మహేష్ బాబు ‘పోచర్’ ట్వీట్ వెనక కథేంటి?

సూపర్ స్టార్ మహేష్ బాబు, అక్కడ తమిళంలో స్టార్ ధనుష్ ఇద్దరూ ‘పోచర్’ సిరీస్‌ను మెచ్చుకున్నారు. ఈ సిరీస్‌కు ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ కూడా అద్భుతంగా వస్తోంది.

Update: 2024-03-03 09:21 GMT
మహేష్ బాబు, ధనుష్

ఇక్కడ మన సూపర్ స్టార్ మహేష్ బాబు, అక్కడ తమిళంలో స్టార్ ధనుష్ ఇద్దరూ ఓ సీరిస్ ని మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టారు. ఈ స్టార్స్ ఇద్దరూ కూడబలుక్కుని వేసారా..లేక అమేజాన్ వాళ్లు కానీ, ఆ వెబ్ సీరిస్ దర్శక,నిర్మాతలు కానీ ప్రమోషన్ కోసం ఈ ట్వీట్స్ వేయంచారా లేక నిజంగానే ఈ స్టార్స్ కు నచ్చేసిందా అనేది ప్రక్కన పెడితే, వీళ్లిద్దరూ ఈ సీరిస్ గురించి మాట్లాడాక ఈ సీరిస్ పై ఎవర్నేస్ వచ్చింది. ఈ సీరిస్ లో చర్చించిన సీరియస్ ఇష్యూపైనా కొద్దిగా ఎవర్నేస్ వచ్చేందుకు అవకాశం ఉంది. ఆ వెబ్ సీరిస్ పేరు పోచర్ . ఇప్పటికే సిరీస్ కు ఓటీటీలో సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ఇంతకీ ఆ సీరిస్ లో ఉన్న మేటరు ఏంటో తెలుసుకునే ముందు ఆ స్టార్స్ ఏమన్నారో చూద్దాం...


ధనుష్ పోచర్ సీరిస్ గురించి ట్వీట్ చేస్తూ.. One of the finest works that i thoroughly enjoyed. #PoacheronPrime అని ఇన్స్ట్రాలో అన్నారు. ఇక మహేష్ బాబు ‘ఏనుగులను అలా ఎలా చంపేస్తారు..? అలా చేస్తున్నప్పుడు వారి చేతులు వణకవా..? అలా చేసే వారిలో మానవత్వం ఉండదా..? పోచర్ వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడు నా మైండ్ లో ఇవే క్వశ్చన్స్ రన్ అయ్యాయి.

ఈ జెంటిల్ జెయింట్స్ ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు పోరాడాలి’ అని మహేష్ బాబు సోషల్ మీడియాలో ట్వీట్ చేసారు. ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. మహేశ్ రివ్యూతో మరెన్ని రికార్డులు కొల్లగొట్టే దిశగా పరుగెడుతోంది. ఇంతకీ ఈ సీరిస్ లో ఈ స్టార్స్ మెచ్చుకునేటంత కంటెంట్ ఏముంది..అసలు దేని గురించి..

ఇదొక మలయాళ వెబ్ సిరీస్ పోచర్. ఇండియాలోని అతి పెద్ద క్రైమ్ రాకెట్స్ లో ఇదీ ఒకటి అనే క్యాప్షన్ తో తెరకెక్కిన ఈ సిరీస్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. 1990ల నుంచి సైలెంట్ గా ఉన్న ఈ ఏనుగులను వేటాడే ముఠా మళ్లీ యాక్టివ్ అవ్వడం, వారిని పట్టుకోవడానికి రేంజ్ ఆఫీసర్ టీమ్ ఏ విధంగా పోరాటం చేసింది అనేది ఈ సీరిస్ లో ఉన్న స్టోరీ లైన్. దాదాపు 18 ఏనుగుల దారుణ హత్యలకు ప్రతీకారంగా ఆఫీసర్స్.. కరుడుగట్టిన ఏనుగుల పోచర్స్ ను ఎలా హతమార్చారు అనేది చూపించారు. ఈ ఎనిమిది ఎపిసోడ్ల క్రైమ్ డ్రామాను తన కెరీర్లో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న రిచీ మెహతా క్రియేట్ చేశాడు.

మన దేశంలో చాలా స్ట్రిక్ట్ గా వైల్డ్ లైఫ్ చట్టాలను తీసుకొచ్చిన తర్వాత 20 ఏళ్లుగా అడవుల్లో ఏనుగుల వేట సాగడం లేదని, ఏనుగు దంతాల స్మగ్లింగ్ ఆగిపోయిందనుకున్న సమయంలో జులై, 2015లో అతిపెద్ద ఐవరీ స్మగ్లింగ్ రాకెట్ బయటకు రావటం సెన్సేషన్ క్రియేట్ అయ్యింది. ఈ ఏనుగు దంతాల స్మగ్లింగ్ అసలు మళ్లీ ఎలా మొదలైంది? దాని వెనుక ఉన్న పెద్ద తలకాయలు ఎవరు? ఈ ఐవరీ స్మగ్లింగ్ రాకెట్ మార్కెట్ విలువ ఎంత అన్నది ఈ సిరీస్ లో చూపించే ప్రయత్నం చేశారు.

ఇక ఏనుగు దంతాల స్మగ్లింగ్ కు చెక్ పెట్టడానికి 2015లో జరిగిన ఆపరేషన్ శిఖర్ ఆధారంగా పోచర్ వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు. దక్షిణ కేరళలోని అడవుల్లో గుట్టు చప్పుడు కాకుండా జరిగిన ఏనుగుల వేటకు సంబంధించిన విచారణ 2015 నుంచి 2017 వరకూ సాగిన విషయాలను ఇందులో చర్చించారు. ఈ ఆపరేషన్ లో పాల్గొన్న ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అధికారులు, పోలీసులు అసలు నేరస్థులను పట్టుకోవడానికి పడిన శ్రమ, వాళ్ల ప్రాణాలను పణంగా పెట్టిన తీరును ఈ పోచర్ వెబ్ సిరీస్ కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ సీరిస్ కు ప్రధాన ఆకర్షణ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే. ఏదో డాక్యుమెంటరీలా కాకుండా ఆ ఇన్విస్టిగేషన్ ను స్క్రీన్ పై ప్రెజెంట్ చేసిన విధానం చాలా బాగుంది. ఈ క్రమంలో ఈ సిరీస్ లో కేరళ అడవుల అందాలను కూడా ఎంతో బాగా చూపించారు.

నిమిషా సజయన్, రోషన్ మాథ్యూ, దిబ్యేందు భట్టాచార్య తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఢిల్లీ క్రైమ్ లాంటి సిరీస్ డైరెక్ట్ చేసిన రిచీ మెహతా తెరకెక్కించిన పోచర్ సిరీస్ కు డైరక్టర్ కావటంతో మరింతగా అందరి దృష్టీ పడింది. బాలీవుడ్ నటి ఆలియా భట్ సహ నిర్మాతగా ఈ పోచర్ వెబ్ సిరీస్ తెరకెక్కడంతో ఈ సిరీస్ పై అందరి కన్ను పడింది. ఈ సిరీస్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సైతం స్ట్రీమింగ్ అవుతుంది.


Tags:    

Similar News