'ఇన్ స్పెక్టర్ రిషి' ఒటిటి మూవీ రివ్యూ!
సస్పెన్స్ ని చివరిదాకా మెయింటైన్ చేసారు. ఎపిసోడ్ ఎండ్ సస్పెన్స్ , క్లైమాక్స్ లో రివీల్ అయినా ట్విస్ట్ లు బాగున్నాయి. వివరాలు ఇవిగో...
Update: 2024-04-02 11:17 GMT
తెలుగులో వచ్చిన మంచి థ్రిల్లర్ వెబ్ సీరిస్ ..ఓ లుక్కేయవచ్చు. దీని సంగతేంటో చూడండి
సినిమా అయితే ఫస్ట్ హాఫ్ , సెకండాఫ్ అంటూ ముక్కలు చేసి మాట్లాడుకోవచ్చు. అయితే వెబ్ సీరిస్ లను ఎపిసోడ్స్ వారీగా కాకుండా ఓవరాల్ గా చూడాలి. ఈ క్రమంలో నవీన్ చంద్ర ప్రధాన పాత్ర పోషించిన 'ఇన్ స్పెక్టర్ రిషి' సిరీస్ 10 ఎపిసోడ్స్ గా స్ట్రీమింగ్ అవుతోంది. అడవి నేపథ్యంగా సాగే ఈ సిరీస్..మొదలెడితే చివరిదాకా చూడగలమా లేదా అనేది చూద్దాం.
కోయంబత్తూర్ కి దగ్గరలో ఉన్న 'తేన్ కాడ్' అటవీ ప్రాంతంలో నేపధ్యంలో ఈ కథ సాగుతుంది. క్రూరమృగాలకు ఆలవాలమైన ఈ అటవీ ప్రాంతాన్ని నమ్ముకుని ఎన్నో గిరిజిన కుటుంబాలు నివసిస్తూ ఉంటాయి. అయితే అక్కడ లోకల్ వాళ్లు తప్పించి సాయంత్రం 6 గంటల తరువాత ఎవరూ అక్కడికి ప్రవేశించారు. అడవిని రక్షించే ఫారెస్టు అధికారులే అక్కడ అడుగుపెట్టడానికి భయపడుతూంటారు. అలాంటి చోట వరస హత్యల పర్వం మొదలౌతుంది. హత్యకి గురైనవారి శవాలు అక్కడ చెట్ల మొదళ్లలో .. కొమ్మల మధ్యలో దొరుకుతూంటుంది. శవాల చుట్టూ బలమైన సాలెగూడు కట్టి ఉంటుంది. దాంతో భయపడిన అక్కడి జనం లోకల్ గా తిరగటానికే భయపడుతూంటారు. ఆ మర్డర్ మిస్టరీ ని ఛేథించటానికి 'ఇన్ స్పెక్టర్ రిషి' (నవీన్ చంద్ర) వస్తాడు.
రిషి (నవీన్ చంద్ర) కు అండగా మిగతా డిపార్టమెంట్ నిలిచి ఇన్వెస్టిగేషన్ లో సపోర్ట్ ఇస్తారు. అయితే ఆ వరుస హత్యలని వనరచ్చి అనే వనదేవత చేస్తోందని ఆ ఊరిప్రజలు నమ్మి చెప్తూంటారు. ఈరోజుల్లో ఇంకా 'వనదేవత' అడవిలో తిరగడం అనే విషయాన్ని రిషి కొట్టిపారేస్తాడు. అయితే మర్డర్ జరిగిన కొద్ది సేపటికే శవాల చుట్టూ అంత వేగంగా గూడుకట్టుకోవడం అతనికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆ దిశగా కూడా అతని ఇన్విస్టిగేషన్ మొదలెడతాడు. ఈ కేసుని అతను ఎలా డీల్ చేసాడు. ఏం కనుక్కున్నాడు...ఈ క్రమంలో అతనికి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? రిషి ఆ వనరచ్చిని కనిపెట్టాడా? లేక వనరచ్చి పేరు చెప్పి మరెవరైనా హత్యలు చేస్తున్నన్నారా? వంటి విషయాలు తెలియాలంటే సీరిస్ చూడాల్సిందే.
ఇక మొదట్లో సెటప్, పాత్రల పరిచయం, కథలోకి వెళ్లటానికి ఎపిసోడ్ల టైమ్ తీసుకుని కాస్త బోర్ కొట్టించిన వెళ్లేకొలిది సస్పెన్స్ బాగానే క్రియేట్ చేసి అందర్ని ఆకట్టుకునేల తీసి దర్శకుడు సక్సెస్ అయ్యాడు. అడవి నేపధ్యం తీసుకోవటం,గిరిజన గూడాల చుట్టూ కథ తిరగటం ఇంట్రస్టింగ్ గా అనిపిస్తుంది. మరీ ఊహకు అందని ట్విస్ట్ లు అవీ ఉండవు కానీ మినిమం ఓ క్రైమ్ థ్రిల్లర్ గా నడిచిపోతుంది. ఆ మర్డర్స్ ని ..ఎవరు చేస్తున్నారో తెలుసుకోవటానికైనా చివరిదాకా చూస్తాము. వనదేవత చేస్తోందా..లోకల్ అడవిలో ఉండే స్మగ్లర్లు చేస్తున్నారా..లేక చేతబడి మంగై చేస్తోందా...ఇవన్నీ కాకుండా రిషి చచ్చిపోయిన భార్య విజీ వల్ల జరుగుతోందా...ఇలా సస్పెన్స్ ని చివరిదాకా మెయింటైన్ చేసారు. ఎపిసోడ్ ఎండ్ సస్పెన్స్ , క్లైమాక్స్ లో రివీల్ అయినా ట్విస్ట్ లు బాగున్నాయి. కానీ 10 ఎపిసోడ్స్ రావటం కోసం అక్కడక్కడా కథనాన్ని సాగదీయడం,మాజీ భార్య జ్ఞాపకాలు , బలవంతపు ప్రేమ సన్నివేశాలు కాస్త బోర్ కొట్టిస్తాయి.
మొత్తంగా చెప్పాలంటే సస్పెన్స్, థ్రిల్లింగ్స్ ఇష్టపడే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ తరహా కథలను తెరపై నిలబెట్టడానికి అవసరమైన ఫొటోగ్రఫీ - బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. చీకటిలో సీన్స్ లైటింగ్ నేర్పుగా డిజైన్ చేసి చిత్రీకరించిన తీరు ఆకట్టుకుంటుంది. అలాగే వనదేవత రావడానికి ముందు వచ్చే సౌండ్ ఎఫెక్ట్ ఈ సిరీస్ లో ఫెరఫెక్ట్ గా సింక్ అయ్యింది. ఎడిటింగ్ బాగానే నడిచిపోతుంది. నవీన్ చంద్ర వంక పెట్టడానికి ఏమీ లేదు. చక్కగా చేసుకుంటూ వెళ్లారు. అసభ్య పదజాలం ఎక్కడ వాడకపోవటంతో ఫ్యామిలీలకు మంచి ఆప్షన్.
చూడచ్చా?
తెలుగులో వచ్చిన మంచి థ్రిల్లర్ వెబ్ సీరిస్ ..ఓ లుక్కేయవచ్చు
ఎక్కడ చూడాలి?
అమెజాన్ ప్రైమ్ (తెలుగులో ఉంది)