నాని ‘సరిపోదా శనివారం’... మల్లాది ‘శనివారం నాది’ నవలకు కాపీనా! ఏం తేలింది?

నాని ‘సరిపోదా శనివారం’... మల్లాది ‘శనివారం నాది’ నవలకు కాపీనా! ఏం తేలింది?

Update: 2024-08-29 11:27 GMT

సినిమా జనాల్లోనే కాకుండా మిగతా వాళ్లలో ఓ చిత్రమైన లక్షణం కనపడుతుంది. ఓ సినిమా పోస్టర్ గానీ, టైటిల్ కానీ, ట్రైలర్ కానీ ఇలా ఏ ప్రమోషన్ మెటీరియల్ వదలినా దానికి ఫలానా సినిమా నుంచి కాపీ కొట్టారని లేదా ఫలానా పోస్టర్ ని కాపీ కొట్టి డిజైన్ చేసారని ఇలా ఏదో ఒకటి వైరల్ చేయటం మొదలెట్టేస్తారు. అలాగే రీసెంట్ గా సోషల్ మీడియాలో నాని సినిమా ‘సరిపోదా శనివారం’పై రకరకాల వార్తలు వినిపించాయి.

ఈ సినిమా టైటిల్ పోస్టర్, కాన్సెప్టు గురించి తెలియగానే తెలుగులో ప్రఖ్యాత నవలా రచయిత మల్లాది వెంకటకృష్ణమూర్తి అప్పుడెప్పుడో రాసిన ‘శనివారం నాది’ సినిమాకు కాపీ అంటూ చర్చ మొదలెట్టేసారు. సరిపోతుందా శనివారం టైటిల్ లో శనివారం అనే పదం ఉండటం, అలాగే కాన్సెప్టు కొద్దిగా పోలి ఉండటం అందుకు కారణం. అయితే ఈ రోజు సినిమా రిలీజైంది కాబట్టి అసలు విషయం తెలిసిపోయింది. నవలకు, సినిమాకు పోలిక ఉందా లేదా అనేది తెలిసిపోయింది.

ఇంతకీ శనివారం నాదే నవలలో కాన్సెప్టు ఏంటంటే..అమ్మాయిలను ప్రతి శనివారం ఇబ్బందులకు గురి చేసే ఒక విచిత్రమైన మనస్తత్వం గల వ్యక్తి కథ ఇది. అతని గురించి ప్రజలకు రఘుపతి అనే విలేకరి తన పత్రిక ద్వారా తెలుపుతాడు. ఈ వార్త చూసిన ఆ సైకో ప్రతీ శనివారం రెచ్చిపోయి మరీ వార్నింగ్ లు ఇచ్చి మరీ దారుణమైన పనులు మొదలు పెడతాడు. సబ్ ఇన్స్పెక్టర్ మంగళ ఈ కేస్ గురించి నియమించబడిన పోలీస్ ఆఫీసర్. రఘుపతి, మంగళ ఎవరి పద్ధతుల్లో వాళ్ళు ఆ సైకో ని పట్టుకోవడానికి ప్రయత్నించి ఎలా సఫలికృతులయ్యారు అనేదే కోర్ కాన్సెప్టు.

‘సరిపోదా శనివారం’ మ్యాటర్ 

ఇక సరిపోదా శనివారం కథ విషయానికి వస్తే..ఇందులో హీరో పేరు సూర్య (నాని). అతనికి చిన్నప్పట్నుంచీ కోపం ఎక్కువ. ఆ కోపాన్ని కంట్రోలులో పెట్టడం కోసం తను చనిపోతూ ఓ మాట తీసుకుంటుంది తల్లి). అదేమిటంటే తన కోపాన్ని వారంలో ఒక్క రోజుకే పరిమితం చేసుకోవటం. అలా వారమంతా ఎంతగా కోపం వచ్చినా కంట్రోలు చేసుకుంటూ, శనివారం మాత్రమే తన కోపానికి కారణమైన వాళ్ల పని పడుతుంటాడు. అలా అతని లిస్ట్ లోకి సీఐ దయానంద్ (ఎస్.జె.సూర్య) చేరతాడు. అతనో సైకో టైప్ క్యారక్టర్. అతనికి సూర్య ఎలా బుద్ది చెప్తాడు అనేదే కథ. అలాగే సూర్య ని చారులత (ప్రియాంక మోహన్) అనే ఓ అమ్మాయి ప్రేమిస్తుంది, వీళ్లిద్దరు కలిసే విలన్ కు బుద్ది చెప్పే పోగ్రామ్ పెట్టుకుంటారన్నమాట.

ఇక రెండింటిలోనూ పోలిక అంటే శనివారం మాత్రమే రెచ్చిపోయే ప్రధాన పాత్రలు. నవల్లో సైకో శనివారం రెచ్చిపోతే అతన్ని మిగతా పాత్రలు ఇన్విస్టిగేట్ చేసి పట్టుకుంటాయి. ఇక సినిమాలో సైకోని ..శనివారం మాత్రమే తనలోని కోపాన్ని బయిటకు తెచ్చే హీరో ఎలా పట్టుకుని బుద్ది చెప్పాడన్నదే. సైకోలు, శనివారం, పోలీస్ లు కామన్, మిగతాదంతా వేర్వేరే. కాబట్టి ఎవరి కథలు వాళ్లవే. ఎవరి సీన్స్ వాళ్లవే. అయితే ఈ నవల చదవుతూండగా డైరక్టర్ కు ఈ ఆలోచన వచ్చి ఉండవచ్చు. అయితే అది ప్రేరణే అవుతుంది కానీ కాపీ కాదు.

శనివారం నాది నవల... అల్లరి రవిబాబు , భూమిక కాంబినేషన్ లో వచ్చిన అనసూయకు కూడా కొద్దిగా పోలికలు కనపడతాయి. అయితే అనసూయ ఓ హాలీవుడ్ చిత్రం ప్రేరణతో కూడా వచ్చిందని అప్పట్లో చెప్పుకున్నారు. కాబట్టి ఏది నిజం..ఏది ప్రేరణ, ఏది కాపీ అనేది పట్టుకోవటం కష్టమే. కాబట్టి హ్యాపీగా సినిమా చూసేయటమే. అంతగా అయితే సినిమా చూసి వచ్చి నవల చదువుకోవటమే.

Tags:    

Similar News