కొత్త రికార్డులను కొల్లగొట్టిన ‘పుష్ఫరాజ్’

ఓ ఏడాదిలో అత్యధిక మంది వీక్షించిన చిత్రంగా రికార్డు

Update: 2024-12-21 10:40 GMT

‘పుష్ఫ 2’.. ది రూల్ సినిమా రికార్డులు బద్దలు కొడుతూనే ఉంది. ఇప్పటికే రూ. 1500 కోట్ల క్లబ్బులో చేరిన ఈ సినిమా రెండు వేల కోట్ల వైపు పరుగులు పెడుతోంది. వందేళ్ల హిందీ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిన్న మరో రికార్డును తన పేరు మీద లిఖించుకున్న పుష్ఫరాజ్.. తాజాగా ఒక సంవత్సరంలో వన్ మిలియన్ ప్రేక్షకులు చూసిన చిత్రంగా నిలిచింది. ఈ ఏడాదిలో అత్యధిక మంది అభిమానులు ఈ చిత్రాన్ని సోలోగా వీక్షించారని బుక్ మై షో వెల్లడించింది. మొత్తంగా 10.8 మిలియన్ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేశారని ప్రకటించింది.   

ఈ సంవత్సరం ముగింపు దశకు చేరుకోవడంతో, #BookMyShowThrowback పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది, ఇది దేశంతో పాటు, ప్రపంచవ్యాప్తంగా సినిమాటిక్ అనుభవాలను సేకరించి వాటిలోని విశేషాలను పంచుకుంది.

జనవరి 1 నుంచి డిసెంబర్ 5 మధ్య డేటాను విశ్లేషించగా, నవంబర్ 1 న బుక్‌మైషోలో బ్లాక్‌బస్టర్ డేగా నిలిచింది, ఎందుకంటే కంపెనీ కేవలం 24 గంటల్లో రికార్డు స్థాయిలో 2.3 మిలియన్ టిక్కెట్లను విక్రయించింది.

2024లో అత్యధికంగా వీక్షించిన సినిమాల్లో "స్త్రీ 2", "సింగం ఎగైన్", "భూల్ భూలైయా 3" వంటి హిందీ హిట్‌లతో పాటు "కల్కి 2898 AD" (తెలుగు), "హనుమాన్" (తెలుగు), "అమరన్" (తమిళం) కూడా ఉన్నాయి. ), "ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్" (తమిళం), "దేవర" (తెలుగు)"మంజుమ్మెల్ బాయ్స్" (మలయాళం) చోటు దక్కించుకున్నాయి. ఈ ఏడాదిలో ఒక సినీ అభిమాని 221 సినిమాలను వీక్షించినట్లు కంపెనీ వెల్లడించింది.
పాత సినిమాలను థియేటర్లలో మళ్లీ విడుదల( రీరిలీజ్) చేసే ట్రెండ్‌ను గమనిస్తూ, "కల్ హో నా హో", "టింబాద్", "రాక్‌స్టార్", "లైలా మజ్ను" వంటి చిత్రాలు అభిమానులను తిరిగి థియెటర్ కు రప్పించాయి. వీటిలో కొన్ని హలీవుడ్ చిత్రాలు సైతం ఉన్నాయి. BookMyShow 319 నగరాల్లో అసాధారణంగా 30,687 ప్రత్యక్ష ప్రసార ఈవెంట్‌లను అందించింది. ఇది వినోద వినియోగంలో 18 శాతం అభివృద్ధిని సాధించింది.
Tags:    

Similar News