వీల్ చైర్ లో కూర్చోని డైరెక్టర్ సంతోష్ జగర్లపూడి షూటింగ్
ఆ సినిమా అంటే అంత పిచ్చి ఉందా..? ఆ సినిమా కోసం ప్రమాదాన్ని సైతం లెక్క చేయలేదా..? ఎందుకు?
వేల్పులు గోపి
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక స్టార్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవడానికి చాలా రకాలుగా కష్టపడుతూ ఉంటారు. ఒకప్పుడు కమర్షియల్ డైరెక్టర్లకి మంచి గుర్తింపు అయితే ఉండేది. ఇంకా ఇప్పుడు మారుతున్న కాలంతో పాటుగా ప్రేక్షకుల అభిరుచి కూడా మారుతూ వస్తుంది. కాబట్టి వాళ్ళు డిఫరెంట్ సినిమాలను చూడడానికి ఇష్టపడుతున్నారు. ఇక ప్రస్తుతం ఓటిటి ప్లాట్ ఫామ్ అందుబాటులోకి రావడంతో ప్రతి ఒక్కరు ప్రపంచంలో ఉన్న అన్ని సినిమాలను చాలా ఈజీగా చూసేస్తున్నారు. ఏ సినిమా ఎలా ఉంటుంది అనేది ముందే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ల ఊహలకు అందని విధంగా కథలను రాసుకొని స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడంలోనే దర్శకుడి యొక్క గొప్పతనం అనేది ఆధారపడి ఉంటుంది...
ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం చాలా మంది దర్శకులు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. యంగ్ డైరెక్టర్స్ లో చాలామంది తమను తాము ప్రూవ్ చేసుకోవడానికి ఏ ఒక్క చిన్న అవకాశం వచ్చినా కూడా దాన్ని వాడుకొని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకుంటున్నారు... ఇక ఈ కోవకు చెందిన వాడే 'సంతోష్ జాగర్లపూడి'... ప్రస్తుతం ఈయన తనదైన రీతిలో సినిమాలను చేయడానికి సంకల్పించుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఆయన సుమంత్ ను హీరోగా పెట్టి 'మహేంద్ర గిరి వారాహి' అనే సినిమా చేస్తున్నాడు. ఇక వీళ్ళ కాంబోలో ఇంతకుముందు 'సుబ్రహ్మణ్య పురం' అనే ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో పాటుగా సంతోష్ కి దర్శకుడిగా కూడా మంచి గుర్తింపును అయితే తీసుకొచ్చింది...
ఇక ఇదిలా ఉంటే మహేంద్ర గిరి వారాహి సినిమాని తన శ్వాసగా భావిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని కూడా తనే దగ్గరుండి మరి డిజైన్ చేయించుకొని సినిమాని అత్యద్భుతంగా తెరకెక్కించేందుకు శ్రమిస్తున్నారు. ఇక తన కెరియర్ ని మార్చే సినిమా కూడా ఇదే అని నమ్ముతున్నాడు. కాబట్టే ఈ సినిమా కోసం తన పూర్తి ఎఫర్ట్ పెడుతున్నాడు. ఇక రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన ఒక షెడ్యూల్ ని పూర్తి చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా షెడ్యూల్ కి మూడు రోజుల ముందు ఆయనకి ఒక కార్ యాక్సిడెంట్ జరిగి తన కాలికి బలమైన గాయమైతే తగిలింది. ఇక ఆ గాయాన్ని సైతం లెక్కచేయకుండా ఆయన రామచంద్రపురం వెళ్లి అక్కడ షూటింగ్ ని కూడా పూర్తి చేసినట్టుగా తెలుస్తుంది. అలా కాకుండా తను ఒక్క మాట నేను సినిమా షూటింగ్ కి రాలేను అని చెబితే అక్కడికక్కడే సినిమా షెడ్యూల్ క్యాన్సిల్ అయిపోయేది... కానీ అప్పటికే ఆర్టిస్టులందరూ తమ డేట్స్ ని ఇచ్చేశారు. ప్రొడ్యూసర్ ఆ షెడ్యూల్ కి సంబంధించిన పూర్తి కార్యక్రమాలను పూర్తి చేశాడు. ఈ సమయంలో కనక తన వల్ల షూటింగ్ ఆగిపోతే ప్రొడ్యూసర్ కి భారీగా నష్టం వస్తుందని భావించిన సంతోష్ తనకు ఎంత నొప్పిగా ఉన్నప్పటికీ రామచంద్రపురం వెళ్ళాడు.
అక్కడ వీల్ చైర్ లో కూర్చోని మరి షూటింగ్ ను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకొని తిరిగి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటి వరకు చేసిన సినిమా షూట్ మొత్తం చాలా బాగా వచ్చినట్టుగా కూడా సినిమా యూనిట్ నుంచి వార్తలైతే వస్తున్నాయి...ఇక ఇదంతా చూస్తుంటే ఇలాంటి పాషనేట్ డైరెక్టర్లే కదా సినిమా ఇండస్ట్రీకి కావాల్సింది అంటూ మరి కొంతమంది సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు... సంతోష్ జాగర్లపూడి చేసింది చాలా గొప్ప పని అతన్ని చూసి మరి కొంతమంది దర్శకులు కూడా ఆదర్శంగా తీసుకొని సినిమానే ప్రాణంగా పెట్టుకొని ముందుకు సాగితే వాళ్లందరికీ చాలా మంచి లైఫ్ ఉంటుందనేది కూడా తను తన చేతల ద్వారా చేసి చూపించాడు...ఇక మొత్తానికైతే 'మహేంద్ర గిరి వారాహి ' సినిమా భారీ సక్సెస్ ను సాధిస్తుందనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది...