మళ్లీ విలన్ గా మోహన్ బాబు, మామూలుగా ఉండదట

తెలుగు సినిమా పరిశ్రమలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు ప్రత్యేకమైన గుర్తింపు ...పేరు. నటుడిగా 50వ ఏటలోకి అడుగుపెట్టిన ఆయన చేయని పాత్ర లేదు.

Update: 2024-11-27 08:50 GMT

తెలుగు సినిమా పరిశ్రమలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు ప్రత్యేకమైన గుర్తింపు ...పేరు. నటుడిగా 50వ ఏటలోకి అడుగుపెట్టిన ఆయన చేయని పాత్ర లేదు. పాత్రల్లో వైవిధ్యం, పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆయన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి. మోహన్ బాబు ఐదు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో అంకితభావం, పట్టుదలకు మారుపేరుగా నిలిచారు. తన కెరీర్ ప్రారంభంలో విలన్ గా ఆయన ఎన్నో సినిమాలు చేసారు. స్వర్గం నరకం చిత్రంతో పరిశ్రమకు హీరోగా పరిచయం అయినా.. విలన్ పాత్రలతో నెంబర్ వన్ స్దానానికి చేరుకున్నారు. అయితే ఆ తర్వాత హీరోగా చాలా కాలం కొనసాగారు. అయితే గాయత్రి , సన్నాఫ్ ఇండియా చిత్రాల పరాజయం తర్వాత గత కొంతకాలంగా ఆయన సినిమాలకు గ్యాప్ ఇచ్చి ఉన్నారు.అయితే ఇప్పుడు ఆయన దగ్గరకు ఓ సినిమా వచ్చిందని , అదీ విలన్ పాత్ర అని తెలుస్తోంది.

మోహన్ బాబు 1975 నుంచి 1990 వరకు, మోహన్ బాబు గారు భారతీయ సినిమాల్లో విలన్ పాత్రకు కొత్త నిర్వచనాన్ని తీసుకువచ్చారు. దేశంలో అత్యధికంగా డిమాండ్ ఉన్న విలన్ గా ఒకరిగా నిలిచిన ఆయన నటన ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారు. 1990వ దశాబ్దంలో, మోహన్ బాబు హీరోగా మారి ప్రేక్షకులను తనదైన శైలితో అలరించారు. అయితే ఆ తర్వాత టర్న్ తీసుకుని ఊహించని విధంగా అల్లుడు గారు, అసెంబ్లీ రౌడీ, పెదరాయుడు సినిమాలు చేసి ఆల్ టైమ్ రికార్డు హిట్స్ గా నెలకొల్పారు.

1993లో ఆయన నిర్మించిన మేజర్ చంద్రకాంత్ చిత్రం ఎన్.టి.రామారావు గారి తిరిగి ముఖ్యమంత్రి పదవి చేపట్టడం లో కీలక పాత్ర పోషించింది. ఈ చిత్ర 100 రోజుల వేడుక తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. మోహన్ బాబు కి 2007లో భారత ప్రభుత్వం పద్మశ్రీ ప్రదానం చేయగా, 2016 ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ఆయన్ను వరించింది.

ఇక మోహన్ బాబు విలన్‌గా రాణించిన రోజుల విషయానికి వస్తే 1975 హీరోగా ‘స్వర్గం నరకం’ సినిమాలో విలన్ షేడ్స్ ఉన్న హీరో పాత్రలో నటించారు. ఆ తర్వాత 1990 వరకు, మోహన్ బాబు భారతీయ సినిమాల్లో విలన్ పాత్రకు కొత్త నిర్వచనాన్ని తీసుకువచ్చారనే చెప్పాలి. దేశంలో అత్యధికంగా డిమాండ్ ఉన్న విలన్స్ లో ఒకరిగా నిలిచారు. అంతేకాదు ఏ పాత్ర చేసిన తన నటనతో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారు. దాంతో ఇప్పుడు మరోసారి ఆయన విలన్ గా వేయబోతున్నారనగానే ఇంట్రస్టింగ్ విషయంగా మారింది. ఇంతకీ ఏ సినిమాలో ఆయన చేయబోతున్నారు అంటే..నాని హీరోగా రూపొందే చిత్రంలో.

గత సంవత్సరం నాని చేసిన 'దసరా' సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన నాని దసరా సినిమాకి శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వం వహించారు. తొలి సినిమానే అయినా శ్రీకాంత్‌ ఓదెల సినిమాను రూపొందించిన తీరుకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. నాని కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా దసరా నిలిచింది. ఆ సినిమా రిలీజ్ సమయంలోనే తాను మరోసారి శ్రీకాంత్‌ దర్శకత్వంలో సినిమాను చేస్తానని నాని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అన్నట్లుగానే నాని హీరోగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో మరో సినిమా పట్టాలెక్కింది.

ఇప్పుడా సినిమాలో విలన్ పాత్ర కోసం దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఇటీవల డైలాగ్‌ కింగ్‌ మోహన్‌ బాబును సంప్రదించారని, కథ విన్న తర్వాత ఆయన గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీ వర్గాల్లో ప్రముఖంగా ఈ విషయమై చర్చ జరుగుతోంది. మధ్యలో ఎన్ని ఆఫర్స్ వచ్చినా ఒప్పుకోని మోహన్ బాబు...నాని వంటి ట్యాలెంటెడ్‌ హీరో సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపించారని చెప్పుకుంటున్నారు.

ఈ సినిమా టైటిల్ "ది ప్యారడైజ్" . ఈ సినిమాని ప్రముఖ సినీ నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అన్ని సెట్ అయితే మంచు మోహన్ బాబు జనవరి నెల నుంచి హైదరాబాద్ లో జరగబోయే షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకూ చిత్ర యూనిట్ మాత్రం ఈ విషయంపై ఎలాంటి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ ఇవ్వలేదు.

Tags:    

Similar News