'భ్రమయుగం' ... ముమ్మట్టి విశ్వరూపం ఒటిటిలో ఎపుడు?

ఇది ఓటిటి యుగం. థియేటర్ లో రిలీజ్ ఎప్పుడు అని ఓ సినిమా గురించి ఎంక్వైరీ చేయటం మానేసి ఓటిటి రిలీజ్ ఎప్పుడు చేస్తున్నారు అని అడుగుతున్నారు.

Update: 2024-02-18 10:59 GMT
భ్రమయుగం

భ్ఓర సినిమా ఏదైనా భాషలో రిలీజైతే దాని తెలుగు వెర్షన్ ఇప్పుడు ఓటిటి ద్వారా దొరుకుతోంది. ముఖ్యంగా మళయాళ సినిమా రత్నాలన్ని ఓటిటిలోనే చూసి మన వాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు అదే ట్రెండ్ ని ఫాలో అవుతూ...ముమ్మట్టీ తాజా చిత్రం 'భ్రమయుగం' కోసం ఓటిటి జనం వెయిటింగ్ షురూ చేసారు. ఈ సినిమా తెలుగు వెర్షన్ థియేటర్ లో రిలీజ్ అవుతుందేమో అనుకుంటే సైలెంట్ గా మళయాళంలో రిలీజ్ చేసి సరిపెట్టారు నిర్మాతలు. తెలుగు వెర్షన్ థియేటర్ లో వస్తుందో రాదో కాబట్టి ఓటిటినే దిక్కు అని ఫిక్సై ఈ సినిమాని మేము చూడాలి..కాస్తంత స్పీడుగా ఓటిటిలో రిలీజ్ చేయండి మహా ప్రభో అని సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. ఈ సినిమాలో ఏముంది..ఎందుకు వెంటనే చూసేయాలనే ఆత్రుత అంటే..




 


మొన్న శుక్రవరాం మలయాళంలో విడుదలైన మమ్ముట్టి భ్రమ యుగం హిట్ టాక్ తెచ్చుకుంది. పూర్తి బ్లాక్ అండ్ వైట్, 35 ఎంఎంలో రూపొందిన ఈ హారర్ థ్రిల్లర్ ని అక్కడి ఆడియన్స్ చూసి తెగ మెచ్చుకుంటున్నారు. అక్కడ థియేటర్లు హౌస్ ఫుల్లవుతున్నాయి.దాంతో మనవాళ్లకు ఈ సినిమా చూడాలనిపించింది. దాంతో హైదరాబాద్ లో స్పెషల్ షో లు పడుతున్నాయి. ఆ టాక్ ని మనవాళ్లు స్ప్రెడ్ చేయటం, రివ్యూలు రాయటం చేసారు. ఈ క్రమంలో సామాన్యుడుకు సైతం ఈ సినిమా చూడాలనిపించి..ఓటిటిలో త్వరగా వస్తే బాగుండును అని ఫిక్సై ఆ అభిప్రాయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

ఇక ఈ చిత్రం స్టోరీ లైన్ ఏంటో చూస్తే చాలా సింపుల్... 18 వ శతాబ్దంలో జరిగే ఈ సినిమా కథలో ...జానపద గాయకుడైన తేవన్ (అర్జున్ అశోకన్) తక్కువ కులానికి చెందినవాడు. తన తల్లి కోసం వెళుతూ అడవిలో దారి తప్పుతాడు. అక్కడ అటు తిరిగి ఇటు తిరిగి ఓ పాడుబడిన ఇంటికి చేరుకుంటాడు. ఆ ఇంట్లో కుడుమోన్(మమ్ముట్టి), అతని వంటవాడు (సిద్దార్థ్ భరతన్) మాత్రమే ఉంటారు. దారి తప్పి వచ్చిన తేవన్ ని బాగానే రిసీవ్ చేసుకుంటారు. తక్కువ కులానికి చెందిన వాడని తక్కువ చేయరు. ఇంటికి వచ్చిన అతిథి అంటూ తేవన్‌ను తనతో పాటు సమానంగా చూస్తారు.అతిథి వచ్చాడని సకల మర్యాదలు చేస్తారు. టైమ్ గడిచే కొద్దీ అక్కడేదో తేడా ఉందని అర్థం అవుతుంది తేవన్ కు. తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఎంత ప్రయత్నించినా.. మళ్లీ తిరిగి అక్కడికే వస్తాడు. తాంత్రిక విద్యల్లో మొనగాడైన కుడుమోన్ ఉచ్చు నుంచి బయట పడటం కష్టం అని అర్దమవుతుంది. పాచికల ఆట ఆడుతూ కుడుమోన్ ఇతరులతో ఆడుకుంటూంటాడు. ఆ క్రమంలో జరిగే ఆసక్తికర సంఘటనలు, భీతిగొలిపే సన్నివేశాలే భ్రమ యుగం. ఇదో డార్క్ ఫ్యాంటసీ హారర్ థ్రిల్లర్‌.

ఇక ఈ 'భ్రమయుగం' చిత్రం OTT రైట్స్ ని Sony LIV వారు సొంతం చేసుకున్నారు. తెలుగు,తమిళ,మళయాళ,కన్నడ, హిందీ వెర్షన్స్ లలో రిలీజ్ చేస్తారు. అయితే ఓటిటిలో రిలీజ్ డేట్ ఇవ్వలేదు. అప్పుడే ఇవ్వరు. కానీ రెగ్యులర్ ఎగ్రిమెంట్ ప్రకారం సాధారణంగా థియేటర్ రిలీజ్ అయ్యిన 6-8 వారాల్లో వదులుతారు. మమ్ముట్టి అవార్డ్ విన్నింగ్ పెర్ఫామెన్స్ ఇచ్చిన ఈ చిత్రాన్ని 'భూతకాలం' తీసిన రాహుల్ సదాశివన్ ఈ సినిమాను తెరకెక్కించాడు.


Tags:    

Similar News