ట్రేడ్ టాక్ : బోసిపోయిన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్!

ఈ వారం ఏకంగా 9 సినిమాలు భాక్సాఫీస్ ని పలకరించాయి. వాటిలో ఏదీ చెప్పుకోదగిన సినిమాగా కలెక్షన్స్ కానీ,మినిమం ఓపినింగ్స్ కానీ రప్పించుకోలేకపోతున్నాయి. వివరాలు

Update: 2024-02-26 05:51 GMT

సంక్రాంతి తర్వాత మళ్లీ బాక్సాఫీస్ దగ్గర సరైన సినిమా పడలేదు. దాంతో థియేటర్స్ జనం లేక వెలతెలాపోతున్నాయి. అసలే పిల్లల పరిక్షలతో ఫిభ్రవరి, మార్చిలు అన్ సీజన్ గా పరిగణిస్తాయి. అయితే కొన్ని సార్లు సీజన్ కు అతీతంగా కంటెంట్ బేస్డ్ సినిమాలు వచ్చి హిట్ అవుతూంటాయి. కానీ స్టార్స్ సినిమాలు ఈ సీజన్ లో థియేటర్ లో దిగటానికి ధైర్యం చేయవు. అయితే థియేటర్లు ఖాళీగా ఉన్నాయి కదా అని చాలా కాలం నుంచి రిలీజ్ అవ్వక, బిజినెస్ కాక మిగిలిన సినిమాలు, రిలీజ్ డేట్ దొరక్క ఆగిన సినిమాలు హడావిడిగా ఈ సీజన్ లో వచ్చి హంగామా చేసే ప్రయత్నం చేస్తూంటాయి. ఆ క్రమంలో ఈ వారం ఏకంగా 9 సినిమాలు భాక్సాఫీస్ ని పలకరించాయి. వాటిలో ఏదీ చెప్పుకోదగిన సినిమాగా కలెక్షన్స్ కానీ,మినిమం ఓపినింగ్స్ కానీ రప్పించుకోలేకపోతున్నాయి.


ఈ వారం మన ముందుకు వచ్చిన చిన్న సినిమాలలో టీజర్ ట్రైలర్ తో ఆకట్టుకున్న సినిమా హర్ష చెముడు (Harsha Chemudu) హీరోగా తెరకెక్కిన సుందరం మాస్టర్ (Sundaram Master). సినిమాలో ఫస్టాఫ్ కొంచం ఫన్ తో పర్వాలేదు అనిపించినా సెకెండ్ ఆఫ్ మాత్రం డ్రాగ్ అవుతూ స్లో నరేషన్ తో ట్రాక్ తప్పింది. పార్టు పార్టులుగా కొన్ని చోట్ల కామెడీ వర్కౌట్ అయినా కూడా…ఓవరాల్ గా బోర్ కొట్టేసింది. మొదటి రోజు కలెక్షన్స్ 2.03 కోట్ల గ్రాస్ అని ప్రకటించారు. కానీ ఎక్కడా సందడి లేదు.

 




అలాగే మలయాళంలో సంచలనం రేపిన మమ్ముట్టి బ్లాక్ అండ్ వైట్ సినిమా ‘భ్రమయుగం’ను తెలుగులో సితార ఎంటర్‌టైన్మెంట్స్ విడుదల చేసారు. ముమ్మట్టి ప్రధాన పాత్రలో నటించిన “భ్రమయుగం” మేకింగ్ & కంటెంట్ తో చర్చనీయాంశం అయ్యింది. మమ్ముట్టి నటవిశ్వరూపం, షెహనాద్ సినిమాటోగ్రఫీ, కిస్టో జేవియర్ సౌండ్ డిజైన్, వైనాట్ స్టూడియోస్ సంస్థ ప్రొడక్షన్ డిజైన్ కోసం ఈ చిత్రాన్ని (Bramayugam) కచ్చితంగా ఒకసారి చూడాల్సిందే అని అందరూ మెచ్చుకుంటున్నారు. సౌత్ లో చాన్నాళ్ల తర్వాత పూర్తిస్థాయి బ్లాక్ & వైట్ లో తెరకెక్కిన చిత్రమిది. తెలుగులో సరైన ప్రమోషన్స్ లేకపోవటం, కమర్షియల్ ఫిల్మ్ లకు అలవాటుపడిన తెలుగు ప్రేక్షకులుకు ఈ సినిమా దూరంగానే ఉండిపోయింది. మినిమం ఓపినింగ్స్ కూడా తెచ్చుకోలేకపోయింది.

రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మలయాళంతోపాటు తెలుగు, తమిళ భాషల్లోనూ ఏకకాలంలో విడుదల చేయాలనుకున్నప్పటికీ.. మలయాళం వెర్షన్ మాత్రమే విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!

ఇక ఈ వారం రిలీజైన మరో చిన్న సినిమా ‘మస్త్ షేడ్స్ ఉన్నయ్ రా’. తన కామెడీతో కడుపుబ్బా నవ్వించే స్టార్ కమెడియన్ అభినవ్ గోమఠం ఈ చిత్రంతో హీరోగా మారాడు. మరి హీరోగా అభినవ్ సక్సెస్ అందుకున్నాడా అంటే లేదనే చెప్పాలి. ఓ మళయాళ చిత్రం రీమేక్ గా వచ్చిన ఈ చిత్రంగా పెద్దగా ఆకట్టుకోలేదు. ఓపినింగ్స్ సైతం తెచ్చుకోలేకపోయింది. చాలా మందికి ఈ సినిమా వచ్చిందనే సంగతి కూడా తెలియలేదు.

మూడు నాలుగు నెలలుగా వార్తల్లో ఉండి రిలీజ్ కోసం ఊరిస్తూ వస్తున్న రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’ ఎట్టకేలకు ఈ వారం విడుదలవుతునకుంటే వాయిదా పడింది. ఆ సినిమా వచ్చి ఉంటే ఖచ్చింగా ఈ వారం హిట్టో,ఫ్లాఫో మాట్లాడుకునేవారు.

అలాగే వివాదామే ప్రధానంగా , బోల్డ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన సిద్ధార్థ్ రాయ్ సైతం ఫిబ్రవరి 23నే వచ్చింది. అతడు, ఆర్య లాంటి సినిమాల్లో బాల నటుడిగా నటించిన దీపక్ సరోజ్ ఇందులో హీరో. ఈ సినిమా టీజర్ & ట్రైలర్ పై ఆసక్తి నెలకొన్నప్పటికీ.. థియేట్రికల్ రిలీజ్ ఓపినింగ్స్ కు మాత్రం అది ఉపయోగపడలేదు. సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకునే స్థాయిలో ఉందా అంటే అదీ కనిపించలేదు. దర్శకుడు రాసుకున్న కథలో దమ్ము ఉంది కానీ.. దాన్ని నడిపించిన విధానంలో పట్టు లేకపోవటం వల్ల తేలిపోయింది. బాగానే ప్రమోట్ చేసినా పెద్దగా అంచనాలను అందుకోలేక పోయింది. దాంతో మొదటి రోజు ఓపినింగ్స్ బాగున్నా..తర్వాత డీసెంట్ కలెక్షన్స్ తో జోరు చూపించలేకపోయింది. మేకర్స్ కి డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ తో బాగానే వర్కౌట్ అయ్యిందని సమాచారం. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా అంచనాలను అందుకోలేక పోయింది సినిమా.

ఈ సినిమాలతో పాటు అల్లు అర్జున్ బావమరిది విరాన్ నటించిన ముఖ్య గమనిక, కొత్త వాళ్లు నటించిన మరో 3 సినిమాలు ఈ వారమే వచ్చాయి. అంతకు ముందు వారం రిలీజైన ఈగల్, ఊరుపేరు భైరవకోన కూడా ఓపెనింగ్స్‌తోనే సరిపెట్టుకున్నాయి. ఈ వారం పేరున్న సినిమాలేం రాకపోయినా వీటికి కలిసొచ్చిందేమో లేదు.!


Tags:    

Similar News