నాని కెరీర్ లోనే పెద్ద గ్యాంబిల్!

హాయ్ నాన్న నుండి హిస్టరీ వరకు;

Update: 2025-09-17 08:25 GMT

ఈ కాలంలో ప్రేక్షకులు సాధారణ సినిమాలతో తృప్తి చెందడం లేదు. వారికోసం కొత్త ప్రపంచం కావాలి – పీరియడ్ డ్రామాలు, మైథలాజికల్ ఎపిక్స్, ఫాంటసీ వరల్డ్స్.

ఇవి కేవలం సినిమాలు కాదు, ఒక మహోత్సవం గా కనపడాలి. ఇలాంటి సిట్యువేషన్ లోనే నేచురల్ స్టార్ నాని తన కొత్త ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. హాయ్ నాన్న తో మనసులు కరిగించిన శౌర్యవ్ ఇప్పుడు ఆయన కోసం ఓ భారీ పీరియడ్ డ్రామా సిద్ధం చేస్తున్నారు.

నాని – బాక్సాఫీస్ లెక్కలు

టాలీవుడ్‌లో మీడియం రేంజ్ హీరోల మధ్య భారీగా పోటీ నడుస్తున్న సమయంలో నాని మాత్రం తన ప్రత్యేకమైన స్థాయిని సాధించుకున్నాడు. వరుసగా సినిమాలు చేస్తూ, విభిన్న కథలను ఎంచుకుంటూ, బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధించడంలో నాని ఎప్పుడూ ముందుంటూ వస్తున్నాడు. డిసాస్టర్ అయిన కొన్ని సినిమాల తర్వాత కూడా ఆయన తన క్రేజ్‌ను కొనసాగించడం విశేషం.

రీసెంట్ గా నాని చేసిన నాలుగు సినిమాలు కలిపి ఏకంగా 400 కోట్ల గ్రాస్ వసూలు చేశాయి. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం, హిట్ 3 సినిమాలు కలిపి ఈ అద్భుతమైన రికార్డును సాధించాయి. దాంతో మీడియం రేంజ్ హీరోల్లో నానిని అందుకోవడం మిగతావారికి సాధ్యం కావడం లేదు.

స్టోరీ టెల్లింగ్

“Great stories happen to those who can tell them.” – Ira Glass

నాని ఎప్పుడూ కథకున్న శక్తినే నమ్ముతాడు. అదే కలసి వచ్చింది. ముఖ్యంగా నాని స్క్రిప్ట్ సెలక్షన్ నే ఆయన్ని నిలబెడుతోంది

ఈగ లో ప్రయోగం,

దసరా లో మాస్ రస్టిక్ ఫీల్,

హై నాన్న లో ఎమోషనల్ క్లాస్

ప్రతి సినిమా ఒక కొత్త వైపు చూపించింది. ఇవి ఒక్కోసారి బాక్సాఫీస్ హిట్స్, కల్ట్ ఫాలోయింగ్ తీసుకొచ్చాయి. ఇప్పుడు పీరియడ్ కథను ఎంచుకోవటం కూడా అలాంటిదే. ఇంతకు ముందు కూడా శ్యామ్ సింగరాయ్ చిత్రం చేసారు. ఆ సినిమా లో పీరియడ్ లుక్ నానికి మంచి పేరు తెచ్చి పెట్టింది. ఎక్కువ బడ్జెట్ లేకపోయినా, ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సేఫ్ బెట్ అయ్యాయి.

ఇప్పుడు మాత్రం నాని పెద్ద గేమ్ ఆడుతున్నాడు. ది ప్యారడైజ్ (శ్రీకాంత్ ఒదెల దర్శకత్వంలో, మార్చి 2026 రిలీజ్) తర్వాత, సుజీత్ డైరెక్షన్ లో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ (2026 ఎండ్ రిలీజ్) పూర్తి చేసి, వెంటనే హాయ్ నాన్న ఫేమ్ శౌర్యవ్ తో ఒక పీరియడ్ డ్రామా చేయబోతున్నాడు.

ఎందుకు ఇప్పుడు పీరియడ్ డ్రామా?

ప్రస్తుతం ఇండియన్ సినిమా ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. బాహుబలి, ఆర్ఆర్ఆర్, పొన్నియిన్ సెల్వన్ లాంటి సినిమాలు కల్చరల్ రూట్స్ తో పాటు వరల్డ్ క్లాస్ గ్రాండ్యూర్ ఇచ్చాయి. కాంతార లాంటి రూటెడ్ స్టోరీలు అద్భుత విజయాలు సాధించాయి. బాలీవుడ్ కూడా బ్రహ్మాస్త్ర వంటి మైథాలజీ ఇన్స్పైర్డ్ సినిమాలతో బిగ్ ఓపెనింగ్స్ తెచ్చుకుంది.

ఇవన్నీ చెబుతున్న సిగ్నల్ ఏమిటంటే — “సాధారణ కథలు కాదు, ప్రత్యేక ప్రపంచం సృష్టించే సినిమాలకే ప్రేక్షకులు డబ్బు వెచ్చిస్తారు.”

