కొనసాగుతున్న ‘కల్కి’ జోరు.. తాజా లెక్కలు చూస్తే..

ప్రభాస్ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా ‘కల్కి’ బాక్సాపీసు వద్ద తన జోరును కొనసాగిస్తోంది. తాజాగా సినీ నిర్మాణ సంస్థ వరల్డ్ వైడ్ గా ఉన్న కలెక్షన్ల లెక్కలు..

Update: 2024-07-06 09:44 GMT

కల్కి ప్రభంజనం కొనసాగుతోంది. తొమ్మిది రోజుల క్రితం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన కల్కి 2898 ఏడీ ఇప్పటి వరకూ రూ. 800 కోట్ల మార్కును అధిగమించిందని మేకర్స్ ప్రకటించారు.

దేశంలో కల్కి సినిమా అత్యధిక బడ్జెట్ తో రూపొందించినట్లు నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. దీని నిర్మాణ వ్యయం రూ. 600 కోట్లు దాటిందని చిత్ర నిర్మాత సీ. అశ్వనీ దత్ ఇప్పటికే చాలా ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. ఈ పౌరాణిక, సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా ఆరు భాషల్లో విడుదలైంది. వైజయంతీ మూవీస్ నిర్మించిన "కల్కి 2898 AD"లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, ప్రభాస్ నటించారు.
ప్రొడక్షన్ హౌస్ తాజా బాక్సాఫీస్ గణాంకాలను ఓ ఆసక్తికర పోస్ట్ తో విడుదల చేసింది. ప్రభాస్ చిత్రంతో ఉన్న పోస్టర్ లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 800 + GBOC వరల్డ్ వైడ్" అని ప్రకటించింది. "కల్కి 2898 AD"లో దిశా పటాని, శాశ్వత ఛటర్జీ, శోభన కూడా నటించారు.
గతంలో "ప్రాజెక్ట్ కె పేరుతో వ్యవహరించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఆంగ్ల భాషల్లో విడుదలైంది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సందర్భంగా దర్శకుడు నాగ్ అశ్విన్ హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడతారు. జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు ఇచ్చారు. కల్కి అసలు కథంతా ఇక ముందే ఉందని సమాధానం ఇచ్చారు. మహేష్ బాబు శ్రీకృష్ణుడి పాత్రకు సూట్ అవ్వరని పేర్కొన్నారు. ప్రభాస్ క్యారెక్టర్ సినిమాలో మరింత పెరుగుతుందని అలాగే కమల్ హసన్ లెంత్ కూడా ఎక్కువగా ఉంటుందని వివరించారు.
Tags:    

Similar News