జపాన్ ను వణికించిన వరుస భూకంపాలు
ది ఫ్యూచర్ ఐ సా బుక్ లో అంచనాల నేపథ్యంలో ప్రజల్లో భయాందోళనలు;
By : The Federal
Update: 2025-07-06 13:25 GMT
ప్రపంచ భూకంపాల రాజధానిగా ఉన్న జపాన్ ను మరోసారి భూ ప్రకంపనలు వణికించాయి. ప్రధాన భూభాగానికి నైరుతి దిశలో ఉన్న టోకారా ద్వీపంలో 5.4 తీవ్రతతో భూకంపం సంభవించింది.
ఈ ప్రాంతంలో మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందనే భయాల నేపథ్యంలో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. గురువారం సంభవించిన శక్తివంతమైన భూకంపం తరువాత దక్షిణ జపాన్ లోని అకుసేకీ ద్వీపంలో ఉన్న 89 మంది నివాసితులను అధికారులు ఖాళీ చేయించారు. ఇటీవల ఈ ప్రాంతంలో వేయి కంటే ఎక్కువ ప్రకంపనలు సంభవించాయి.
కామిక్ పుస్తకం లో ఏం రాశారంటే..
ఇటీవల భూకంపాలపై ప్రజలు ఆందోళన చెందడానికి ప్రధానం కారణం ఓ కామిక్ పుస్తకం. అందులో స్వయం ప్రకటిత దివ్యదృష్టి గల రియో టాట్సుకి రాసిన 1999 కామిక్ పుస్తకం. దాని పేరు ‘ది ఫ్యూచర్ ఐ సా’. జపాన్ ను 2025 జూలై 5న వరుస భూకంపాలు వణికిస్తాయని తెలిపింది.
ఇప్పుడు జపాన్ లో భూప్రకంపనలు నిజం కావడంతో సోషల్ మీడియాలో ఇవే అంశాలు వైరల్ గా మారాయి. ఈ పుస్తకంలో ఆమె తనకు వచ్చిన కలల ఆధారంగా చేతితో రాసిన అంచనాలు ఉన్నాయి. వాటిలో చాలా వరకు నిజం అయ్యాయని ఆమె చెబుతోంది. ఇది సోషల్ మీడియాలో మరిన్ని ఊహగానాలకు ఆజ్యం పోసింది.
ఇంతకుముందు 2011 టోహోకూ భూకంపం, సునామీ, పుకుషిమా అణు కేంద్రం ధ్వంసం వంటిని ‘ది ప్యూచర్ ఐ సా’ అంచనా వేసినట్లు కచ్చితంగా జరిగాయి. దీనితో ఈ బుక్ అంతర్జాతీయ దృష్టిని బాగా ఆకర్షించింది. ముఖ్యంగా మార్చి 11న తేదీ భూకంపం వస్తుందని చెప్పడం, అది జరగడంతో ఈమె అంచనాలకు ప్రాధాన్యం ఏర్పడింది.
అధిక భూకంపాలు..
దక్షిణ జపాన్ లో ఇటీవల సంభవించిన భూకంపాలతో నెటిజన్లు ఈ పుస్తకంపై ఆసక్తిని ప్రదర్శించారు. రాబోయే భూకంపాల గురించి ఆధారాలు లేదా అంచనాల కోసం వెతుకుతున్నవారికి ఇది ఒక ఆధారంగా ఉంది.
2025 లో భూకంపాల సంఖ్య పెరుగుతుందని చెప్పడం జపనీయుల్లో కలవరం కలిగించింది. అయితే ఆధారాలు లేని అంచనాలు నమ్మవద్దని ప్రభుత్వం ప్రజలను కోరింది.
‘‘మనం ప్రస్తుతం శాస్త్రీయ అవగాహానతో భూకంపం కచ్చితమైన సమయం, స్థానం, పరమానం గుర్తించడం కష్టం’’ అని జపాన్ వాతావరణ సంస్థ భూకంపం, సునామీ పర్యవేక్షణ విభాగం డైరెక్టర్ అయటకా ఎబిటా అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజలు ఊహాగానాల కంటే శాస్త్రీయ ఆధారాలపై నమ్మకం పెట్టుకోవాలని కోరారు.