చిరంజీవి నెక్ట్స్ ప్రాజెక్టుకు నిర్మాత దొరక లేదా?
సమస్య ఏమిటి?;
“హిట్స్ తీసినవాడే సేఫ్ కాదు, మార్కెట్‌లో నమ్మకాన్ని నిలబెట్టుకున్నవాడే సేఫ్.”
టాలీవుడ్ ట్రేడ్ ఇప్పుడు ఈ మాటలనే నమ్ముతోంది.
వాల్టేర్ వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన తర్వాత, మళ్ళీ మెగాస్టార్‌తో సినిమా చేయాలని బాబీ సిద్ధమవుతున్నారు. ఇప్పటికే చిరంజీవి స్క్రిప్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా కూడా… ప్రాజెక్ట్ ఎందుకు ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు? ఇదీ ఇండస్ట్రీలో జరుగుతున్న డిస్కషన్. అయితే సమస్య ఉన్నది స్క్రిప్ట్ విషయంలో కాదు – ఇది ట్రస్ట్, ట్రాక్ రికార్డ్, బిజినెస్ రియాలిటీస్ ల గురించి.
బాబి, చిరంజీవిల రిపీట్ కాంబో ప్రపోజల్ అన్ని టాప్ ప్రొడక్షన్ హౌస్‌లకు చేరుకుంది, అయితే వారందరూ అనేక చిత్రాలతో బిజీగా ఉన్నామని అన్నారు కానీ ఎవరూ ఫైనలైజ్ చేయలేదు. అందుకు కారణం ఒకటే చెప్తున్నారు. ఇప్పటి ఇండస్ట్రీలో బిజినెస్ మోడల్స్ మారాయి. నిర్మాతలు ఇప్పుడు ‘హైప్’తో కంటే ‘బాలెన్స్‌షీట్’తో సినిమాలను కొలుస్తున్నారు. అయితే ఏమిటా బ్యాలెన్స్ షీట్. ఎక్కడ బాలెన్స్ తప్పింది?
డాకూ మహారాజ్ రిజల్ట్ ఎఫెక్ట్
బాబీ కొల్లి దర్శకత్వం వహించగా సంక్రాంతి కానుకగా విడుదలైన చిత్రం డాకూ మహారాజ్. బాలకృష్ణను అనుకున్నదానికంటే కొత్తగా చూపించిన ప్రయత్నం. కానీ ఈ సినిమా అనుకున్న స్దాయిలో విజయాన్ని తేలేదు. బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ వచ్చినా, వర్డ్ ఆఫ్ మౌత్ స్పీడ్‌గా పడిపోవడంతో కలెక్షన్లు స్థిరంగా నిలవలేకపోయాయి.
"డాకూ మహారాజ్ ఓ ఫ్లాట్ నరేటివ్‌తో ముందుకెళ్లింది. టెక్నికల్ గా రిచ్ అయినా, కమర్షియల్ గా అది హిట్ కాదు," అని క్రిటిక్స్ తేల్చేసారు.
డాకూ మహారాజ్ సినిమా తర్వాత, బాబీపై ఉన్న నిర్మాతలకు ఉన్న నమ్మకం కాస్త తగ్గింది. సినిమా ఫ్లాప్ అవ్వచ్చు కానీ బడ్జెట్ ఎక్కువై దానికి సరపడ రికవరీలు లేక ఫెయిల్ అవ్వకూడని ఇండస్ట్రీ పెద్దలు ఎప్పుడు చెప్తుంటారు. అదే డాకూ మహారాజ్ కు అయ్యిందని పరిశ్రమలో టాక్. అదే ఇప్పుడు బాబీ కొత్త చిత్రంపై మరోసారి భారీ పెట్టుబడి పెట్టడానికి ఆలోచనలో పడేలా చేస్తుంది.
