"కొత్తవాళ్లకి నో ఎంట్రీ"

ఓటీటీ వెలుగు వెనక ఉన్న చీకటి వాస్తవం!;

Update: 2025-05-29 10:23 GMT

ఒక రోజు ఉదయాన... మనం నిద్రలేచి

“రాత్రి ఓ అద్భుతమైన సినిమా చూశాం!” అని గుర్తు చేసుకునే రోజులు... తిరిగి వస్తాయా?

ఒక సినిమా మన ఊహల్లో ముద్రపడిపోవడం...

ఓ డైలాగ్‌ మన మనస్సులో పదే పదే రొటేట్ అవటం...

ఓ పాట మనని వీడి వెళ్లనని మెరాయించటం

ఓ స్క్రీన్‌ప్లే గురించి మన స్నేహితులతో రాత్రంతా చర్చించటం —

ఇవి ఇప్పుడు ఓ స్వీట్ మెమరీగా మిగిలిపోయాయా?

ఒకప్పుడు మాస్ సినిమా కూడా ఆర్ట్ స్టేట్‌మెంట్ అయ్యేది. మరి ఇప్పుడు? ఓటీటీలో ఏ సినిమా చూసినా, ఒకటే ఫీలింగ్: "ఇది మన కోసం తీసారా? లేక వాళ్ల ప్లాట్‌ఫామ్ టార్గెట్ కోసం తీసారా?" అని.

ఓటీటీని చూసి ఒకప్పుడు కలలు కన్నాం.

కొత్త కథలు వస్తాయన్న ఆశ.

కొత్త టాలెంట్‌కు డోర్లు ఓపెన్ అవుతాయన్న నమ్మకం.

కానీ ఇప్పుడు ఓటీటీ గేమ్ ఒక యుద్ధరంగంగా మారిపోయింది.

ఇప్పుడే అందరి లెక్కలూ ఒకటే:

ఓటీటీ వాళ్లను మెప్పించాలి. ఓ హిట్ కంటెంట్‌ని మార్చి మార్చి తీస్తే చాలు. ఆలోచించాల్సిన అవసరం లేదు. రిస్క్ అవసరం లేదు. ఎందుకంటే... ఇప్పటి క్రియేటివిటీకి మార్జిన్ లేదు.

ఇప్పుడు ఓటీటీలో నీ కథ రావాలంటే... 'స్టార్ ఎవరు?', 'డైరెక్టర్ అంతకు ముందు ఏ హిట్ కొట్టాడు?', 'నిర్మాత గట్టిగా ఖర్చుపెడతాడా? అనే లెక్కలు. ఈ లెక్కల్లో కొత్తవాళ్లకు చోటు లేదు. ఆశతో కలలు కంటున్న వాళ్లకు తలుపు తెరిచే వారు లేరు. కొత్త వాయిస్‌లను వింటారనే హామీ లేదు!. చిన్న సినిమాలకు ఇక్కడా చిన్న చూపు మొదలైపోయింది.

రోజు రోజుకీ ఓటీటీ గేమ్ మారిపోతోంది. కానీ దాని వెనక ఉన్న అసలు గేమ్ ఏంటి?

“Cinema is a mirror of society. When the mirror cracks, we don’t just lose the image… we lose the soul.” – Anonymous

ఒకప్పుడు దర్శకత్వం అంటే కలల దారిలో ప్రయాణించటం – ఇప్పుడు నిర్మాతల ఖాతాల లెక్కలకు సరిపడేలా వ్యవహించటం. నిర్మాతలను వెనక నుంచి ఓటీటీ ప్రపంచం నడిపిస్తోంది. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ఒక్కటే చర్చ – "ఇప్పటి కన్నా బ్యాడ్ టైమ్ ఇండస్ట్రీకి మునుపెప్పుడూ రాలేదు! నిర్మాతగా ,దర్శకుడుగా,రచయితగా మా చేతిలో ఏమీ ఉండటం లేదు"

"ఓటీటీలో కొత్తదనం లేదు – కొత్తవాళ్లకి అవకాశమే లేదు!"

ఓటీటీ బూమ్ మొదలైనప్పుడు 2017–18లో ఎంతగా ఆకర్షించిందో గుర్తుందా?. ఐడియాలు వర్షంలా వచ్చాయి. కొత్త రైటర్లు వెలుగులోకి వచ్చారు.

ఎక్కడ చూసినా “కథ ఉందా?” అనేది చర్చ మొదలు అయ్యేది. ఇప్పుడు మాత్రం “కథలో స్టార్ ఉన్నాడా?” అనేది డిసైడింగ్ ఫాక్టర్. Content is king అని మొదట చెప్పారు. కానీ ఇప్పుడు? “Cash is the emperor.”

ప్రస్తుతం ఓటీటీలు అన్నీ ఒకే గీత ని ఫాలో అవుతున్నాయి.

సెలబ్రిటీ మానియా, పేరు ఉన్న దర్శకుల మీదే పెట్టుబడి.

కొత్త దర్శకుడు, రచయిత కథ ఎంత గొప్పగా రాసినా, నేరేషన్‌కు అవకాశమే లేదు.

