‘షేక్ హసీనా’కు మరణశిక్ష విధించిన బంగ్లా కోర్టు

మానవత్వానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుందన్నా ట్రిబ్యూనల్

Update: 2025-11-17 11:25 GMT
షేక్ హసీనా

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై నమోదు చేసిన కేసులను విచారించిన  ప్రత్యేక ట్రిబ్యూనల్ అందరు అనుకున్నట్లుగానే మరణశిక్ష విధిస్తున్నట్లు తీర్పు ప్రకటించింది. తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలను క్రూరంగా అణచివేసే ప్రయత్నం చేసినందుకు ఈ శిక్ష విధిస్తున్నట్లు వెల్లడించింది. హసీనా ‘‘మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు’’ చేశారని ప్రత్యేక ట్రిబ్యూనల్ అభిప్రాయపడింది. గత ఏడాది ఆగష్టు 5న హసీనా ఢాకా వీడి భారత్ కు వచ్చి తలదాచుకుంటున్నారు.

హసీనా తన రెచ్చగొట్టే ఉత్తర్వూ ద్వారా మానవాళికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడిందని, నివారణ చర్యలు తీసుకోవడంలో విఫలం అయ్యారని ట్రిబ్యూనల్ పేర్కొంది. నిరసనకారులపై డ్రోన్లు, హెలికాప్టర్లు, ప్రాణాంతక ఆయుధాలను ఉపయోగించాలని ఆదేశించారని, తద్వారా మానవాళికి వ్యతిరేకంగా ఒక నేరానికి పాల్పడిందని కూడా అభిప్రాయపడింది.
గత సంవత్సరం విద్యార్థుల నేతృత్వంలో జరిగిన ఆందోళనలో మరణించిన విద్యార్థులు, ఇతర నిరసనకారులపై బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యూనల(ఐసీటీ-బీడీ) అనే ప్రత్యేక ట్రిబ్యూనల్ ను ఏర్పాటు చేసింది.
ఇందులో హసీనాతో పాటు అమె ఇద్దరు సహాయకులు మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్, మాజీ పోలీస్ చీఫ్ చౌదరి అబ్ధుల్లా అల్ మూమున్ లను అరెస్ట్ చేశారు. మూమూన్ ను ప్రస్తుతం ట్రిబ్యూనల్ ముందు ప్రవేశపెట్టారు.
మరణ శిక్ష కోరిన ప్రాసిక్యూటర్లు..
నిందితులకు మరణశిక్ష విధించాలని ప్రాసిక్యూటర్లు కోరారు. ఐరాస నివేదిక ప్రకారం.. జూలై 15 నుంచి ఆగష్టు 15 మధ్య జూలై తిరుగుబాటు సమయంలో ఆమె ప్రభుత్వం భద్రతా చర్యలకు ఆదేశించడంతో 1400 మంది వరకూ మరణించారు. హసీనా, కమల్ లను పరారీలో ఉన్న నిందితులుగా ప్రకటించారు.
అయితే మూవూన్ మొదట్లో స్వయంగా విచారణను ఎదుర్కొన్నారు. ఆపై ఆయన అప్రూవర్ గా మారారు. నిరసనల సమయంలో జరిగిన దారుణాలకు హసీనా సూత్రధారి, ప్రధాని రూపశిల్పి అని చీఫ్ ప్రాసిక్యూటర్ మొహ్మద్ తాజుల్ ఇస్లాం అభివర్ణించారు.
విచారణలో ఏం జరిగింది..
ట్రిబ్యూనల్ 28 పనిదినాలలో వీటిని విచారించింది. అక్టోబర్ 23న తన విచారణను ముగించింది. ఈ సమయంలో 54 మంది సాక్షులు ఆగష్టు 5, 2024న హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేసింది. బంగ్లాదేశ్ లో అశాంతి తీవ్రమవుతున్నా నేపథ్యంలో హసీనా అదే రోజు బంగ్లాదేశ్ నుంచి పారిపోయి భారత్ కు వచ్చారు. దీనిపై భారత్ ఇంకా స్పందించలేదు.
భద్రతను కట్టుదిట్టం..
తీర్పు వెలువడే ముందు దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢాకా మెట్రోపాలిటన్ పోలీస్ కమిషనర్ షేక్ ఎండీ సజ్జత్ అలీ ఆదివారం సాయంత్రం కాల్పులు, పేలుళ్లు లేదా పోలీసులు పౌరులను హాని కలిగించే ప్రయత్నాలలో పాల్గొన్న వారిపై కనిపించగానే కాల్చివేయాలనే ఆదేశాలు జారీ చేశారు.
తీర్పు కు ముందు అవామీ లీగ్ రెండు రోజుల బంద్ కు పిలుపునిచ్చింది. రాజధానిలో హింస జరుగుతుందనే నేపథ్యంలో వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. రాజధానిలో అనేక చోట్ల ఆర్మీ దళాలు, బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ సిబ్బందిని మోహరించారు.
ఖండించిన హసీనా..
తీర్పు వెలువడానికి రెండు రోజుల ముందు తన మద్దతుదారులకు పంపిన ఆడియో సందేశంలో హసీనా మాట్లాడారు.  తాత్కాలిక అధ్యక్షుడు యూనస్ తన పార్టీని నాశనం చేయడానికి ప్రయత్నిస్తోందని అవామీ లీగ్ నాయకురాలు ఆరోపించారు. ‘‘ఇది అంత సులభం కాదు, అవామీ లీగ్ కొంతమంది అధికారాన్ని దోచుకున్న వారి జేబు నుంచి కాదు, అట్టడుగు వర్గాల నుంచి వచ్చింది’’ అని బెంగాలీ లో చెప్పారు.
ప్రశంసలు..
బంగ్లాదేశ్ అంతటా నిరసన ప్రణాళికలలో చేరినందుకు హసీనా తన మద్దతుదారులను కూడా ప్రశంసించారు. ‘‘వారు మాకు విశ్వాసం ఇచ్చారు’’ అని ఆమె అన్నారు. ఈ అవినీతిపరుడు, ఉగ్రవాది, హంతకుడు యూనస్ అతని సహయకులను బంగ్లాదేశ్ ఎలా మారగలదో ప్రజలు చూపిస్తారు. ప్రజలు న్యాయం వైపే ఉంటారని అన్నారు.
అంతర్జాతీయ మీడియా, భారతీయ పత్రికలకు ఇచ్చిన మీడియా సమావేశంలో హసీనా మాట్లాడారు. తన రాజకీయ ప్రత్యర్థులతో జట్టుకట్టిన కంగారు కోర్టుగా అభివర్ణించారు.
హేగ్ లోని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు పర్యవేక్షణలో విచారణకు తాను సిద్ధంగా ఉన్నానని, నిష్పాక్షిక ట్రిబ్యూనల్ తనను నిర్ధోశిగా విడుదల చేస్తుందని యూనస్ అలాంటి ప్రక్రియను తప్పించుకున్నారని ఆరోపించారు.
1971 లో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో పాకిస్తాన్ దళాలకు సహకరించిన వారిని విచారించడానికి ఐసీటీ- బీడీ మొదట స్థాపించారు. తరువాత యూనస్ పరిపాలన హసీనాతో సహ నాయకులును విచారించడానికి సవరణలు చేశారు. చాలామంది సీనియర్ అవామీ లీగ్ నాయకులు జైలులో ఉన్నారు. కొంతమంది పరారీలో ఉన్నారు.
Tags:    

Similar News