OTT దెబ్బ , చిరు మార్కెట్
ఓటీటీ మార్కెట్ గతంతో పోలిస్తే ఇప్పుడు మరింత మెచ్యూర్ అయింది. ఖర్చు తగ్గించి, ఎక్కువ ROI వచ్చే కంటెంట్‌ను వారు కోరుకుంటున్నారు. ఇక మెగాస్టార్ తాజా చిత్రం విశ్వంభర ఓటీటీ బిజినెస్ అనుకున్న స్థాయిలో క్లోజ్ కాకపోవడం కూడా మరో ప్రశ్నను లేవనెత్తుతుంది.
"OTT ప్లాట్‌ఫారమ్‌లు ఇప్పుడు డేటా-డ్రైవన్ గా మారిపోయాయి. మెగాస్టార్ హోదా కూడా భారీ డీల్‌లకు గ్యారెంటీ ఇవ్వదు. 'విశ్వంభర' రికార్డు ధరలకు క్లోజ్ అవ్వలేదు, ఇది నిర్మాతలను అప్రమత్తం చేస్తుంది," ఓ సీనియర్ ఓటీటీ కన్సల్టెంట్ చెప్తున్న మాట.
గత కొంతకాలంగా భారీ బడ్జెట్ పెట్టే నిర్మాతలు డిజిటల్ రికవరీపై ఆధారపడుతున్నారు. కానీ ఇప్పుడు OTT రేట్లు తగ్గుతున్న తరుణంలో, స్టార్ సినిమాలకు కూడా బ్యాకప్ దొరకడం కష్టంగా మారింది. కొంతకాలం దాదాపు సినిమాలు ఓటీటీ రూపంలో లాభాలు పొందినవే. అయితే బిజినెస్ మోడల్ ఎప్పుడు ఒకేలా ఉండదు. మొదట సినిమాల్ని విరివిగా కొన్న ఓటీటీ సంస్థలు ఆ తర్వాత ఎక్కడలేని నియమ నిబంధనలు పెట్టడం మొదలుపెట్టాయి. దాంతో ఓటీటీ నమ్ముకొని సినిమా చేస్తే దాన్ని చేతులారా కిల్ చేసుకోవడమే అనే పరిస్థితి వచ్చేసింది.
బడ్జెట్ బాంబు
మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ..
ఈ ప్రాజెక్టు టోటల్ బడ్జెట్: ₹200 కోట్లు
చిరంజీవి రెమ్యూనరేషన్: ₹75 కోట్లు
మిగిలిన నటీనటులు & టెక్నికల్: ₹25 కోట్లు
ప్రొడక్షన్ ఖర్చు: ₹100 కోట్లు దాటే ఛాన్స్
ఇదో ఒక massive, full-on commercial entertainer… వర్కవుట్ అయితే భారీగానే ఉంటుంది. కానీ అంత ఖర్చు పెట్టే నిర్మాతలు ముందుకు రావాలి. ఇప్పుడు నిర్మాతలు స్టార్ సాలిడ్ అయినా, మార్కెట్ డైనమిక్స్‌కి సరిపోలే ప్రాజెక్ట్ కావాలి అని చూస్తున్నారు.
చిరంజీవి మాత్రం ప్రాజెక్ట్‌పై పూర్తి కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. స్క్రిప్ట్ నచ్చిన వెంటనే "Let’s do this big., I will take care," అన్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాను హ్యాండిల్ చేసే సరైన నిర్మాత కోసం చిరంజీవి వెతుకులాటలో ఉన్నారని తెలుస్తోంది.
ఏదైమైనా చిరంజీవి — ఓ పేరు కాదు, ఓ పవర్. ఇప్పటివరకు ఎన్నో మాస్ ఫెస్టివల్స్ ఇచ్చిన చిరు, ఇప్పుడు మరోసారి తన ఫ్యాన్స్ కోసం బాబీతో కలవబోతున్నాడు. వాల్టేర్ వీరయ్య తర్వాత మళ్లీ అదే ఫీల్… అదే మాస్… అదే ఫన్నీ & ఫైర్ మిక్స్ కావాలి. ఖచ్చితంగా బాక్సాఫీస్ బద్దలు అవుతుంది.