త్రిష తొలి వెబ్‌సిరీస్‌ ‘బృంద’ రివ్యూ

ఫామ్ లో ఉన్న హీరోయిన్స్ మెల్లి మెల్లిగా వెబ్ సీరిస్ లు వైపు వస్తున్నారు. ఇప్పటికే తమన్నా, సమంత,కాజల్ వంటి స్టార్ హీరోయిన్స్ సైతం వెబ్ సీరిస్ లు చేసేసి జెండా పాతేసారు.

Update: 2024-08-03 03:36 GMT

ఫామ్ లో ఉన్న హీరోయిన్స్ మెల్లి మెల్లిగా వెబ్ సీరిస్ లు వైపు వస్తున్నారు. ఇప్పటికే తమన్నా, సమంత,కాజల్ వంటి స్టార్ హీరోయిన్స్ సైతం వెబ్ సీరిస్ లు చేసేసి జెండా పాతేసారు. ఇప్పుడు ఈ వరసలోకి త్రిష వచ్చి చేరింది. ఆమె నటించిన తొలి వెబ్ సీరిస్ ‘బృంద’ఓటిటిలోకి వచ్చేసింది. త్రిష నిజానికి మంచి ఫామ్ లోనే ఉంది. మొన్న లియోలో విజయ్ సరసన చేసింది. ఇప్పుడు అజిత్ సరసన మరో పెద్ద సినిమా చేస్తోంది. అయినా సరే ఓటిటి సీరిస్ చేసిందంటే ఖచ్చితంగా కంటెంట్ అదిరిపోయిందని అనిపిస్తేనే చేస్తుంది. ఇంతకీ ఆ కంటెంట్ ఏమిటి..మనకు నచ్చుతుందా?

కథేంటి

పోలీస్ ఆఫీసర్ 'బృంద' .. ధృడమైన వ్యక్తిత్వం. తనేంటో తన పనేంటో ప్రక్క చూపు లేకుండా చేసుకుపోయే మనస్తత్వం. ఆమె హైదరాబాద్ లోనే ఎస్సైగా పోస్టింగ్ వస్తే వెళ్తుంది. అయితే ఆమె మహిళ అని పెద్దగా ఎవరూ పట్టించుకోరు. అయనా అదేమీ పట్టించుకోదు బృంద. ఈలోగా పోలీస్ డిపార్టమెంట్ ఛాలెంజ్ విసిరే ఓ కేసు వస్తుంది.

సిటీలో వరస హత్యలు జరుగుతూంటాయి. మొదటి ఓ శవం చెరువులో దొరుకుతుంది. అయితే ఆ హత్యకు సంభందించి పెద్దగా క్లూలు లేకపోవటంతో డిపార్టెంట్ క్లోజ్ చేద్దామనుకుంటుంది. కానీ అది ఒక్కటే హత్య కాదని మరికొన్ని ఉన్నాయని, హంతకుడు ఓ ప్రత్యేక తరహాలో హత్యలు చేస్తున్నాడని బృంద కనిపెడుతుంది. తాను చంపాలనుకున్నవారికి ముందుగా గుండు చేస్తూంటాడు..అలాగే ఒకే చోట ఎక్కువసార్లు పొడుస్తూ ఉంటాడు. హత్య చేసిన ప్రదేశానికి దగ్గరలోని చెరువుల్లో శవాలను పడేస్తూ ఉంటాడు. వీటితో బృంద ముందుకు వెళ్లాలనుకుంటుంది.

కాని డిపార్టమెంట్ పెద్దగా ఆమెకు సహకరించదు. కానీ బృంద పట్టు వీడదు. ఆ సైకో కిల్లరు ని పట్టుకోవాలనే పట్టుదలతో ఇన్విస్టిగేషన్ మొదలెడుతుంది. అసలు ఎందుకు ఈ హత్యలు చేస్తున్నాడు. వీటి వెనక ఉన్న అసలు కారణమేమిటి అని తవ్వుకుంటూ పోతే కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు బయిటకు వస్తాయి. దేవుడుని నమ్మే వాళ్లనే హంతకుడు హత్యలు చేస్తన్నాడని అర్దం చేసుకుంటుంది. ఇప్పుడు ఆ దైవ ద్వేైషి ఎవరు ...అతన్ని ఎలా ఆపాలి..మరికొన్ని మర్డర్స్ జరగకుండా ఆమె ఆపగలిగిందా వంటి విషయాలు తెలియాలంటే సీరిస్ చూడాల్సిందే.

విశ్లేషణ

వరస హత్యలు, సైకో, ఓ పోలీస్ అధికారి ఇన్విస్టిగేషన్, క్లూ లు పట్టుకుని ముందుకు వెళ్లటం ఇలాంటి కంటెంట్ తో ఇప్పటికే చాలా సీరిస్ లు, సినిమాలు చూసేసాం. ముఖ్యంగా ఓటిటిల్లో ఇలాంటి కంటెంట్ ఎక్కువే. మరి ఈ సీరిస్ స్పెషాలిటి ఏమిటి అంటే... ఇంట్రస్టింగ్ నేరేషన్ తో సాగే స్క్రీన్ ప్లే. తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ కలిగించారు. అలాగే త్రిష ఎవరు ..ఏమిటి అనేది ఇన్విస్టిగేషన్ తో పాటు ప్లాష్ బ్యాక్ లో చెప్తూ కథను కన్ఫూజ్ లేకుండా చెప్పుకొచ్చారు. అలాగే క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా బాగా డిజైన్ చేసారు. ఇన్వెస్టిగేషన్ కొత్తగా అనిపించదు కానీ చూస్తున్నంతసేపు బోర్ కొట్టించదు. అయితే కొంత స్లో నేరేషన్ , మరీ ఎక్కువ డిటేలింగ్ , భయంకరమైన స్థితిలో ఉన్న శవాలని పదే పదే క్లోజప్ షాట్ లో చూపించడం ఇబ్బందే. అలాగే ఫ్యామీలలతో చూడాలంటే బ్లడ్ షెడ్ ని చూపించటం ఎవాయిడ్ చేయాల్సింది.

టెక్నికల్ గా ...

ఈ సీరిస్ టెక్నికల్ గా మంచి మార్కులే పడతాయి. డైరక్టర్ సూర్య మనోజ్ కథలో ఇంటెన్స్ తో పాటు ఎమోషన్ ని అందించాలని చూసారు. చాలా వరకూ సక్సెస్ అయ్యారు. అయితే డిటేలింగ్ ని తగ్గించాల్సింది. చివరి రెండు ఎపిసోడ్స్ కూడా కొంత లాగిన ఫీలింగ్ వచ్చింది. శక్తికాంత్ కార్తీక్ పాటలు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. జయ్ కృష్ణ డైలాగులు సహజంగా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. త్రిష పాత్రకు ప్రాణం పోసింది. ఆమె వలన ఓ సినిమా చూస్తున్న ఎక్సపీరియన్స్ వచ్చింది.

చూడచ్చా

చూడదగ్గదే . కాకపోతే క్రైమ్ సీరిస్ లు ఆసక్తి ఉన్నవారికి అయితే బాగా నచ్చుతుంది. మిగిలిన వారికి త్రిష తో ఎంగేజ్ అవ్వాల్సి ఉంటుంది.

Entertainment, Brinda, Webseries, SoniLive, Trisha, Review, 

స్ట్రీమింగ్‌ వేదిక: సోనీలివ్‌ లో తెలుగులో ఉంది.

Tags:    

Similar News