రివ్యూ: అవికా గోర్ ‘బ్లడీ ఇష్క్’
హిందీ దర్శకుడు విక్రమ్ భట్ హారర్ సినిమాలకు పెట్టింది పేరు. ఒకప్పటి స్టార్ డైరక్టర్ మహేష్ భట్ కథ.
హిందీ దర్శకుడు విక్రమ్ భట్ హారర్ సినిమాలకు పెట్టింది పేరు. ఒకప్పటి స్టార్ డైరక్టర్ మహేష్ భట్ కథ . ఇక కీరోల్ లో అవికాగోర్ (Avika Gor)మనకు ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్తా మామా ఇలా చాలా సినిమాలతో పరిచయం. విక్రమ్ భట్, అవికా కాంబినేషన్ లో ఇంతకు ముందు ‘1920: హారర్స్ ఆఫ్ ది హార్ట్’ సినిమా వచ్చి బాగానే వర్కవుట్ అయ్యింది. దాంతో మరోసారి ఈ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ ‘బ్లడీ ఇష్క్’ (Bloody Ishq) అనగానే ఆసక్తి , అంచనాలు క్రియేట్ అయ్యాయి ఆ ఎక్సపెక్టేషన్స్ తగినట్లుగానే సినిమా ఉందా...అసలు కథేంటి ?
స్టోరీ లైన్
స్కాట్ లాండ్ లో ఓ ఐలాండ్. అక్కడ ఇంద్రభవనం లాంటి పెద్ద ఇల్లు. అయితే అంత పెద్ద ఇంట్లో రోమేశ్, నేహా దంపతులు (వర్ధన్ పూరి, అవికా గోర్) మాత్రమే నివాసం ఉంటూంటారు. అయితే అంత పెద్ద భవంతిలో ఇద్దరే ఏకాంతంగా ఉండాల్సిన పనేంటి భయం వెయ్యదా అంటే సినిమా కథ అలా రాసుకున్నట్లున్నారు. నేహా తన భర్తతో ఉన్నప్పుడు ధైర్యంగానే ఉన్నా ఒంటరిగా ఉంటే మాత్రం భయపడిపోతుంటుంది. అది సహజం కూడాను.
ఇది చాలదన్నట్లుగా ఆ మహల్ ఏవో కొన్ని అదృశ్య శక్తులు నేహకి కనిపిస్తుంటాయి. రాత్రి వేళ విచిత్రమైన శబ్దాలు వినిపిస్తుంటాయి. ఇదే విషయాన్ని తన భర్తకు చెప్తుంది. అతనేమో ఇల్లు ఖాళీ చేసి వేరే చోటకు వెళ్దాం అనుకోడు. అబ్బే నాకు ఏమి వినపడటంలేదు, కనపడటం లేదు ..ఏం లేదని కొట్టిపారేస్తాడు. అప్పుడు నేహా ఏం చేస్తుంది. అసలు ఈ వింతల వెనుక వున్నది ఎవరు? రోమేశ్ తండ్రి (రాహుల్ దేవ్), ఆయనకు కాబోయే రెండో భార్య (జెన్నీఫర్ పిచినటో) ఎలా చనిపోయారు? ఆ మహల్ లో అదృశ్య శక్తులు ఉన్నాయా? చివరకు నేహా అక్కడ నుంచి బయిటపడిందా వంటి వివరాలు తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే ఓటిటి తెరపై చూడాలి.
ఎలా ఉంది
ఇది ఓటిటిలో స్ట్రైయిట్ గా రిలీజ్ చేసిన సినిమా. ఓ భవంతి, నాలుగైదు క్యారక్టర్స్ ని అడ్డం పెట్టి సినిమాని చుట్టేయాలని రెడీ చేసిన స్క్రిప్టు ఇది. ఎక్కడా ఆసక్తి ఉండదు. గతంలో పదేళ్ల క్రితం ఇలాంటి హిందీలో ఒకటీ,అరా వచ్చి అలా అలా ఆడేసి డబ్బులు తెచ్చి వెళ్లిపోయేవి. అప్పట్లో ఇలాంటివి తీసేవాళ్లు తక్కువ. ఇప్పుడు ఇలాంటి సినిమాలే ప్రతీ చోటా. ఓ ఒంటరి భవంతి, హీరో,హీరోయిన్స్ ఆ ఇంట్లోకి వెళ్లారగనే జనం నమస్కారం పెట్టేస్తున్నారు. వాళ్లకు విషయం అర్దమైపోతోంది. అందుకు తగినట్లు ఇందులో అక్రమ సంభందం గోలకటి. ఆసక్తి కలగించని ప్లాష్ బ్యాక్ లు . ఇవన్నీ చాలదనుకున్నట్లు మధ్య మధ్యలో పాటలు. పోనీ దెయ్యాన్ని చూపించారు కదా అదేమన్నా ఇంట్రస్టింగ్ గా ఉందా అంటే ...కామెడీగా అనిపిస్తూంటుంది. ఇలా ఎవరికీ ఆసక్తి కలిగించని విధంగా స్క్రీన్ ప్లే రాసుకుని తెరకెక్కించిన హారర్ సినిమా ఇది.
టెక్నికల్ గా..
ఈ సినిమా ఎక్కువగా గ్రీన్ మ్యాట్ లో తీసినట్లున్నారు. అది క్లియర్ గా తెలిసిపోతోంది. విఎఫ్ ఎక్స్ లు క్వాలిటీగా చూడటానికి అలవాటు పడ్డ తర్వాత చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ విషయం టీమ్ ఫెయిల్ అయ్యింది. ఇక హారర్ కథల్లో నటించడం అవికా గోర్‌కు కొత్తేమీ కాదు. ‘రాజుగారి గది 3’, ‘1920: హారర్స్ ఆఫ్ ది హార్ట్’వంటివి చేసింది. కానీ ఈ సినిమా కూడా ఏదో అలా అలా చేసుకుంటూ పోయిందే. వర్ధన్ పూరి నటన జస్ట్ ఓకే. హీరో తండ్రిగా రాహుల్ దేవ్ గెస్ట్ రోల్. జెన్నీఫర్ పిచినటో గ్లామర్ రోల్. ప్రముఖ దర్శక, రచయిత మహేశ్ భట్ ఈ కథను ఓ గంటలో రాసేసి ఉంటారు. అంత దారుణంగా ఉంది. మిగతా టెక్నీషియన్స్ సినిమా ఎలాగూ ఓటిటికే కదా అన్నట్లు లైట్ తీసుకున్నట్లున్నారు.
చూడొచ్చా?:
హారర్ అభిమానులు తప్పించి మిగతా వారికి పెద్దగా ఎక్కదు. అలాగే సినిమాలో అశ్లీల సన్నివేశాలున్నాయి. ఈ సినిమాని ఫ్యామిలీతో కలిసి చూడకపోవడం బెటర్.
ఎక్కడ చూడచ్చు
‘డిస్నీ+ హాట్‌స్టార్’ (Disney+ Hotstar)లో ఉంది