'వార్ 2' టీజర్: తారక్ బర్త్‌డే కంటెంట్‌లో... హృతిక్ హైజాక్ ఎందుకు?

ఎట్టకేలకు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రిలీజయ్యింది.;

Update: 2025-05-21 05:34 GMT

అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 'వార్ 2' టీజర్ ఎట్టకేలకు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రిలీజయ్యింది. కానీ పండగలా ఫీలవ్వాల్సిన టైమ్‌కి… సోషల్ మీడియాలో ఫీడ్‌లను చూస్తే వివాదాల తుపానులా మారుతోందనిపిస్తోంది. ఈ టీజర్ చూసిన వాళ్లు ఎన్టీఆర్ పుట్టిన రోజుకు రిలీజ్ చేసిన టీజర్ లా లేదు హృతిక్ పుట్టిన రోజుకు కి రిలీజ్ చేసినట్లు ఉందంటున్నారు. హృతిక్ రోషన్ షాట్స్ మొత్తం టీజర్ ని హైజాక్ చేసారంటున్నారు. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

విపరీతమైన అంచనాలు, బాహుబలి - కెజిఎఫ్ స్థాయిలో ఊహించిన తెలుగు ఫ్యాన్స్‌కి, ఈ టీజర్ అసలు కిక్ ఇవ్వలేకపోయిందనేది నిజం.

https://www.youtube.com/watch?v=9Dve2VMOv5U

టీజర్ లో సమస్య ఎక్కడ ?

తారక్ బర్త్‌డే సందర్భంగా టీజర్ వచ్చిందనుకుంటే, అక్కడ హృతిక్ రోషన్ ప్రాముఖ్యత ఎక్కువగా కనిపించింది.

విషెస్ టెక్స్ట్ అయినా పెట్టుంటే సరిపోతుందని ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

హృతిక్ ఎలివేషన్ – తారక్ ఫ్యాన్స్‌ను అసహనానికి గురి చేసింది.

విజువల్స్ లోని కొందిగా బలహీనమైన వీఎఫెక్స్, తారక్ లుక్స్ లో డిజైన్ లోపం వంటి అంశాలు వైరల్ అవుతున్నాయి.

ముఖ్యంగా ట్రైన్ నుంచి జంప్ చేసే సీన్ – వెంటనే 'వినయ విధేయ రామ' రామ్ చరణ్ సన్నివేశాన్ని గుర్తుచేసిందంటూ ట్రోలింగ్‌కి ఆరంభమైంది.

ఈ వెర్షన్ ఎన్టీఆర్ చూసారా?

టీజర్‌లో తారక్ సీరియస్ ఎక్స్‌ప్రెషన్ సీన్లు మాత్రమే ఎక్కువగా కనిపించాయి. ఫ్యాన్స్ కోరుకున్న యంగ్ టైగర్ ఎనర్జీ, మాస్ డైలాగులు, థండరింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ మిస్ అయ్యాయి.

ఆపై కియారా అద్వానీ బికినీ సీన్ పైనే ఎక్కువ చర్చ జరుగుతుండటంతో, డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఏం చూపించాలనుకున్నాడో స్పష్టంగా అర్థం కావడం లేదంటున్నారు.

ఫ్యాన్స్ లో అసంతృప్తి – సౌత్ వర్సెస్ నార్త్ యాంగిల్ ?

ఉత్తరాదిన ప్రేక్షకులకు ఇది ఓకే అనిపించవచ్చు. కానీ దక్షిణాది టార్గెట్‌గా తీసుకుంటే, ఖచ్చితంగా ఎన్టీఆర్ అభిమానులు చూసేది హీరో యాంగిల్‌నే.

ఆగస్ట్ 14న రానున్న 'వార్ 2 vs కూలీ' క్లాష్ ముందు ఇలా నెగటివ్ టాక్ రావడం యష్ రాజ్ ఫిలిమ్ కు ఓ వార్నింగ్ లా మారింది.

తక్షణ కర్తవ్యం

ట్రైలర్‌తోనే ఈ నెగటివ్ బజ్‌ను రివర్స్ చేయాలి.

ట్రకైలర్ లో తారక్ స్ట్రాంగ్ స్క్రీన్ ప్రెజెన్స్

పవర్‌ఫుల్ డైలాగులు

మాస్ మూమెంట్స్

…ఇవన్నీ కనుక పెట్టకపోతే నార్త్ డైరక్టర్స్ మన హీరోలు ని డైరక్ట్ చేస్తే వర్కవుట్ కాదు అనే టాక్ వచ్చేస్తుంది.

మీ అభిప్రాయం ఏంటి? ‘వార్ 2’ టీజర్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? కామెంట్స్ లో చెప్పండి!

Tags:    

Similar News