ఇరాన్- ఇజ్రాయెల్ ఘర్షణ వలన పెరగనున్న ముడి చమురు ధర

పర్షియన్ గల్ఫ్ ఇరాన్ ఆధీనంలో ఉండటమే కారణం;

Update: 2025-06-14 08:19 GMT

పశ్చిమాసియాలో మరోసారి సైనిక ఘర్షణలు జరుగుతుండటంతో ప్రపంచ ఇంధన వనరులపై ఈ ప్రభావం కనిపించబోతోంది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే క్రూడ్ ఆయిల్ చాలా భాగం పర్షియన్ గల్ప్ గుండా నే వెళ్తుంది.

ఈ మార్గం ఇరాన్ ఆధీనంలో ఉండటంతో ఇక ముందు ఈ ప్రాంతం నుంచి సరఫరా అయ్యే చమురు సరఫరాకు ఆటంకం కలుగుతుంది. ఈ ప్రభావం వలన ప్రపంచ వ్యాప్తంగా ఇంధన ధరలు పెరగడం, తద్వారా ఆయిల్ దిగుమతి చేసుకునే దేశాల్లో ద్రవ్యోల్భణం పెరుగుతుంది.

ఇప్పటికే క్రూడ్ లో పెట్టుబడులు అన్ని డాలర్, బంగారం వైపు మళ్లుతున్నాయి. కోవిడ్ ప్రభావం తరువాత అమెరికాలో ద్రవ్యోల్భణం వలన సగటు అమెరికన్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ట్రంప్ రాకతో ప్రారంభమైన వాణిజ్య యుద్ధం వలన అవి ఎక్కువయ్యాయి. ఇప్పుడు పశ్చిమాసియాలో పెరుగుతున్న సైనిక ఉద్రిక్తతల వలన ప్రపంచవ్యాప్తంగా మరోసారి నిత్యావసరాల ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది.
రష్యా- ఉక్రెయిన్ యుద్ధం..
ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర చేసి మూడు సంవత్సరాలు అవుతోంది. అప్పుడు ఆయిల్ ధరలపై ప్రభావం చూపింది. ముఖ్యంగా యూరప్ అల్లాడిపోయింది. ఇప్పుడు ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య మరోసారి సైనిక ఘర్షణలు ప్రారంభం కావడంతో క్రూడ్ ఆయిల్ సరఫరాకు ఆటంకం ఏర్పడి వాటి ధర ఆకాశాన్ని అంటే ప్రమాదం ఉంది. అలాగే కొన్నాళ్లుగా తగ్గుముఖం పట్టిన గ్యాస్ ధరలపై కూడా వాటి ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్న మాట.
ఇరాన్ ప్రధాన ఉత్పత్తిదారుల్లో ఒకటి..
ఇరాన్ ప్రపంచంలోని ప్రధాన చమురు ఉత్పత్తిదారుల్లో ఒకటి. అయితే పాశ్చాత్య దేశాల ఆంక్షలు దాని అమ్మకాలను పరిమితం చేశాయి. యుద్ధం తీవ్రత పెరిగితే ఇరాన్ తన చమురు ఉత్పత్తిని నిలిపివేస్తుంది.
ఇదే జరిగితే ప్రపంచానికి క్రూడ్ ఆయిల్ సంక్షోభం తలెత్తి వర్థమాన దేశాల అభివృద్దికి ఇది గొడ్డలి పెట్టు అవుతుంది. డిమాండ్ కు తగ్గ ఉత్పత్తి లేకపోతే సరఫరా వ్యవస్థలో లోటు ఏర్పడటం దీనికి ప్రధాన కారణం. ఈ చర్య వల్ల భారత్, చైనా సహ అనేక ఆఫ్రికా దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటాయి.
‘‘ఎగుమతులకి అడ్డంకులు ఏర్పడటం వలన నాల్గవ త్రైమాసికంలో అంచనా వేసిన మిగులు తుడిచిపెట్టుకుపోతోంది’’ అని ఐఎన్జీ విశ్లేషకులు ఓ నోట్ లో పేర్కొన్నారు.
ఉత్పత్తి పెంచాలనుకున్న తరుణంలోనే..
