ఎన్టీఆర్ #Devara పై స్టార్స్ సైలెంట్, ట్వీట్స్, రివ్యూలు లేవు, కారణం ఏంటి?

చాలా మంది సినిమాలు చూడటానికి అనేక గంటలు టైమ్ స్పెండ్ చేస్తారు. చూడటం అయ్యిపోయాక తమ రొటీన్ లైఫ్ లో పడిపోయి ఆ సినిమాని మర్చిపోతారు. కానీ ఫిల్మ్ లవర్స్ మాత్రం ఇందుకు విరుద్దం.

Update: 2024-10-05 06:24 GMT

చాలా మంది సినిమాలు చూడటానికి అనేక గంటలు టైమ్ స్పెండ్ చేస్తారు. చూడటం అయ్యిపోయాక తమ రొటీన్ లైఫ్ లో ,పనుల్లో పడిపోతారు, ఆ సినిమాని మర్చిపోతారు. కానీ ఫిల్మ్ లవర్స్ మాత్రం ఇందుకు విరుద్దం. తాము చూసిన ఆ సినిమా మంచి,చెడ్డలు గురించి చర్చించకుండా ఉండలేరు. సినిమాలో క్యాజువల్ గా కనపడే అంశాలు కాకుండా విభిన్నంగా ఏమైనా ఉందా అని వెతుకుతారు. సోషల్ మీడియాలో వాటిని షేర్ చేసి డిస్కషన్ మొదలెడతారు. అదో ప్రపంచంగా బ్రతుకుతూంటారు. ఇక సినిమా వాళ్ళు అందుకు అతీతం కాదు. సినిమా నచ్చితే మొహమాటం లేకుండా ట్వీట్ చేస్తూంటారు.

చాలా సార్లు స్టార్ డైరక్టర్స్, స్టార్ హీరోలు ఇచ్చే ఇలాంటి ట్వీట్స్ వల్ల సదరు సినిమాలకు బజ్ క్రియేట్ అవుతూంటుంది. అయితే ఇప్పుడు ఇందంతా ఎందుకు అంటే ఎన్టీఆర్ దేవర సినిమా రిలీజ్ అయ్యి ఇన్ని రోజులైనా చిన్నా, పెద్దా ఏ హీరో కూడా సినిమా గురించి మాట్లాడటం లేదు. ఎన్టీఆర్ కు సన్నిహితుడైన రాజమౌళి సైతం సైలెంట్ గా ఉన్నారు. ఆయన ఆల్రెడీ దేవర సినిమా చూసారని, వీడియోలు బయిటకు వచ్చాయి. ఎందుకిలా జరిగింది అనే డిస్కషన్ ఫిల్మ్ సర్కిల్స్ లో మొదలైంది.

దేవర సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న ఎన్టీఆర్

ఇక యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం దేవ‌ర‌ స‌క్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఆ విషయం సక్సెస్ మీట్ లో ఆయనలో కనపడే ఆనందం, ఉద్వేగం తో తెలిసిపోయింది. దాదాపు ఆరేళ్ల త‌ర్వాత ఎన్టీఆర్ నుంచి వ‌చ్చిన ఈ సోలో మూవీ.. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా ఆశ్చర్యకరంగా బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల కురుపిస్తోంది. ఆ కలెక్షన్స్ ఎన్టీఆర్ కు కొత్తేమీ కాదు. అయితే దేవర నుంచి ఆయన బాగా ఎక్సపెక్ట్ చేసారు. ఆర్.ఆర్.ఆర్ వంటి సక్సెస్ తర్వాత తన సోలో మూవీ కావటంతో ఈ సినిమాపై చాలా ఎక్సపెక్టేషన్స్ పెట్టుకున్నారు. అదే సమయంలో రాజమోళి సినిమా చేసాక డిజాస్టర్స్ ఇస్తారు హీరోలు అనే సెంటిమెంట్ రిపీట్ అవుతుందా అనే భయం ఎక్కడో చోట కొంతైనా ఉంటుంది. అవన్ని ఈ సినిమా సక్సెస్ తీసేసింది. అయితే అదే సమయంలో ఈ సినిమాకు ఇండస్ట్రీ కూడా సపోర్ట్ వస్తే బాగుండేది.

కానీ ఆశ్చర్యంగా చిన్న హీరోలు మొదలుకుని పెద్ద వాళ్లు దాకా ఎవరూ ఈ సినిమా గురించి మాట్లాడింది లేదు. ఇది అందరిలో ఆశ్చర్యం కలిగించింది. సినిమా చూడకపోయినా బెస్టాఫ్ లక్ అంటూ చెప్తూంటారు. అలాంటిది ఈ సినిమాకి జరగలేదు. ఎందుకిలా అనేది ఇప్పుడు కొందరికి క్వచ్చిన్ మార్క్ గా కనిపిస్తే మరికొందరికి ఎన్టీఆర్ సక్సెస్ చూసి అసూయ పడుతున్నారా అనే యాంగిల్ లో ఆలోచించేలా చేస్తోంది. అయితే సినిమా ఇండస్ట్రీలో సాధారణంగా సక్సెస్ వస్తే అందరూ షేర్ చేసుకుంటారు.సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకంటే సినిమాలు ఆడుతూంటే తాము చేసే సినిమాలకు ప్లస్ అవుతుంది.

ఎందుకు దేవరని ఇండస్ట్రీ దూరం పెట్టింది?

