఖాన్ పోషించిన పాత్ర కోసం ఆమీర్ ఖాన్ ను సంప్రదించడట. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల మిస్టర్ ఫర్ ఫెక్ట్ ఈ చిత్రం చేయలేకపోయాడట.

ఈ చిత్రాన్ని జుహీ చావ్లా స్వయంగా వెల్లడించారు. ఈ రోజు తన పుట్టిన రోజు సందర్భంగా జుహీ చావ్లా పాత విషయాలను పంచుకున్నారు. డర్ చిత్రంలో పోషించిన పాత్ర తన సినీ కెరీర్ లోనే అత్యంత ఇష్టమైనదని పేర్కొన్నారు.

‘‘ డర్ పాత్ర కోసం మొదట యష్ జీ ఆమీర్ ఖాన్ ను తీసుకోబోతున్నాడని విని సంతోషించాను. ఎందుకంటే నాది, ఆమీర్ ఖాన్ సినిమా ప్రయాణం ఒకే చిత్రంతో మొదలైంది. ఆయనతో పని చేయడం నాకు సౌకర్యంగా ఉంటుంది. తరువాత ఏమైందో ఏమో ఆయన చిత్రం నుంచి తప్పుకున్నాడని విన్నాను.
ఈ పాత్ర మెల్లగా అజయ్ దేవ్ గన్ తో పాటు మరికొందరు యువ హీరోల దగ్గరికి వెళ్లింది. కానీ వారు ఎవరు రాలేదు. చివరకు షారుక్ ఖాన్ ఒప్పుకున్నారు. ఇదే చిత్రం ఎందుకు ప్రత్యేకమైనదో నేను చెప్పలేను’’ అని జూహీ జాతీయ మీడియాకు చెప్పారు. కాగా జూహీ, ఆమీర్ మొదటి సినిమా ‘ ఖయామత్ సే ఖయామత్ తక్’ లో జోడీగా నటించారు.
‘ డర్ ’ ప్రారంభమయ్యే నాటికి రాజు బన్ గయా జెంటిల్ మన్ సినిమా ను కూడా పూర్తి చేశారు. చివరకు షారుక్ తో తను దిగ్విజయంగా సినిమా పూర్తి చేశానని చెప్పారు. కింగ్ ఖాన్ సినిమా చేయాలంటే సాహసం ఉండాలని చెప్పారు.
ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ సందర్భంగా షారుక్ ఖాన్, సన్నీ డియోల్ మధ్య గొడవ జరిగింది. ఈ కారణంగా వారు ఇండస్ట్రీలో దాదాపు 16 సంవత్సరాలు మాట్లాడుకోలేదు. ఈ మధ్య గదర్ 2 సక్సెస్ లో ఇద్దరు కలిసి కనిపించారు.


Tags:    

Similar News