మళయాళి కామెడీ 'ది పెట్ డిటెక్టివ్' రివ్యూ!

నవ్వులా? లేక గందరగోళమా?

Update: 2025-12-02 02:30 GMT

మెక్సికో అండర్వలర్డ్ లో ఒకప్పుడు శ్వాస తీసుకోవడమే నేరమై ఉండేది. అక్కడ ఓ డాన్ ఉన్నాడు. అతని ముఖం చూసి జీవించి వాళ్లే లేరు. అతని పేరు సాంబాయ్. అతని ఉనికి గాలిలా… ఉన్నా లేనట్లే, కనిపించదు.వినిపించదు. కానీ ఆ నీడను మొదటిసారి కెమెరాలో బంధించినది మాత్రం ఒకడే — జోస్ అలూలా (రెంజి పనికర్). అయితే

అది ‘ఫొటో’ కాదు… మరణ పత్రం.

అతను క్లిక్ చేశాడు.

తర్వాత పరుగుని ఆపలేదు.

దేశాలు, సరిహద్దులు, రక్తపాతం దాటి… చివరికి ‘కొచ్చి’లో దాక్కున్నాడు.

ఇప్పుడు అతనికి గతం లేదు.

భయం లేదు.

కానీ నిద్ర కూడా లేదు.

డిటెక్టివ్ ఏజెన్సీ నడిపిస్తూ నీడలతో సహజీవనం చేస్తూ జీవిస్తున్నాడు.

కట్ టు – టోనీ అలూలా! ఎవరితను..

జోస్ కొడుకు. కనబడే ప్రపంచాన్ని తప్ప ఇంకేదీ నమ్మని వాడు. జీవితం ఎన్నిసార్లు తలుపులు మూసినా… డిటెక్టివ్ అవ్వడం కోసం వాటిని తెరుస్తూనే ఉన్నాడు.

అతని ప్రేయసి కైకేయి (అనుపమా పరమేశ్వరన్).

ఆమెది ఒక మాట —

“నువ్వు నిజంగా డిటెక్టివ్ అనిపించుకున్న రోజు… నా తండ్రితో పెళ్లి విషయం మాట్లాడుతా.”

ఇప్పుడు టోనీ తన డిటెస్టివ్ కేసులతో నిరూపించుకునేందుకు జీవిస్తున్నాడు —

తప్పిపోయిన పెట్స్… కిటికీల్లోంచి జారిపోయిన పిల్లులు… అప్రయత్నంగా జారిపోయే పోయే చిన్న చిన్న నీడలు.

కానీ అతను వెతకాల్సిన ‘ పెద్ద కేసు’ మాత్రం ఎక్కడో దాక్కుంది.

అయితే విధి ఒకసారి ఫోన్ చేసింది…

అదే టోనీ జీవితాన్ని తలకిందులు చేసింది.

30 కోట్ల విలువైన ఒక చేపల బాక్స్… కనిపించకుండా పోయిన ఒక స్కూల్ పాప. ఒక లింక్… వీటి మధ్య ఏదో కనెక్షన్ ఉంది?

టోనీ మొదట అది సాధారణ స్మగ్లింగ్ కేసు అనుకున్నాడు.

కానీ అతను లోతుగా తవ్విన కొద్దీ…

ఆ చేపలు “అరుదైనవి” మాత్రమే కాదు —

అవి కొంతమందికి ప్రాణం… మరికొంతమందికి ప్రాణం తీసే శాపం.

చేపల బాక్స్ చేతులు మారిన ప్రతి చోట ఒక నీడ కనిపిస్తోంది.

ఆ నీడ వెనుక ఉన్నది ఎవరు?

జోస్ మెక్సికోలో ఎదుర్కొన్న శత్రువుతో ఈ కేసుకి సంబంధం ఉందా?

ఆ చిన్నారి అదృశ్యం — స్మగ్లింగ్ రింగ్‌లోని ఎవరో దాచిన ‘సీక్రెట్’నా?

లేక ఇంకేదైనా?