అందులోనూ ఎన్టీఆర్ ఇండస్ట్రీలో అజాత శత్రువు. ఆయనకు ప్రత్యేకమైన గ్రూప్ లు ఏమీ లేవు. ఆయన్ని ఎవరైనా కావాలని దూరం పెట్టాలేమో కానీ ఆయన మాత్రం దూరం కాడు. అందరీతో స్నేహంగా ఉంటారు. అయితే చిన్న ట్వీట్ కూడా ఎందుకు రాలేదు. అంటే మొదటి రోజు సినిమా చూసాక ,మిక్సెడ్ టాక్ విన్నాక కొందరికి సినిమా రిజల్ట్ పై సందేహం వచ్చి ఉండవచ్చు. తాము ట్వీట్ చేసి మెచ్చుకుంటే సినిమా ప్లాఫ్ అయితే ఏంటి పరిస్దితి అనుకుని ఉండవచ్చు అనేది ఓ రీజన్ గా చెప్తున్నారు. ఇండస్ట్రీ అసలే భయాలతో బ్రతుకుతూంటుంది. మనకెందుకు అనుకోవచ్చు. అయితే ఎవరూ ఊహించని విధంగా దేవర సూపర్ హిట్ అయ్యాక అయినా ప్రశంసలు వర్షం కురిపంచవచ్చు కదా అనేది సగటు సినీ ప్రేమికుడి ప్రశ్న.

దేవర కలెక్షన్స్ విషయానికి వస్తే....

వారం రోజుల్లో దేవరకు ఇండియావ్యాప్తంగా రూ. 215.6 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. వీటిలో తెలుగు నుంచి 164 కోట్లు, హిందీ ద్వారా 44 కోట్లు, కర్ణాటక నుంచి 1.58 కోట్లు, తమిళ వెర్షన్‌కు 4.8 కోట్లు, మలయాళంలో 1.22 కోట్ల నెట్ వసూళ్లు ఉన్నాయి. అలాగే, ఇండియా వైడ్‌గా దేవరకు రూ. 255 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. దేవర చిత్రానికి వారం రోజుల్లో ఏపీ, తెలంగాణలో రూ. 122.45 కోట్ల షేర్ కలెక్షన్స్ రాగా.. రూ. 172.25 కోట్ల గ్రాస్ కలెక్ట్ అయింది. అలాగే, వరల్డ్ వైడ్‌గా రూ. 324.25 కోట్ల నెట్ కలెక్షన్స్ వస్తే.. 199.43 కోట్ల షేర్, 342.30 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఇక రూ. 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన దేవర సినిమాకు రూ. 182.25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగి రూ. 184 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయింది.

బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న దేవర

ట్రేడ్ నుంచి అందుతున్న లెక్కలు ప్రకారం అతి తక్కువ రోజుల్లోనే ఈ బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేసుకున్న దేవర సినిమా ఇప్పటికీ రూ. 15.43 కోట్ల లాభాలను రాబట్టింది. అలాగే, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో 153.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌కు 155 కోట్లకుపైగా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను పూర్తి చేసి రూ. 12.15 కోట్ల ప్రాఫిట్ కొల్లగొట్టింది దేవర చిత్రం. ఇక ఇతర రాష్ట్రాలైన కర్ణాటకలో రూ. 14.85 కోట్లు, తమిళనాడులో 3.85 కోట్లు, కేరళలో 83 లక్షలు, హిందీతోపాటు ఇతర స్టేట్స్‌లో 25.35 కోట్లు, ఓవర్సీస్‌లో 32.10 కోట్ల షేర్ కలెక్షన్స్‌ను దేవర సినిమా ఏడు రోజుల్లో కొల్లగొట్టింది. అలాగే, ఓవర్సీస్‌లో 69.10 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది.

వీటిన్నటికి దూరంగా ఎన్టీఆర్

ఇక ఎన్టీఆర్ మాత్రం ఇవన్నీ పట్టించుకునేలా లేరు. వార్ 2 షూటింగ్ లో జాయిన్ అయ్యిపోయారు. ప్రస్తుతం ఆయన దృష్టి మొత్తం నార్త్ మార్కెట్ మీదే ఉంది. అందుకో కోసం ఓ స్ట్రాటజీ ప్రకారం వెళ్ళుతున్నారు. వార్ 2 సైన్ చేసినప్పుడు ఎన్టీఆర్ బాలీవుడ్ కి వెళ్లి ఏం చేస్తాడు అనే టాపిక్ రైజ్ చేసారు కొందరు. అయితే ఇప్పుడు దేవర తర్వాత వార్ 2 రిలీజ్ కీలకం కానుంది. ఖచ్చితంగా వార్ 2 ని నార్త్ లో భారీగా ప్రచారం చేస్తారు. ఎన్టీఆర్ ఇమేజ్ ప్రతీ ఇంటికి రీచ్ అవుతుంది. వార్ 2 హిట్ అయితే ఇక చెప్పక్కర్లేదు. ఓ రకంగా దేవర తర్వాత వార్ 2 టీమ్ కు ఎన్టీఆర్ ఓ ఎస్సెట్ గా మారాడనటంలో సందేహం లేదు. ఎన్టీఆర్ పేరు చెప్పి కూడా బాలీవుడ్ మార్కెట్ జరుగుతుంది. ఎన్టీఆర్ అక్కడ మాస్ బెల్ట్ లోకి వెళ్తున్నారు. అదే అతనికి ప్లస్ కానుంది. ఇక దేవర, వార్ 2 ఇంపాక్ట్ ఖచ్చితంగా ప్రశాంత్ నీల్ తో చేయబోతున్న డ్రాగన్ పై ఉంటుంది.

Tags:    

Similar News