ఈ వేవ్ లోకి నాని అడుగు పెట్టడం ఒక సమయోచితమైన స్టెప్. ఇది ఆయనకు పాన్ ఇండియా రేంజ్ తెచ్చే అవకాశం ఉంది.

“Great stories happen to those who can tell them.” – Ira Glass

ఈ మాటని బాగా అర్థం చేసుకున్న హీరోల్లో నాని ముందుంటాడు.

పీరియడ్/ఫాంటసీ సినిమాలు ఎందుకు వర్క్ అవుతాయి?

1. ఎస్కేపిజం – ప్రేక్షకుడు తన సమస్యల నుండి బయటపడతాడు. ( బాహుబలి లో మహిష్మతి రాజ్యం లోకి వెళ్ళిన ఫీలింగ్).2. గర్వం – మన సంస్కృతి, చరిత్ర గుర్తు వస్తాయి. ( కాంతార లాంటి లోకల్ లెజెండ్ లు గ్లోబల్ లెవెల్ లో వర్క్ అవ్వడం).3. గ్రాండ్యూర్ – పెద్ద సెట్‌లు, VFX, సంగీతం. థియేటర్లో మాత్రమే అనుభవించగల “ఫెస్టివల్ ఫీల్.”

4. ఎపిక్ ఎమోషన్ – ప్రేమ, త్యాగం, స్నేహం అన్నీ మహాకావ్యం స్థాయిలో. ( RRR లో రామ్ – భీమ్ బంధం ).

ఇదే కారణం *బాహుబలి, ఆర్ఆర్ఆర్, పొన్నియిన్ సెల్వన్, కల్కి వంటి సినిమాలు బాక్సాఫీస్ ను కుదిపేశాయి.

“Cinema is the most beautiful fraud in the world.” – Jean-Luc Godard

 శౌర్యవ్ ఫాక్టర్

హై నాన్న లాంటి ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా తీసిన డైరెక్టర్ శౌర్యవ్ నుంచి ఎవరు కూడా పీరియడ్ ఎపిక్ ఆశించలేదు. కానీ ఆయన నానీకి వినిపించిన స్టోరీ, స్కేల్, విజన్ అన్నీ నచ్చడంతో, ఈ ప్రాజెక్ట్ గ్రీన్ సిగ్నల్ దక్కింది. ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ సంక్రాంతి 2026లో వచ్చే అవకాశం ఉంది. సుజీత్ సినిమా పూర్తయ్యాక షూట్ స్టార్ట్ అవుతుంది.

 బాక్సాఫీస్ ట్రెండ్ చెబుతున్న సత్యం

ఇటీవలి కాలం లో రిస్క్ తీసిన సినిమాలు బిగ్ రిజల్ట్ ఇచ్చాయి. ఆర్ఆర్ఆర్ గ్లోబల్ బారియర్స్ బ్రేక్ చేసింది. కాంతార చిన్న సినిమాగా మొదలై పాన్ ఇండియా హిట్టయింది.

బాహుబలి చరిత్రే మార్చేసింది. ఈ ప్యాటర్న్ ఒక్కదే చెబుతోంది — “సినిమా స్పెషల్ వరల్డ్ క్రియేట్ చేస్తే బాక్సాఫీస్ సక్సెస్ ఖాయం.” . నాని ఈ జానర్ లోకి వస్తున్నందుకు, ఆయన ఇప్పటికే ఉన్న ఓవర్సీస్, అర్బన్ ఫాలోయింగ్ కలిపి, ఇది ఆయనకు మరింత మార్కెట్ రెట్టింపు అయ్యే అవకాశం ఉంది.

“A film is never really good unless the camera is an eye in the head of a poet.” – Orson Welles

శౌర్యవ్ కవిత్వమయమైన టచ్, నాని వర్సటైల్ పెర్ఫార్మెన్స్ కలిస్తే, ఇది ఖచ్చితంగా స్పెషల్ అవుతుంది.

 నెక్స్ట్ లైన్ అప్

శౌర్యవ్ ప్రాజెక్ట్ తర్వాత కూడా నాని ఆగడం లేదు. జై భీమ్ ఫేమ్ టి.జె. జ్ఞానవేల్ తో కూడా ఆయన చర్చలు కొనసాగిస్తున్నాడు.

నాని స్ట్రాటజీ క్లియర్ — సేఫ్ బెట్ కంటే, ఛాలెంజింగ్ స్టోరీలు. ఇవే ఆయన కెరీర్ కి నిజమైన “గేమ్ చేంజర్” అవుతాయి.

*ఫైనల్ గా ... :

నాని ఎప్పుడూ “సాధారణ మనిషి” ఫీలింగ్ తోనే కనెక్ట్ అయ్యాడు. ఇప్పుడు అదే హీరో ఒక ఎపిక్ లోకం లోకి అడుగుపెడుతున్నాడు.ప్రస్తుతం పీరియడ్ డ్రామాలు, మైథలాజికల్ ఫిల్మ్స్, ఫాంటసీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర గెలుస్తున్నాయి. అలాంటి టైమ్‌లో నాని చేసే ఈ మూవీ ఆయన బాహుబలి మోమెంట్ కావచ్చని ఇండస్ట్రీలో టాక్.

Tags:    

Similar News