40 సంవత్సరాల తర్వాత మళ్లీ కలిసిన రజనీ-హృతిక్

ఈసారి ఎవరి చేతికి పవర్?;

Update: 2025-08-13 09:29 GMT

ఆగస్ట్ 14 న బాలీవుడ్, టాలీవుడ్ అభిమానులు పండగ చేసుకునే రోజుగా మారనుంది! హృతిక్ రోషన్‌ హీరోగా తెరకెక్కిన వార్ 2, రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కిన కూలీ సినిమాలు ఒకే రోజు పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతున్నాయి. బాక్సాఫీస్‌ బరిలో పోటీ పడుతున్న ఈ రెండు “పవర్‌ హౌసెస్” లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

ఇండస్ట్రీ వర్గాలు చెప్పటమేమంటే, ఒకే రోజు రెండు భారీ సినిమాలు విడుదల అవ్వడం వలన ఓపెనింగ్ డే కొంత నష్టం తప్పనిసరిగా జరుగుతుంది. కానీ ప్రేక్షకుల ఆసక్తి, సోషల్‌ మీడియా హైప్ చూస్తే, ఈ వార్ నిజంగా బాక్సాఫీస్‌ రికార్డులను షేక్‌ చేయబోతోంది. టికెట్ సేల్స్, ప్రీ-బుకింగ్, డిజిటల్ హైప్—రెండు సినిమాల వార్‌ను మరింత ఉత్కంఠతో చూపిస్తున్నాయి.

అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే, ఈ రెండు సినిమాల్లో చేసిన స్టార్‌లు గతంలో 1986లో ఓ సినిమా కోసం కలసి నటించారు. ఓం ప్రకాష్‌ దర్శకత్వంలో వచ్చిన భగవాద్ దాదా సినిమాలో రజనీ హీరోగా, హృతిక్ రోషన్ బాల నటుడిగా కనిపించారు. హృతిక్ పాత్ర చిన్నదైనప్పటికీ, సినిమాకు పెద్ద ఎఫెక్ట్ ఇచ్చింది. శ్రీదేవి, టీనా, పరేష్ రావల్‌, డానీ డెంజోంగ్పా వంటి నటులు కూడా ఆ సినిమాలో కీలకంగా నటించారు. ఫ్యాన్స్ “నాస్టాల్జియా + కొత్త ఎక్సైట్‌మెంట్” మిక్స్ లో ఊగుతున్నారు.

ఇంతకాలానికి మళ్లీ ఇద్దరి హీరోల పేర్లు ఒకేసారి మీడియాలో నానుతున్నాయి. ఈ క్రమంలో భగవాద్ దాదా లో రజనీ-హృతిక్ సీన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, ఫ్యాన్స్‌ను మళ్లీ ఓ గమ్మత్తైన మోడ్‌లోకి తెచ్చాయి. ఇంతకాలం తర్వాత ఈ ఇద్దరు సూపర్‌స్టార్స్ తమ-తమ కొత్త సినిమాలతో బాక్సాఫీస్ వార్ ప్రారంభించబోతున్నారు.

ఏదైమైనా ...రజనీ vs హృతిక్ వార్ కేవలం రెండు సూపర్‌స్టార్స్ సినిమాల మధ్య పోటీ మాత్రమే కాదు. ఇది 1986లో భగవాద్ దాదా తో మొదలైన చారిత్రక లింక్‌ను పునరుద్దరిస్తూ, పాన్ ఇండియా రేంజ్, ఫ్యాన్స్ డైనమిక్స్, సోషల్ మీడియా హైప్, బాక్సాఫీస్ స్ట్రాటజీ మిళితం చేసిన “సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్”గా మారబోతోంది. ఈ వార్ ఫలితాన్ని ఎవరు సాధిస్తారో ముందే చెప్పడం కష్టం, కానీ ఒక్క స్పష్టమైన విషయం: ఇండియన్ సినిమా ఇండస్ట్రీ, ఫ్యాన్స్, బాక్సాఫీస్ బిజినెస్ కోసం ఇది ఒక మెమోరబుల్‌ చాప్టర్ అవుతుంది.

Tags:    

Similar News