ముందుగా “బయోడేటా” చూపించాలి, స్టోరీ కాదు.

పాత రూపాయి తిరుగుతుంది – కొత్త డబ్బు రావడం లేదు

ఇందుకు ట్రేడ్ చెప్పే కారణం ఒకటుంది. ఇండస్ట్రీలో కొత్త నిర్మాతలు రావడం తగ్గిపోయింది. కొత్త ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టట్లేదు. ఇప్పటికీ అదే కొద్దిమంది నిర్మాతల మధ్యే డబ్బు తిరుగుతుంది.

దాంతో కొత్త కథలు వస్తాయన్న ఆశ చీకట్లో మాయమైంది.

కొత్త టాలెంట్ వెయిటింగ్‌లో నిలబడి పోతున్నారు.

చిన్న నిర్మాతలకు మార్కెట్‌లో చోటు లేదు.

“Repetition is not nostalgia… it is decay.”

అయితే ఈ ఓటీటీ గేమ్ లో ఎక్కువ నష్టపోయేది ఎవరో తెలుసా?

కొత్తగా వచ్చే ఆర్టిస్టులు. సినిమా తప్ప వేరే దారి లేని కొత్త దర్శకులు, కెమెరామెన్స్, టెక్నీషియన్లు, రైటర్లు. వాళ్లలో చాలామంది కోవిడ్ తర్వాత ఓటీటీని ఓ గేట్‌గా చూశారు. కానీ ఇప్పుడు?

ఓటీటీకి స్క్రిప్ట్ ఇచ్చి, నచ్చిన తర్వాతనే నెక్ట్స్ చర్చ మొదలవుతుంది. అప్పటికీ చెల్లింపు ఉంటుంది అనే హామీ ఉండదు! ఇదే కారణంగా చాలామంది ఇప్పుడు వెయిటింగ్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. కొత్త ప్రాజెక్ట్‌ మీద దృష్టి పెట్టడానికి ఉత్సాహం లేదు. వెనకడుగేస్తున్నారు.

గాడ్ ఫాధర్ వంటి సినిమా తీసిన Francis Ford Coppola ఓసారి ఇలా అన్నారు: "The saddest thing in cinema is not the failure of a film, but the absence of a new filmmaker."

ఇప్పుడు అదే జరుగుతోంది.

కొత్త దర్శకులే లేరు.

కొత్త నిర్మాతలే లేరు.

అందుకే కొత్త సినిమాలే రావడం లేదు.

ఈ గేమ్ లో పెద్దవాళ్లకు ఏ సమస్యా లేదు. పెద్ద స్టూడియోలు, నిర్మాతలకి ఫండింగ్ ఉంది. నష్టాన్ని భరించే సత్తా ఉంటుంది. ఫ్లాపైనా ఫర్వాలేదు ఓటీటీ ఎంతోకొంతకి తీసుకుంటుంది అనే ధైర్యం ఉంటుంది.

“Content is king” అన్నది కేవలం మీడియాలో వాక్యంమే. ఇప్పుడు... ‘Contacts are kings.’”

సిస్టమ్ బ్రేక్ అయ్యింది. రీసెట్ ఎవ్వరు చేయటం లేదు.

ఇప్పటి సినిమా- ఓటీటీ వ్యవస్థలో మూడు ప్రధాన లూప్ హోల్స్ ఉన్నాయి:

కొత్త నిర్మాతల క్రమం మాయం

ఓటీటీ మోడల్ స్టేట్‌మెంట్: Only Names Sell

అంతా లోపల నుంచే జరిగిపోతుంది – ఎక్స్‌టర్నల్ క్యాపిటల్ ఎంట్రీ లేదు

ఈ లూప్‌ను బ్రేక్ చేయాలంటే:

కొత్త డబ్బు రావాలి

కొత్త వాయిసెస్‌కి అవకాశం ఇవ్వాలి

మళ్లీ స్వతంత్ర నిర్మాతల సంస్కృతి పెరిగాలి

ఎప్పుడు మారుతుంది ఈ దశ?

“Revolutions in cinema don’t start with money. They start with courage.

ఇండస్ట్రీ మళ్ళీ బంగారపు రోజులకి రావాలంటే, భయపడకుండా కొత్తవాళ్లని ప్రోత్సహించాలి. ఓటీటీ తమ మోడల్‌ను రీడిజైన్ చేయాలి. బడ్జెట్ కన్నా స్టోరీకి విలువ ఇవ్వాలి.

ఎందుకంటే... సినిమా అన్నది ఒక బిజినెస్ మాత్రమే కాదు – అది ఒక అద్భుతమైన అనుభవం.. రాసేవాళ్లు, చూసేవాళ్లు, ఆస్వాదించేవాళ్లతో కూడిన ఓ సాంస్కృతిక వలయం. ఆ భావన మర్చిపోతే, బాక్సాఫీస్ మాత్రమే కనిపిస్తుంది, కళ కనిపించదు.

ఏదైమైనా ఇండస్ట్రీ తిరిగి బతికేది ఖచ్చితంగా కొత్త రక్తంతోనే.

Tags:    

Similar News