: ‘భామా కలాపం’-2 ఒటిటి మూవీ రివ్యూ
ప్రియమణి వన్ విమెన్ షో. పనిమనిషి కమ్ పార్టనర్ గా కనిపించే శరణ్య బాగా నవ్వించింది. సీరత్ కపూర్ గ్లామర్ బానే ఉంది. బ్రహ్మాజీనవ్వించే ప్రయత్నం చేసారు. వివరాలు;
Update: 2024-02-17 06:24 GMT
ఓటిటీల్లో కూడా సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. ఓటీటిల్లో హిట్టైన సినిమాని అక్కడే మరో సీక్వెల్ చేసి వదలటం ఇంట్రస్టింగ్ విషయం. దీని వలన రెండు లాభాలు ఉన్నాయి. మొదటి సినిమా చూడని వాళ్లు ఈ సీక్వెల్ చూసి...ఓహో దీనికి మొదటి పార్ట్ లాంటి సినిమా ఒకటి ఉందా..అని వెతుక్కుంటూ వెళ్లి దాన్ని చూసేస్తారు.
రెండోది..మొదట సినిమా చూసిన వాళ్లు..ఆ కథని ఎలా కంటిన్యూ చేసారా అని ఆసక్తిగా ఈ రెండో సినిమా పై లుక్కేయవచ్చు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు టైప్ స్కీమ్ అన్నమాట. అయితే డైరక్టర్ అభి విషయం ఉన్నవాడే అని మొదటి సినిమా ప్రూవ్ చేసింది కాబట్టి ఖచ్చితంగా ఈ రెండో సినిమాని ఆహా సాక్షిగా ఆహా అనిపించిందో లేదో చూద్దామని కూర్చుంటే...ఏం జరిగిందంటే...
సీక్వెల్ కాబట్టి పార్ట్ 1 ని పనిమాలా గుర్తు చేసుకుంటే... అనుపమ(ప్రియమణి) కాస్తంత మాటకారి. స్పీడు..అవసరమైతే క్రైమ్ లోకి వెళ్లి సమర్దవంతంగా బయిటకు రాగల యూట్యూబర్. ఆమె యూట్యూబ్ ఛానెల్ లో వంటలు చేస్తూంటుంది. ఆ వంటలు ఛానెల్ లో పెద్ద హిట్. పనిలో పనిగా ..ప్రక్కింట్లో ఏం జరుగుతోందో తొంగి చూసే అలవాటు ఉన్న సగటు ఇల్లాలు. అలా ఓ సారి తనకు సంభందం లేని విషయంలో తలదూర్చి...ఓ క్రైమ్ లో ఇరుక్కుంటుంది.
కోల్ కత్త మ్యూజియంలో రూ. 200 కోట్ల విలువైన కోడి గుడ్డు మాయమవడం, ఆ సమస్యల్లోంచి ఎట్లాగో నానా కష్టాలు పడి బయిటపడుతుంది. ఆ తర్వాత షరా మామూలుగా మొగడు చేత తిట్టించుకుని...ఈ సీక్వెల్ ప్రారంభానికి వేరే వాళ్ల గొడవల్లో తలదూర్చనని ఒట్టేయించుకుంటుంది. అయితే ఆ ఒట్టుమీద నిలబడుతుందా....తన కాళ్ల మీద తను నిలబడాలనే విపరీతమైన తపన ఉన్న ఆమె సీక్వెల్ లోనూ క్రైమ్ లో పడుతుంది. ఆ విషయం మనికి పోస్టర్ చూస్తేనే అర్దమవుతుంది. ఆ క్రైమ్ ఏమిటి అంటే...
అనుపమ ఇల్లు మారడంతో.. పార్ట్ 2 ప్రారంభం అవుతుంది.. యూట్యూబ్ లో భీబత్సంగా సంపాదించిన డబ్బులతో హోటల్ బిజినెస్ ప్రారంభిస్తుంది అనుపమ. తన పార్టనర్ గా పని మనిషి శిల్ప(శరణ్య ప్రదీప్)ను కూడా చేర్చుకుంటుంది. కుకింగ్ ఐడల్ పోటీల్లో పాల్గొనేందుకు కూడా ప్రిపేర్ అవుతుంది. ఈ ప్రాసెస్ లో ..ఆమె బిజిగా ఉండగా ఆమె జీవితంలో అనూహ్యమైన ఘటన జరుగుతుంది. ఓ గంజాయి స్మర్లర్‌ని తన ప్రమేయం లేకుండానే పోలీసులకు పట్టిస్తుంది. ఆ స్మగ్లరేమో తనని కావాలని అనుపమ పట్టించింది అనుకుని పగ పెంచుకొంటాడు. ఆమెని బెదిరిస్తూంటాడు. ఆ సమస్యల నుంచితప్పించుకునేందుకు డ్రగ్ కంట్రోల్ బ్యూరో మాజీ ఆఫీసర్ ని భర్తకు కూడా చెప్పకుండా కలుస్తుంది.