ఈ నెల ప్రారంభంలో సమావేశమైన ఒపెక్ ప్లస్ దేశాలు మళ్లీ ఉత్పత్తిని పెంచాలని నిర్ణయించుకున్నాయి. ఇది తరుచుగా ముడి చమురు ధరలను నిర్ణయిస్తుంది. మే ప్రారంభంలో ముడి చమురు ధర నాలుగు సంవత్సరాల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం గ్యాస్ ధరలు చౌకగా లభిస్తున్నాయి.
ఆటో క్లబ్ సంస్థ ఏఏఏ ప్రకారం శుక్రవారం యూఎస్ లో ఒక గ్యాలన్ సగటు ధర 3.13 డాలర్లుగా ఉంది. ఇది ఒక సంవత్సరం క్రితం దర 3.46 డాలర్లతో పోలిస్తే తక్కువ.
ఘర్షణలకు తోడు షిప్పింగ్ ఖర్చులు తరుచుగా పెరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కీలకమైన చమురు మార్గంలో హౌతీలు దాడులకు తెగబడటం వలన నౌకలు తమ ప్రయాణ మార్గాన్ని మార్చుకున్నాయి.
అలాగే ట్రంప్ విధించిన టారిఫ్ ధరల వల్ల కూడా చాలా దేశాలు వస్తువులను భారీ స్థాయిలో దిగుమతి చేసుకోవడానికి ప్రయత్నించాయి. ఈ పరిణామం వలన కూడా ధరలు పెరిగాయి.
పెరిగిన షిప్పింగ్ షేర్లు ..
ఇజ్రాయెల్ చేసిన దాడుల వలన ఫ్రంట్ లైన్ వంటి షిప్పింగ్ కంపెనీల షేర్లు పెరిగాయి. ఎందుకంటే దాదాపు ప్రతి చమురు కంపెనీ షిప్పింగ్ ద్వారానే క్రూడ్ ఆయిల్ సప్లై చేస్తాయి.
అలాగే వినియోగ వస్తువులను సప్లై షిప్పింగ్ కంపెనీలు కూడా ఉద్రిక్తతలు, డిమాండ్ పెరిగిన నేపథ్యంలో తమ ధరలను పెంచాయి. ఇందులో కొన్ని కంపెనీలు సుంకాలు పెరగడం వలన రేట్లు పెంచుతున్నట్లు ప్రకటించాయి. వాల్మార్ట్ లాంటి కంపెనీలు పాఠశాలలు ప్రారంభం అవుతున్న సందర్భంలో డిమాండ్ కు తగ్గ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించాయి.
‘ఫెడ్’ ఏం చేయబోతోంది
ఫెడరల్ రిజర్వ్ అధికారులు వడ్డీరేట్ల విషయంలో నిర్ణయం తీసుకోవడానికి వచ్చే వారం సమావేశం అవుతారు. విశ్లేషకుల అంచనాల ప్రకారం.. యూస్ సెంట్రల్ బ్యాంకు తన బెంచ్ మార్క్ రేటును వరుసగా నాలుగోసారి స్థిరంగా నిలుపుతుంది.
ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి కార్మిక మార్కెట్ కు మద్దతు ఇవ్వడానికి ఈ చర్య అవసరమని వాదిస్తున్నారు.
ప్రస్తుతం ఇజ్రాయెల్- ఇరాన్ వివాదం కారణంగా గ్యాస్, ఆహారం, ఇతర ముఖ్యమైన వస్తువుల ధరలు పెరిగితే ఫెడ్ అనుకున్న రిజర్వ్ సాధించడం కష్టతరమవుతుంది.
ధరలు పెరిగితే ఫెడ్ అధికారులు దాని బెంచ్ మార్క్ రేటును పెంచడానికి మొగ్గు చూపవచ్చు. ఇది వ్యాపారాలు, వినియోగదారులు ఖర్చును పెంచుతుంది. అలాగే టెక్ రంగంలోనూ సంక్షోభాన్ని తీసుకువస్తుందని అంచనాలు ఉన్నాయి.
శుక్రవారం టెక్ కంపెనీల రిటైలర్ల షేర్లు అతి పెద్ద క్షీణతను నమోదు చేశాయి. సుంకాలు భారీగా పెరినందుకు సగటు అమెరికన్లు తమ ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా వేకేషన్ ట్రిప్పులను రద్దు చేసుకుంటున్నారు. ఇది విమానయాన సంస్థలపై ప్రభావం చూపుతోంది. 


Tags:    

Similar News