రియల్ ఎస్టేట్ వివాదంలో సుమ, తప్పెవరిది? సుమ ఏమంటోంది

తెలుగులో నెంబర్ వన్ యాంకర్ గా దశాబ్దాలు తరబడి ఏలుతున్న సుమ సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండటానికే ప్రయత్నిస్తూంటుంది.

Update: 2024-08-07 12:48 GMT

తెలుగులో నెంబర్ వన్ యాంకర్ గా దశాబ్దాలు తరబడి ఏలుతున్న సుమ సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండటానికే ప్రయత్నిస్తూంటుంది. అయితే ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కోసారి వివాదాలుకు కేరాఫ్ ఎడ్రస్ అయ్యిపోతుంది. ఆ మధ్యన యాంకర్ సుమ మీడియా మీద సంచలన కామెంట్స్ చేశారు. 'స్నాక్స్ బొజనంలా కాకుండా స్నాక్స్ లా తిని లోపలి రండి' అని అన్నారు. జోక్ వేసాను అని అన్నారు సుమ, ఆ వెటకారమే వద్దు అని మీడియావాళ్లు ఆమెకి గట్టిగా చెప్పారు, తరువాత మీడియా వాళ్ళకి ఆమె క్షమాపణ చెప్పింది. అక్కడితో అది సమిసి పోయింది. అయితే తాజాగా వచ్చిన వివాదం కాస్త ఇమేజ్ ని ఇబ్బంది పెట్టేలాగే ఉంది. ఎందుకంటే ఇది ఫైనాన్సియల్ మేటర్..ఎంతో మంది మధ్య తరగతి కలలకు సంభంధించింది. అసలేం జరిగింది, సుమ ఏమని రెస్పాండ్ అయ్యింది?

వివాదం ఏంటంటే...

టీవీ, సినిమాలతో బిజీగా ఉండే యాంకర్‌ సుమ.. వాణిజ్య ప్రకటనలతోనూ ఫుల్‌ బిజీగా ఉంటారు. ఆ క్రమంలోనే రాకీ అవెన్యూస్ అనే రియల్‌ ఎస్టేట్‌ సంస్థకు ఆమె ప్రచారం చేశారు. ఆ సంస్థకు చెందిన అడ్వర్టైజ్‌మెంట్‌లలో నటించి ప్రజలను ఆకట్టుకున్నారు. ఫేజ్ వన్ ఫ్లాట్లన్నీ అమ్ముడుపోయాయి. కేవలం 18 లక్షలకే సెకండ్ ఫేజ్ లో ఫ్లాట్. త్వరపడండి ఉగాది సందర్భంగా కంపెనీయే రిజిస్ట్రేషన్ ఫీజు భరిస్తుంది. పైగా జీఎస్టీ కూడా కట్టనవసరం లేదని సుమ రాకీ అవెన్యూస్ కు ప్రచారం చేస్తూ చెప్పిన మాటలివి. జనం సుమ మాటలు నమ్మి కట్టారో లేక ఆ సంస్ద ను చూసి కట్టారో కానీ ... బిజినెస్ బాగా జరిగింది.


ఆ సంస్థ మధ్యతరగతి కుటుంబాలని టార్గెట్ చేస్తూ అందరి దగ్గర కలిపి 88 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత ఇప్పుడు బోర్డు తిప్పేసింది. అపార్టుమెంట్లు నిర్మాణం చేసి ఫ్లాట్ లు ఇస్తామని నమ్మించి మోసం చేసింది. దీంతో ఆ సంస్దకి డబ్బులు కట్టిన వాళ్ళందరూ రోడ్ ఎక్కారు. తమకు న్యాయం చేయాలని పోలీసులతో పాటు ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నారు.

తాజాగా .. ఈ విషయం బయటపడటంతో ఆ సంస్థ చైర్మన్ రామయ్య వేణు పరారీలో ఉన్నారు.

అంతే కాదు కొంతమంది ఈ సంస్థకు సుమ ప్రచారం చేయడం వల్ల ఇది మంచి సంస్థ అని కొన్నామని అయితే ఇప్పుడు సంస్థ బోర్డు తిప్పేసింది అని వాపోతున్నారు. బాధితులు కొందరు ఓ మీడియాతో మాట్లాడూతూ... 'రాకీ అవెన్యూస్ కట్టిన ఫేజ్ వన్ బిల్డింగ్స్ చూశానని, ఫేజ్ 2 కూడా త్వరలో కడుతామని సుమతో ప్రచారం చేయించడం వల్లే ఈ సంస్థలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చానని తెలిపారు. తాను త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లు నాలుగు తీసుకొని ఒక్కొక్క ఫ్లాట్ కు 25 లక్షల ధర చెల్లించి మొత్తంగా కోటి రూపాయల వరకు వెచ్చించి రిజిస్ట్రేషన్ చేయించానని' తెలిపారు.

