'బరీడ్ ట్రూత్' నెట్ ఫ్లిక్స్ క్రైమ్ కథ ఏంటంటే...

క్రైమ్ కు జనం పట్టం కడుతున్నారు. ఒటిటిలు వరస బెట్టి వడ్డిస్తున్నాయి. మొన్న తెలంగాణ కథ ఒటిటి కెక్కింది. ఇపుడు ముంబై క్రైమ్ కథ రెడీ అవుతున్నది. OTT Movie Review

Update: 2024-02-16 10:51 GMT
‘బరీడ్ ట్రూత్’ పోస్టర్

క్రైమ్ కు జనం పట్టం కడుతున్నారు. అది మీడియా కావచ్చు ..సోషల్ మీడియా కావచ్చు..చివరకు మనం చూసే వెబ్ సీరిస్ లు కావచ్చు..క్రైమ్, రక్తం లేనిదే కష్టం అంటున్నారు. మీకేమి కావాలో మేము అదే ఇస్తాం అంటున్నాయి కార్పోరేట్ మీడియా సంస్దలు... స్ట్రీమింగ్ సైట్స్. ఆ క్రైమ్ వెబ్ సీరిస్ ల పోటీలో అమేజాన్, నెట్ ప్లిక్స్ ఇండియా పోటి పడుతున్నాయి. క్రైమ్ కు శృంగారానికే ఇక్కడ టైమ్, డబ్బు కేటాయిస్తున్నారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా ప్రూవైన నగ్నసత్యం. ఆ క్రమంలో నెట్ ప్లిక్స్ వారు ఇప్పటికే Money Heist,Lucifer, Berlin, Dark Desire, Peaky Blinders ఇలా వరస పెట్టి క్రైమ్ ని వడ్డించేస్తున్నారు. అయితే వీటిలో ఫిక్షన్ ఎక్కువ. నిజ జీవిత క్రైమ్ అయితే ఇంకా ఎక్కువ జనాలను ఆకట్టుకుంటుందని నెట్ ప్లిక్స్ అర్దం చేసుకుంది.


రీసెంట్ గా నెట్ ప్లిక్స్ లో ‘కిల్లర్‌ సూప్‌’ అనే క్రైమ్ వెబ్ సీరిస్ వచ్చి దుమ్మురేపింది. బాలీవుడ్‌ విలక్షణ నటుడు మనోజ్‌ బాజ్‌పాయి ప్రధాన పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్‌ మంచి అప్లాజ్ వచ్చింది. డార్క్‌ కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ వెబ్‌ సిరీస్‌ కు మూలమైన కథ ఇన్సిడెంట్ మన తెలంగాణాలో జరిగిందే కావటం మరో విశేషం.  జనవరి 11   ‘కిల్లర్‌ సూప్‌' నెట్ ఫ్లిక్స్ లో విడుదలయింది. ఇందులో మనోజ్‌ బాజ్‌పేయి, కొంకణ సేన్‌ శర్మ నటించారు. 2017లో తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్‌ జిల్లాలో కలకలం రేపిన ఓ హత్యోదంతాన్ని ఆధారంగా చేసుకొని తెరెక్కించిన సిరీస్‌ ఇది.



 

మీకు గుర్తుండే ఉండి ఉంటుంది.  నాగర్ జిల్లాకు చెందిన ఓ వ్యాపారిని ఆయన భార్య ప్రియుడితో కలిసి హత్య చేయడం, తర్వాత ప్లాస్టిక్‌ సర్జరీ ద్వారా ప్రియుడి ముఖాన్ని భర్త ముఖంలా మార్చి తప్పించుకోవాలని చూడడం. ఇది సినిమా కథలా ఉండటంతో చాలా మంది దృష్టి పడింది. దాంతో ఈ అంశాలను తీసుకుని తెరకెక్కించారు. శాఖాహారి అయిన యువతి ప్రియుడు ఆసుపత్రిలో మటన్‌ తినడానికి నిరాకరించడంతో ఈ హత్యోదంతం వెలుగు చూసింది. ఈ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తే సెన్సేషన్ అయ్యింది.

అదే విధంగా ఇప్పుడు మరో క్రైమ్ వెబ్ సీరిస్ కు తెర లేపారు నెట్ ప్లిక్స్ వాళ్లు . షీనా బోరా హత్యకేసు దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. 2012లో ఆమె హత్యకి గురైంది .. 2015లో ఈ విషయం బయటికి వచ్చింది. షీనా బోరా హత్యకేసులో ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జీ అరెస్టు కావడం గురించి దేశమంతా మాట్లాడింది. ఈ హత్యకేసులోని మలుపులు పోలీస్ డిపార్టుమెంటును సైతం షాక్ ఇచ్చాయి.

 




ఈ మర్డర్ కేసు ముంబైలోని బోరా - ముఖర్జీ కుటుంబీకుల జీవితాలను మార్చేసింది. ఆ సంఘటనలన్నింటినీ కలుపుతూ, 'బరీడ్ ట్రూత్' అనే ఒక డాక్యుమెంటరీ సిరీస్ ను రూపొందించారు. ఇరా బాహ్ల్ - షానా లెవీ దర్శకత్వం వహించిన ఈ డాక్యు సిరీస్, 4 ఎపిసోడ్స్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. మేక్ మేక్ - ఇండియా టుడే వారు కలిసి ఈ సిరీస్ ను నిర్మించారు. ఇరా బాహ్ల్, షానా లెవీ దీనికి దర్శకత్వం వహించారు. మేక్‍మేక్, ఇండియా టుడే గ్రూప్ ఈ సిరీస్‍ను నిర్మించాయి. ఫిబ్రవరి 23వ తేదీన ఈ డాక్యు సిరీస్ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. కొన్ని ఒరిజినల్ వీడియో క్లిప్స్ కూడా ఈ సిరీస్ లో చోటుచేసుకోనున్నాయి. ముఖర్జీ, బోరా కుటుంబాల్లో ఉన్న చిక్కుముడులను, సభ్యుల మధ్య దెబ్బతిన్న బంధాలను కూడా సిరీస్‍లో చూపించనున్నారు మేకర్స్. డాక్యుమెంటరీ సిరీస్ కావడంతో వీటిల్లో కొన్ని ఒరిజినల్ ఇంటర్వ్యూలను కూడా మేకర్స్ చూపించనున్నారు. ఇంద్రాణి ముఖర్జీ, వారి కుటుంబం, అటార్నీలు, కొందరు జర్నలిస్టుల ఇంటర్వ్యూలు ఉండనున్నాయి. చూస్తూంటే ఇదీ సెన్సేషన్ అయ్యేటట్లు ఉంది.


Tags:    

Similar News