ఒక ‘పెట్ డిటెక్టివ్’ నుంచి… ‘లైఫ్-ఎండ్-డెత్ గేమ్’లో అడుగుపెట్టిన టోనీ — ఈ కేసుని నిజంగా ఛేదించగలడా? అతను కనుగొనబోయే నిజాలు… అతని కుటుంబాన్ని, అతని ప్రేమను, అతని జీవితం మొత్తాన్ని కుదిపివేస్తాయా?

ఇదంతా చూడగానే ఒక్క ప్రశ్న:

“ఒక సాధారణ డిటెక్టివ్‌కి 30 కోట్లు విలువైన చేపలతో ఏమిటి సంబంధం?” సమాధానం… కథ చివరి పది నిమిషాల్లో వచ్చే షాక్‌లో దాగుంది. ఏమిటా షాక్.

విశ్లేషణ:

కామెడీ, యాక్షన్, క్యాసోట్‌క్ ఎనర్జీ — ఇవన్నీ ఒకే ఫ్రేమ్‌లో కలపాలనుకున్న సినిమా ది పెట్ డిటెక్టివ్, మలయాళంలో అరుదుగా కనిపించే స్లాప్స్టిక్ మ్యాడ్‌కాప్ జానర్ ని మళ్లీ తీసుకురావడానికి ప్రయత్నించిన సినిమా. మెక్సికో నేపథ్యంతో ప్రారంభమయ్యే ఈ కథ, అసలైన డ్రామాను “కొచ్చి”లో మొదలవుతుంది.

స్టోరీ మొదట ప్రారంభమయ్యేది హీరో వ్యక్తిగత ప్రేరణతో — తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి; అందుకు “హీరోలా నిరూపించుకోవాలి”; అందుకే డిటెక్టివ్ అవ్వాలి. ఇది మంచి క్యారక్టర్ డ్రివెన్ ప్రిమైజ్. కానీ ఎగ్జిక్యుషన్ మాత్రం అందుకు తగినట్లుగా జరగలేదు. హీరో కావాలనే అవసరం వ్యక్తిగతది. ఇది రైటింగ్‌లో మంచి ఎమోషనల్ ఏంకర్ . కానీ కథ ఆ ఎమోషన్‌పై నిలబడకుండా వెంటనే action-comedy టెంప్లేట్ వైపు పరుగెత్తుతుంది. ఆ క్రమంలో స్టోరీ డెప్త్ ను ను కామెడీ పూర్తిగా మింగేసింది.

ఇక్కడే మళయాళ సూపర్ హిట్ CID Moosa ఎలా పని చేసిందో గుర్తు చేసుకుంటే — అక్కడ narrative one event → another event గా smooth flowతో సాగింది. ఫ్లో అంత సాఫీగా ఉండడంతో చూసేందుకు శ్రమ ఉండదు.బుర్రకు పని చెప్పాల్సిన పని ఉండదు. ఎంజాయ్ చేస్తూ వెళ్తూంటే సరిపోతుంది. అదే The Pet Detective కి వచ్చేసరికి ఆ ప్లో చాలా ఆలస్యంగా ఎస్టాబ్లిష్ అవుతుంది. మొదటి 40 నిమిషాలు screenplay rhythmను వెతుక్కుంటూనే ఉంటుంది. ఒకసారి సెటప్ సెట్ అయితే, హాస్యం సహజంగా పనిచేస్తుంది. కానీ అప్పటికి ప్రేక్షకుడు సహనాన్ని చాలావరకు ఖర్చపెట్టేసాడు. అలాగే స్టోరీ Setup చేసింతగా Payoff చేయలేదు. దాంతో కామెడీ “sound” గా మారింది, కానీ “connection” లేకుండా మారిపోయింది.

చివరికి ప్రేక్షకుడు సినిమా యొక్క ఇలాంటి పొరపాట్లు కన్నా fun factor నే గుర్తుపెట్టుకుంటాడు. అదే ఈ సినిమాకి సర్వైలల్ ట్రిక్.

టెక్నికల్ గా సినిమా అద్బుతం కాదు కానీ నడిచిపోతుంది.

చూడచ్చా?

కామెడీ కొన్ని చోట్ల బాగానే పండింది కాబట్టి ఓ లుక్కేయవచ్చు

ఎక్కడ చూడచ్చు?

జీ 5 లో తెలుగులో ఉంది.

Tags:    

Similar News