అయితే ఆ ఆఫీసర్ తక్కువవాడు కాదు.ఆమెను ఓ క్రైమ్ లో ఇరికించి దాన్నుంచి బయిటపడాలంటే ఆమెకు ఓ టాస్క్ ఇస్తాడు. ఆ టాస్క్ ప్రకారం వేయి కోట్ల విలువైన ఓ కోడి పుంజు బొమ్మని అనుపమ దొంగిలించాలి. ఇంతకీ.. ఆ బొమ్మకు అంత రేటు ఎందుకు ..ఆ బొమ్మలో ఏముంది? అనుపమ ఆ బొమ్మను ఎవరికి దొరక్కుండా దొంగిలించగలిగిందా? కుకింగ్ ఐడల్ కాంపిటీషన్‌కీ, ఈ వెయ్యి కోట్ల దొంగతనానికీ ఉన్న లింకేమిటి? తెలియాలంటే భామా కలాపం 2 చూడాల్సిందే.
మనీ హీస్ట్ ,బెర్లిన్ వంటి దొంగతనం మెయిన్ గా గల వెబ్ సీరిస్ లు చూసిన ఓటిటి బ్యాచ్ కు ఇలాంటివి ఆనుతాయా అంటే లోకల్ ప్లేవర్ ఉంది కాబట్టి నచ్చుతుంది. అందులోనూ ప్రియమణి టాప్ క్లాస్ యాక్టర్. అయితే ఆమెకు స్క్రిప్టు సహకరించగలగాలి. నీట్ గా క్లాస్ గా ఈ వెబ్ మూవిని ప్లాన్ చేసి తీసిన దర్శకుడు స్క్రిప్టుని అప్ అండ్ డౌన్స్ లేకుండా అలా ప్లాట్ గాలాక్కుళ్లిపోయారు.
ఓటిటి సినిమా కాబట్టి ఇంతకు మించి ఏమి చేస్తాం లే అనుకున్నారేమో కొంతదూరం వెళ్లాక రిలాక్స్ అయ్యిపోయారు. అయితే జనం కూడా చూసేటప్పుడు రిలాక్స్ అయ్యిపోతారు. సినిమా థియేటర్ లో చూసేటప్పుడు అయితే ..తలుపులు వేసేసి ఉంటాయి. రిమోట్ మన చేతిలో ఉండదు కాబట్టి సాగినా ..ఏం లాగినా బయిటకు వచ్చేదాకా ఒగ్గపెట్టుకుని కూర్చుంటాడు. ఒక్కసారి బయిటకువచ్చి ఊపిరి పీల్చుకుని మైక్ కనపడగానే ప్రస్టేషన్ మొత్తం వెళ్లగగ్గేస్తాడు. కానీ ఇక్కడ అలాకాదు...కర్శర్ తో ముందుకు లాగేస్తారు. రిమోట్ తో క్లైమాక్స్ కు వెళ్లిపోతారు. క్లైమాక్స్ ట్విస్ట్ ప్రెడిక్టబుల్ కాకుండా ఇంకాస్త వర్క్ చేయాల్సింది.అలాగే అక్కడ దాకా సాఫీగా నడిపి చివర్లో హడావిడిగా ముగించేసారెందుకో... టెక్నికల్ గా కూడా బాగుంది.
ప్రియమణి వన్ విమెన్ షో. పనిమనిషి కమ్ పార్టనర్ గా కనిపించే శరణ్య బాగా నవ్వించింది. సీరత్ కపూర్ గ్లామర్ బాగానే ఒలికింది. బ్రహ్మాజీనవ్వించే ప్రయత్నం చేసారు.
ప్రశాంత్ ఆర్.విహారి బ్యాక్ గ్రౌండ్ స్కోర్, దీపక్ సినిమాటోగ్రఫీ, విప్లవ్ నైషధ ఎడిటింగ్ క్లాస్ లుక్ ఇచ్చాయి. దర్శకుడుగా అభిమన్యు ఇంకోమెట్టు ఎక్కాడు. మొదట గుడ్డు.. ఈసారి కోడిపుంజు ..నెక్ట్స్ సీక్వెల్ లో ...ఏకంగా కోళ్ల ఫారంలో క్రైమ్ తెస్తాడేమో చూడాలి.
చూడచ్చా
అసభ్యత, హింస లేకుండా క్లీన్ గా నడిచే ఈ క్రైమ్ కామెడీని ప్రియమణి టాప్ క్లాస్ యాక్టింగ్ కోసమైనా చూడచ్చు.
నటీనటులు: ప్రియమణి, శరణ్య ప్రదీప్, సీరత్ కపూర్, చైతు జొన్నలగడ్డ, సుదీప్ వేద్, అనీష్ తదితరులు;
సంగీతం: ప్రశాంత్ విహారి;
సినిమాటోగ్రఫీ: దీపక్;
ఎడిటింగ్: విప్లవ్ నైషద్;
రచన, దర్శకత్వం: అభిమన్యు;
స్ట్రీమింగ్ ఓటిటి: ఆహా