మరొకరు.. మీడియాతో మాట్లాడుతూ.. యాంకర్ సుమ ప్రచారం చేయడం వల్ల ఆకర్షితులమయ్యాం. పెద్ద కంపెనీ కావడంతో తక్కువ ధరకు ఇస్తానని అనడంతో మేము ఫ్లాట్స్‌ను కొనుగోలు చేశాం. అయితే సుమను తప్పు పట్టడం లేదు. కానీ ఆమె ప్రచారం చేయడం వల్లే మేము కొనుగోలు చేశాం. ఆమె మాకు ఏదైనా న్యాయం చేస్తారని కోరుకొంటున్నాం. మేము 26 లక్షలు క్యాష్ ఇచ్చి రిజిస్టర్ చేసుకొన్నాం. పిల్లల భవిష్యత్ కోసం పెట్టుబడి పెట్టాం అని బాధపడ్డారు.

ఈ యాడ్స్ లో సుమతో పాటు ఆమె భర్త రాజీవ్ కనకాల కూడా కనిపించారని, ప్రభుత్వాలతో పాటు సుమ కూడా ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో సుమపై చాలా మంది విమర్శలు చేస్తున్నారు. ఈ యాడ్స్ లో సుమతో పాటు ఆమె భర్త రాజీవ్ కనకాల కూడా నటించారు. యాంకర్ సుమ స్పందించాలని బాధితులు కోరుకొన్నారు.

ఈ క్రమంలో యాంకర్ సుమ దీనిపై తాజాగా స్పందించింది. రాకీ అవెన్యూస్ అనే సంస్థతో తాను 2016 నుంచి 2018 వరకు మాత్రమే ఒప్పందం చేసుకున్నానని.. ఆ సమయంలోనే వారికి సంబంధించిన ప్రమోషనల్ యాడ్ చేశానని సుమ క్లారిటీ ఇచ్చింది. అయితే, ఇప్పుడు ఆ సంస్థతో తనకు ఎలాంటి లావాదేవీలు, సంబంధం కానీ లేదని.. తనకు సంబంధించిన వీడియోను వారు అక్రమంగా వినియోగించుకున్నారని సుమ తెలిపింది.

దీంతో ఇప్పుడు సుమ న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని.. తనకు సంబంధం లేని వివాదంలోకి లాగుతున్నారని సదరు సంస్థపై ఆమె ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపింది. ప్రజలు కూడా వాస్తవాలను గుర్తించాలని ఆమె తాజాగా ఓ లేఖ రూపంలో కోరింది.

అయితే యాడ్స్ చేసేటప్పుడు సాధారణంగా సెలబ్రెటీలు ఆ సంస్ద గురించి ఎంక్వైరీ చేస్తారు కానీ ఇలా బోర్డ్ తిప్పేస్తుందని ఊహించరు. ఆ సమయంలో తామ డిమాండ్ ను బట్టి డబ్బులు ఎంత ఇస్తారో చూసుకుంటారు కానీ ఇలాంటి సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుందని భావించరు. అయితే ఈ యాడ్ వివాదం సెలబ్రెటీలకు ఓ గుణ పాఠమే..కాస్తంత ఆచి,తూచి వెళ్లాలి యాడ్స్ చేసేందుకు.

ఏదైమైనా పరిశ్రమలో సుమ ఒక ప్రత్యేక శైలి, ఒక ఇంటర్వ్యూ చెయ్యాలన్నా, ఒక ప్రీ రిలీజ్ వేడుక జరపాలన్నా, ఒక పాట విడుదల చెయ్యాలన్నా దేనికైనా సుమనే యాంకర్ గా పరిశ్రమలో చాలామంది నమ్ముకుంటారు. సుమ కూడా అంత బాగా చేస్తుంది కూడా, అందుకే ఆమెకున్నపేరు మరెవరికీ లేదు. మిగతా ఏ యాంకర్ అయినా, మేము సుమక్క ని ఫాలో అవుతామని చెపుతారు తప్ప, ఆమెని బీట్ చెయ్యలేదు ఇంతవరకు ఎవరూ.

Tags:    

Similar News