మయన్మార్ నగరంలో మరోసారి భూకంపం

రిక్టార్ స్కేలుపై 5.5గా నమోదు.;

Update: 2025-04-13 07:35 GMT
Click the Play button to listen to article

మయన్మార్‌(Myanmar city)లోని ఒక చిన్న నగరం మెయిక్టిలా సమీపంలో ఆదివారం ఉదయం భూమి కంపిందించి. దీని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 5.5గా నమోదైంది. అయితే ఎటువంటి ప్రాణనష్టం సంభవించ లేదని వార్తలొస్తున్నాయి.

మయన్మార్‌లోని రెండో అతిపెద్ద నగరమైన మండలే అనేక ప్రభుత్వ కార్యాలయాలు దెబ్బతిన్న రాజధాని నేపిటావ్ మధ్య ఉన్న హాలులో తాజా భూకంప కేంద్రం దాదాపుగా ఉంది.

ఇంకా కోలుకోకముందే..

మార్చి 28న మయన్మార్ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. అపార ప్రాణనష్టం, ఆస్తినష్టం సంభవించింది. మృతుల సంఖ్య 3,649కు చేరింది. 5,018 మంది గాయపడ్డారని మయన్మార్ సైనిక ప్రభుత్వ ప్రతినిధి మేజర్ జనరల్ జా మిన్ తున్ తెలిపారు.

దాని నుంచి ఇంకా కోలుకోక ముందే మరో భూకంపం సంభవించింది. భూకంపం చాలా బలంగా ఉందని, ప్రజలు భవనాల నుంచి బయటకు పరుగులు తీశారని, కొన్ని నివాసాలలో పైకప్పులు దెబ్బతిన్నాయని ఇద్దరు వుండ్విన్ నివాసితులు అసోసియేటెడ్ ప్రెస్‌కు ఫోన్ ద్వారా తెలిపారు.

Tags:    

Similar News