మిస్ ఫైర్ తో బర్త్ డేనే డెత్ డే, విషాదంగా ముగిసిన తెలంగాణ విద్యార్థి..

ఉన్నత విద్య అభ్యసించాలని లక్ష్యంతో యూఎస్ చేరుకున్న విద్యార్థి జీవితం గన్ ల ఉన్న మోజు ప్రాణం తీసింది. బాధితుడు చనిపోయిన రోజు అతడి పుట్టినరోజు కావడం..

Update: 2024-11-22 11:44 GMT

అమెరికాలో జార్జియాలో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న తెలంగాణ విద్యార్థి జీవితం విషాదంగా ముగిసింది. తను కొనుగోలు చేసిన హంటింగ్ గన్ ను క్లీన్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ పేలడంతో విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ రోజు విద్యార్థి బర్త్ డే కావడంతో తీవ్ర విషాదం నెలకొంది.

వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ లోని ఉప్పల్ కు చెందిన ఆర్యన్ రెడ్డి యూఎస్ లో ఎమ్మెస్ చేయడానికి వెళ్లాడు. మీడియా నివేదికల ప్రకారం, ఆర్యన్ యుఎస్‌లో హంటింగ్ గన్ లైసెన్స్ పొందాడు. దానిని శుభ్రం చేయడానికి ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తు మిస్ ఫైర్ అయింది. బుల్లెట్ నేరుగా ఛాతికి తాకినట్లు అధికారులు తెలిపారు. ఈ సంఘటన నవంబర్ 13న జరిగింది. 
తుఫాకీ పేలిన చప్పుడు తో పక్క రూమ్ లో ఉన్న తోటి విద్యార్థులు వచ్చిన ఆర్యన్ కు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు చెప్పారు. ఆర్యన్ తండ్రి సుదర్శన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
విదేశాలలో చదువుతున్న తమ పిల్లలు గన్ లైసెన్స్ పొందడం పట్ల ఇతర తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని కోరారు. “విద్యార్థులు అక్కడ హంటింగ్ గన్ లైసెన్స్‌లు పొందవచ్చని మాకు తెలియదు. ఇలాంటి విషాదాన్ని ఏ తల్లిదండ్రులు ఎదుర్కోకూడదు, ” అని జాతీయ మీడియాతో పేర్కొన్నారు.
ముఖ్యంగా, భారతీయ విద్యార్థులలో దాదాపు 56 శాతం మంది ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణల నుంచే ఉన్నారు. హైదరాబాద్‌లోని యుఎస్ కాన్సులర్ చీఫ్ రెబెకా డ్రేమ్, కాన్సులేట్ 2024 వేసవి సీజన్‌లో 47,000 స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూలను నిర్వహించిందని వెల్లడించారు.
2023లో 35,000 లు గా ఉన్న సంఖ్య ఏడాది తిరిగే సరికి మరో పదివేల మంది విద్యార్థులు పెరిగారు. భారత్ నుంచి ఈ సంవత్సరం 3.3 లక్షల విద్యార్థులకు స్టడీ వీసాలు మంజూరు చేశామని యూఎస్ కాన్సులేట్ అధికారులు తెలిపారు.
Tags:    

Similar News