“కాంతార 1' బడ్జెట్ పెరిగింది

హైప్ పెరిగింది.. కానీ బుకింగ్స్ దారుణం?

Update: 2025-09-30 11:18 GMT

ఇప్పటి సినీ మార్కెట్‌లో పాన్ ఇండియా రిలీజ్ అనేది ప్రతి పెద్ద సినిమా ఆశించే కల గా మారిపోయింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ—ఒకేసారి అన్ని భాషల్లో రిలీజ్ కావడం వల్లే మొదటి రోజు నుంచే భారీ వసూళ్లు సాధ్యమవుతున్నాయి. పెట్టుబడులు రికవరీ అవుతున్నాయి. స్టార్ హీరోలు, బిగ్ డైరెక్టర్లు మాత్రమే కాదు, ఇప్పుడు ఒక సక్సెస్‌ఫుల్ కంటెంట్ సినిమా కూడా పాన్ ఇండియా రిలీజ్‌ని తప్పనిసరి చేసుకుంటుంది. అదే పద్దతిలో కాంతార ప్రీక్వెల్ కూడా పాన్ ఇండియా రిలీజ్ కు భారీగా టార్గెట్ చేసింది. కానీ ఫలితం?

“వరాహరూపం” ఒక ఊపు ఊపింది

2022లో విడుదలైన కాంతార గురించి మొదట నార్త్ ఆడియెన్స్‌కి ఎలాంటి ఐడియా లేదు. హీరో రిషబ్‌ శెట్టి పేరు కూడా తెలియదు, భూతకోలా అనే ఆచారం ఏమిటో కూడా ఎవరికి అర్థం కాలేదు. కానీ రిషబ్ శెట్టి దైవ పాత్రలో చూపించిన పవర్‌ఫుల్‌ నటన, తర్వాత ఆయనకు తెచ్చిన నేషనల్‌ అవార్డు, అలాగే వైరల్‌ అయిన “వరాహరూపం” పాట… ఇవన్నీ కలిసి ఆ సినిమాను హిందీ మార్కెట్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిపాయి.

హిందీ డబ్ వర్షన్ మొదటి రోజు కేవలం రూ.1 కోటి ఓపెనింగ్‌తో మొదలై, చివరికి ఇండియాలోనే రూ.82 కోట్లు వసూలు చేసింది. అలా తెలుగులో, హిందీలో, తమిళంలో ఈ సినిమా అద్భుత విజయాన్నందుకుంది. ఏకంగా రూ.400 కోట్ల మేర వసూళ్లు రాబట్టి సంచలనం రేపింది. దీంతో దీని సీక్వెల్‌ ‘కాంతార: చాప్టర్-1’కు ఎక్కడ లేని హైప్ వచ్చింది. ఈసారి హోంబలె ఫిలిమ్స్ వాళ్లు పెద్ద బడ్జెట్ పెట్టి సినిమా తీశారు.

ఇప్పుడు ఇది చిన్న సినిమా అనే మ్యాజిక్ మీద ఆధారపడదు. భారీగా కలెక్ట్ చేస్తేనే పెద్ద హిట్‌గా పరిగణిస్తారు. అందుకే మేకర్స్ ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు వేసారు. అక్టోబర్ 2 (గాంధీ జయంతి) లాంటి నేషనల్ హాలిడేను కూడా టార్గెట్ చేశారు.

ప్రీక్వెల్‌గా వస్తున్న కాంతార: చాప్టర్ 1 మీద అంచనాలు ఆకాశాన్నంటాయి. ఇంక ఈ సినిమాకి ఇంకా రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండగా… షాకింగ్‌గా నార్త్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ చాలా బలహీనంగా ఉన్నాయని ట్రేడ్ టాక్. అసలు మొదటి సినిమా బ్లాక్‌బస్టర్ రేంజ్‌కి వెళ్లిన తర్వాత, నార్త్ మార్కెట్‌లో ఈ సారి కనీసం రూ.10–15 కోట్లు ఓపెనింగ్ వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ ప్రస్తుత ట్రెండ్ మాత్రం ఆ అంచనాలకు దూరంగా ఉంది. ఎందుకిలా జరుగుతోందో ట్రేడ్ ఎనాలసిస్ చేస్తోంది.

1. మొదటి సినిమా ఎఫెక్ట్ వర్సెస్ ప్రీక్వెల్ కాన్సెప్ట్

కాంతార (2022) ఒక కల్ట్ ఫెనామినన్ అయ్యింది, ఎందుకంటే అది సడెన్ సర్ప్రైజ్ ప్యాకేజ్. ఎవరికీ అంచనాలు లేకుండా ఒక కొత్త కల్చర్, కొత్త యాక్టర్, కొత్త టోన్‌తో బిగ్ హిట్ అయ్యింది. కానీ ఇప్పుడు ప్రీక్వెల్ అని చెప్పగానే ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ తగ్గిపోయింది. కధలో ఏముంటుందో, ఎంత ఎమోషనల్ ఇంపాక్ట్ ఇస్తుందో అనే డౌట్స్ పబ్లిక్‌లో ఉన్నాయి.

