సల్మాన్ ఖాన్ ఇంటి వెలుపల కాల్పుల కేసు: లుక్ అవుట్ నోటీసులు జారీ..
బాలీవుడ్ నటుడు, సల్మాన్ ఇంటిదగ్గర జరిగిన కాల్పుల కేసులో పోలీసులు కీలక సూత్రధారిని గుర్తించారు. అతడిపై దర్యాప్తు అధికారులు లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు.
By : The Federal
Update: 2024-04-27 07:55 GMT
బాలీవుడ్ కండలవీరుడు, సల్మాన్ ఖాన్ ఇంటి వెలుపల ఈ నెల ప్రారంభంలో జరిగిన కాల్పుల కేసులో పోలీసులు గ్యాంగ్ స్టర్ అన్మోల్ బిష్ణోయ్ పై లుక్ ఔట్ నోటీసు జారీ చేశారు. ఇతను గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడు. కెనడాలో నివసిస్తున్నట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.
ప్రస్తుతం గుజరాత్‌లోని సబర్మతిలోని జైలులో ఉన్న లారెన్స్ బిష్ణోయ్‌ని కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉందని, ఈ కేసులో కఠినమైన మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నియంత్రణ చట్టం (MCOCA)ను అమలు చేయాలని కూడా ఆలోచిస్తున్నట్లు ఓ పోలీస్ అధికారి మీడియాకు తెలిపారు. కాగా సల్మాన్ ఇంటి వెలుపల జరిగిన కాల్పులు తన పనే అని అన్మోల్ బిష్ణోయ్ సామాజిక మాధ్యమంలో ప్రకటించాడు. దర్యాప్తులో అతని ప్రమేయం ఉందని తేలడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. తరువాత ముంబై పోలీసులు శుక్రవారం LOC జారీ చేశారని అధికారి తెలిపారు.
"ఈ కేసులో అన్మోల్, లారెన్స్ బిష్ణోయ్‌లను వాంటెడ్ నిందితులు. అన్మోల్ బిష్ణోయ్ కెనడాలో ఉంటూ అమెరికాకు వెళ్తుంటాడు. అయితే, కాల్పులకు బాధ్యత వహిస్తూ పెట్టిన ఫేస్‌బుక్ పోస్ట్ IP చిరునామా పోర్చుగల్‌కు చెందినది. "అని అధికారి తెలిపారు.
ఏప్రిల్ 14 తెల్లవారుజామున సల్మాన్ ఖాన్ నివాసం ఉంటున్న బాంద్రాలో గల గెలాక్సీ అపార్ట్ మెంట్ ముందు ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చి కాల్పలు జరిపారు. ఇందులో ఎవరికి గాయాలు కాలేదు. ఈ సంఘటనపై పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్ 307 (హత్య ప్రయత్నం) కింద ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్) నమోదు చేశారు.
బీహార్‌కు చెందిన ఇద్దరు షూటర్లు విక్కీ గుప్తా (24), సాగర్ పాల్ (21)ను పోలీసులు ఈ ఘటనలో అరెస్ట్ చేశారు. వీరికి సహకరించిన సోను కుమార్ సుభాష్ చందర్ బిష్ణోయ్ (37), అనుజ్ థాపన్ (32)లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వీరే బిహార్ గ్యాంగ్ కు దేశీయ తుఫాకులు సమకూర్చినట్లు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సోను బిష్ణోయ్ థాపన్ పంజాబ్‌లోని లారెన్స్ బిష్ణోయ్ స్వస్థలానికి దగ్గరగా ఉన్న ఫాజిల్కాకు చెందినవారు.
పంజాబ్‌లోని గంగాపూర్‌లో నమోదైన కాల్పుల కేసులో లారెన్స్, అన్మోల్ బిషోయ్‌లతో పాటు ఇద్దరూ కూడా నిందితులుగా ఉన్నారని ఆయన చెప్పారు.