తగ్గేదేలే: గద్దర్ అవార్డు బన్నీకి ప్రభుత్వ సమాధానమా?
విచారణ నుంచి విజయానికి;
“ఒక మనిషి నమ్మకాన్ని పరీక్షించేవి సంఘటనలు... ఒకరి గొప్పతనాన్ని నిరూపించేవి అవార్డులు.”
ఒక స్టార్ గా ఎదగటం కన్నా, దానిని నిలబెట్టుకోవడం పెద్ద పని. అందుకు కళతో పాటు, వ్యక్తిత్వం కూడా సహకరించాలి. పుష్ప 2 ప్రీమియర్ రోజు సంధ్య థియేటర్ వద్ద చోటుచేసుకున్న సంఘటన, గాయాల్ని దాటి... ఒక స్టార్ ఇమేజ్ను న్యాయస్థానపు పీఠంపై నిలబెట్టింది. ఈ ఘటనలో నిజమేమిటి? తప్పెవరిది? అనే అంశాల కన్నా "బన్నీ స్పందన ఎలా ఉండాలి?" అనే మానసిక ప్రశ్నే దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది..
When art meets mass hysteria, only character can survive the collision.
ఆ క్షణాల్లో, ఆ రోజున బన్నీ మాట్లాడిన ప్రతి మాటను మీడియా,సోషల్ మీడియా పోస్ట్ మార్టం వేసింది. ఆయన్ను క్షమాపణ కోరాల్సిందిగా డిమాండ్ చేయడం మొదలు, కొన్ని వర్గాలు "ఇతను మాస్ మోజులో మానవతా విలువలను మరిచిపోయాడు" అంటూ విమర్శించాయి.
సాధారణ దుర్ఘటన కాదు… అది బన్నీ కెరీర్ ని నిలదీసిన క్షణం
అప్పట్లో, నిత్యం నవ్వుతూ కనిపించే బన్నీ ముఖంలో కనపడిన ఆవేదన అభిమానులను కలచివేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ్ కోలుకుంటున్నాడని తెలియడం ఒక్కటే ప్రస్తుతం తనకు ఊరట కలిగించే అంశమని చెప్పిన మాటలు ఎవరూ మర్చిపోలేరు. అయినా ఒక ఘటన వల్ల ఏర్పడిన ప్రజా ఆగ్రహం, ప్రభుత్వం నుంచి వచ్చిన ఒత్తిడి, బన్నీ మీద ఉన్న పాపులర్ ఇమేజ్ను క్షణాల్లోనే ప్రశ్నార్థకంగా మార్చేసింది.
ఆ ఘటన జరిగినప్పుడు అల్లు అర్జున్ మాట్లాడుతూ.... తాను ఎవరినీ నిందించాలని మాట్లాడటం లేదని.. తనకు ఎవరిపైనా వ్యక్తిగత కోపం లేదని అల్లు అర్జున్ చెప్పారు. ప్రభుత్వం తమ సినిమాకు అన్ని రకాలుగా ప్రోత్సాహం అందించిందని.. అందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. అదే సమయంలో తనను మానవత్వం లేని వ్యక్తిగా చిత్రీకరించే పరిస్థితి ఎదురవడం అత్యంత బాధాకరంగా ఉందన్నారు.
మారిన రాజకీయం, మారిన ధృక్పథం — రేవంత్ చేతులమీదుగా అవార్డు
పుష్ప తో జాతీయ అవార్డు పొందిన అల్లు అర్జున్, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన *‘గద్దర్ అవార్డు’*లో ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. దీనిలో కీలకమైన విషయం – అవార్డును CM రేవంత్ రెడ్డి స్వయంగా ప్రదానం చేయడం. రాజకీయంగా బన్నీతో తగాదాలున్నాయన్న ప్రచారాల నేపథ్యంలో, ఇది అనేక వాదనలకు చెక్ వేసే ఘట్టం.
“A stage space has two rules: (1) Anything can happen and (2) Something must happen.”
― Peter Brook — ప్రముఖ దర్శకుడు , రచయిత పీటర్ బ్రూక్స్ ఓసారి అన్న ఈ మాటలు ఇక్కడ అక్షరాలా సత్యమవుతున్నాయి.