2. ట్రైలర్ రియాక్షన్ మిక్స్

ట్రైలర్‌కి విశేష హంగామా లేకపోవడం కూడా ప్రధాన కారణం. యాక్షన్, మిస్టిక్ విజువల్స్ ఉన్నా, ఆ “వరాహ రూపం” లాంటి వైరల్ హుక్ ఈ సారి మిస్ అయింది. నార్త్ ఆడియెన్స్‌కి కొత్తగా ఫీలయ్యే కల్చరల్ ఎలిమెంట్ ఈసారి అంతగా హైలైట్ కాలేదు.

3. నార్త్ మార్కెట్‌లో పోటీ

అక్టోబర్ 2 వ తేదీ హాలిడే రిలీజ్ అయినా, ఆ టైమ్‌కి హిందీ బిగ్ మూవీస్ (లేదా పాన్ ఇండియా రిలీజ్‌లు) కంపిటీషన్ ఇస్తున్నాయి. నార్త్ మల్టిప్లెక్సుల్లో ఎక్కువ స్క్రీన్లు, షోలు ఈజీగా దొరకటం లేదు.

4. ఓవర్-ఎక్స్‌పెక్టేషన్ బర్నౌట్

ట్రేడ్ అనలిస్టులు మొదటే “₹10–15 కోట్లు ఓపెనింగ్” అనేసరికి, పబ్లిక్‌లో కూడా పెద్ద ఎక్స్పెక్టేషన్ ఏర్పడింది. కానీ సాధారణ ఆడియెన్స్ ఇప్పటికీ “మొదట రివ్యూలు చూద్దాం” అనే మైండ్‌సెట్‌లో ఉన్నారు.

5. రిషబ్ శెట్టి vs స్టార్ పవర్

రిషబ్ శెట్టి నార్త్‌లో రెగ్యులర్ మార్కెట్ స్టార్ కాదు. కాంతార సక్సెస్‌తో ఆయన పేరు వచ్చిందిగాని, అది కంటెంట్ ఆధారంగా మాత్రమే. కానీ పాన్-ఇండియా మార్కెట్‌లో మొదటి రోజు బుకింగ్స్‌ను స్టార్ పవర్ (ఉదా: ప్రభాస్, ఎన్టీఆర్, రణబీర్, అల్లూ అర్జున్) డిసైడ్ చేస్తాయి. రిషబ్‌కి అలాంటి ఫ్యాన్ బేస్ ఇంకా లేదు.

6. మ్యూజిక్, ప్రమోషన్ గ్యాప్

మొదటి సినిమా “వరాహ రూపం” లాంటి కల్ట్ సాంగ్‌తో హిందీ ఆడియెన్స్‌కి కూడా డైరెక్ట్ కనెక్ట్ అయ్యింది. ఈసారి ఆ స్థాయి ఆడియో హుక్ లేకపోవడం పెద్ద మైనస్. ప్రమోషనల్ క్యాంపెయిన్ కూడా నార్త్‌లో ఆగ్రెసివ్‌గా చేయలేదు.

తెలుగులో ఓపినింగ్స్

తెలుగు రాష్ట్రాల్లో ఇంకా బుకింగ్స్ మొదలు కాలేదు. ఇక్కడ స్పందన ఎలా ఉంటుందో చూడాలి. కొన్ని వివాదాలు, అధిక టికెట్ల ధరల వల్ల తెలుగులో కొంచెం నెగెటివిటీ వచ్చింది. అది పెద్ద విషయం కాకపోయినా తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమా చూసేందుకు మరీ పరుగెత్తుకు వెళ్లే పరిస్థితి అయితే కపడటం లేదు. టాక్ ఎలా ఉంటుందన్నదాన్ని బట్టే ఇక్కడ కూడా సినిమా ఫలితమేంటో తేలనుంది.

మొత్తానికి:

నార్త్ ఆడియెన్స్ ఇప్పుడు “మౌత్ ఆఫ్ వర్డ్” కోసం వెయిట్ చేస్తున్నారు. రివ్యూలు పాజిటివ్‌గా వస్తే, రెండో రోజు నుంచి బుకింగ్స్ పికప్ అవుతాయి. కానీ డే–1 హైప్ మాత్రం కాంతార 1కి కనపడటం లేదు. అదేమీ జరగక పోతే ఇది “ఓవర్-ఎక్స్‌పెక్టేషన్ బర్నౌట్” గా మిగిలిపోవచ్చు.

రిషబ్‌ శెట్టి డైరెక్ట్ చేసి, హీరోగా నటించిన ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా కనిపించనుంది.

Tags:    

Similar News