ఇది కేవలం ఒక అవార్డు కాదు… ఒక పునరుద్ధరణ
బన్నీకి గద్దర్ అవార్డు రావడాన్ని ఫ్యాన్స్ ఓ ‘జస్టిస్ మూమెంట్ గా చూస్తున్నారు. వాస్తవానికి పుష్ప 2 సినిమా తెలంగాణలో సంచలనం రేపింది. పుష్ప 2 ప్రమోషన్స్ లో సీఎం పేరు అల్లు అర్జున్ మరిచిపోవడం, బెనిఫిట్ షోలో ఓ మహిళ తొక్కిసలాటలో మృతిచెందడం, ఆమె కొడుకు ఆసుపత్రిలో నెలల తరబడి చికిత్స పొందడం వంటి అంశాలతో పుష్ప 2 వివాదాల్లో నిలిచింది.
అంతేకాకుండా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ పోలీసు స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఒకరోజు జైలు జీవితం కూడా గడిపాడు. అలాగే సంధ్య థియేటర్ ఘటనలో బాధిత కుటుంబానికి తక్షణమే ఫైనాన్షియల్ సపోర్ట్ అందించిన బన్నీ ఫ్యామిలీ, వారిని వ్యక్తిగతంగా కలిసిన దృశ్యాలు అప్పట్లో వైరల్ అయ్యాయి.
ఇప్పుడు గద్దర్ అవార్డు ఆయన తత్వాన్ని గుర్తించినట్టే?
ఇక ఘటన జరిగిన సమయంలో సినీ ఇండస్ట్రీల్లోనే ఎటువంటి బెనిఫిట్ షోలు, టికెట్ల ధరలు పెంపు వంటివి ఉండవని తెలంగాణ ప్రభుత్వం పెద్ద నిర్ణయమే తీసుకుంది... ఇప్పుడు అదే తెలంగాణ ప్రభుత్వం చేతుల మీదుగా గద్దర్ అవార్డుకు ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్ ను (పుష్ప 2) ఎంపిక చేయడం గమనార్హం.
అల్లు అర్జున్ స్పందన ఇదీ
‘‘తొలిసారి ప్రకటించిన ‘గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2024’లో ఉత్తమ నటుడి అవార్డుకు ఎంపికవడం నాకు దక్కిన నిజమైన గౌరవం. ఇందుకు తెలంగాణ ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ ప్రశంసలన్నీ దర్శకుడు సుకుమార్, చిత్ర నిర్మాతలు, మొత్తం పుష్ప టీమ్‌కు దక్కుతాయి. ఈ అవార్డును నా అభిమానులకు అంకితం చేస్తున్నా. మీరు అందిస్తున్న సహకారం ప్రతిసారి నాలో స్ఫూర్తినింపుతుంది’’ -ఎక్స్‌లో అల్లు అర్జున్
భవిష్యత్‌కు సంకేతం? “ఇది ఓ ఫినిక్స్ మూమెంట్”
ఒక సంఘటన కారణంగా, సెలబ్రిటీల జీవితంలో కొత్త అధ్యాయాలు మొదలవుతాయి. అది యాధృచ్చికం కావచ్చు. సల్మాన్ ఖాన్‌కు "హిట్ అండ్ రన్" తర్వాత "భజరంగీ భాయ్‌జాన్" వచ్చింది. షారుఖ్ ఖాన్‌కి "పఠాన్" ముందు కొడుకు అరెస్టు అనుభవమైంది. ఇప్పుడు బన్నీకి... ఈ సంఘటన తర్వాత వచ్చే అవార్డ్ లు, సినిమాలు... కెరీర్ ని నెక్ట్స్ లెవిల్ కు తీసుకువెళ్తాయా?
ఈ అవార్డు బన్నీకి మానసిక స్థైర్యాన్ని, ఫ్యాన్స్‌కి న్యాయం జరిగిందన్న సంతృప్తిని ఇచ్చింది. కానీ దీని ప్రభావం అక్కడే ఆగుతుందా. అల్లు అర్జున్ గద్దర్ అవార్డుతో పాటు తన నిజమైన గుర్తింపును తిరిగి పొందినట్లేనా. ఇది ఓ సామాజిక సమాధానం మాత్రమే కాదు — సినీ నటుడిగా తన ప్రయాణాన్ని రీసెట్ చేసిన రెసల్యూషన్ కు చెందిన విషయం.
ఇక ‘పుష్ప 2: ది రూల్’ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో, స్క్రీన్లలో విడుదలైన సినిమాగా చరిత్ర సృష్టించింది. థియేట్రికల్ రన్లో రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి పుష్ప-2 బాక్సాఫీస్ రికార్డులను బ్రద్దలు కొట్టింది.