ఇజ్రాయెల్ మెరుపుదాడులు.. హమాస్ చీఫ్, హెజ్ బుల్లా కమాండర్ హతం..

ఒకడు 241 మంది అమెరికన్ సైనికులతో పాటు, 12 మంది చిన్న పిల్లలపై రాకెట్ దాడులకు పాల్పడి హత్య చేశాడు. మరొకడు 1200 మంది అమాయకులను హత్య చేేసి, 250 మంది యూదులను బందీ..

Update: 2024-07-31 05:19 GMT

పశ్చిమాసియాలోని ఉగ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా విసిరింది. అక్టోబర్ 7 నాటి దాడుల్లో 12 వందల మంది అమాయక ఇజ్రాయెల్ ను పాశవికంగా హత్య చేసి, 250 మంది పౌరులను కిడ్నాప్ చేసి శిఖండి యుద్ధం చేస్తున్న హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనీ ను ఇరాన్ లో కోవర్ట్ ఆపరేషన్ తో అంతమొందించింది.

ఇరాన్ రాజధాని టెహ్రన్ లో ఆ దేశ నూతన అధ్యక్షుడు ప్రమాణ స్వీకారానికి హజరై తిరిగి వచ్చిన అనంతరం ఆయన దాడికి గురైయ్యారు. ఇందులో ఆయన బాడీ గార్డ్ సైతం మృతి చెందాడు. ఈ విషయాన్ని ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఆధీనంలో ఉన్న హమాస్ చీఫ్ హత్య కు గురికావడంతో ఆ దేశంలో తీవ్రకలకలం చెలరేగింది.
అలాగే ఇజ్రాయెల్ లోని గోలెన్ హైట్స్ లో రాకెట్ దాడులకు పాల్పడి 12 మంది చిన్నారుల మృతికి కారణమైన ఉగ్రవాద సంస్థ హిజ్భుల్లా కమాండర్ ను మిస్సైల్ దాడిలో హతమారినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది. ఈ దాడిలో మరో ముగ్గురు వ్యక్తులు మరణించారు. అయితే దీనిపై హిజ్బుల్లా ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు.
టార్గెట్ ఫౌద్ షుకూర్
శనివారం గోలన్ హైట్స్ ప్రాంతంలో ఫుట్ బాల్ ఆడుకుంటున్న చిన్న పిల్లలపై హిజ్భుల్లా రాకెట్ దాడులకు పాల్పడింది. ఇందులో 12 మంది చిన్నారులు మృతి చెందారు. ఈ దాడికి నేతృత్వం వహించింది కమాండర్ ఫౌద్ షుకుర్. కరుడగట్టిన ఉగ్రవాదిగా పేరుగాంచిన షుకుర్ 1983 లో లెబనాన్ రాజధాని బాంబుదాడులకు పాల్పడి 241 మంది అమెరికన్ సైనికులను చంపాడు. ఇతని తలపై అమెరికా 5 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించింది. ఇప్పటి వరకూ అతని జాడ అమెరికా పసిగట్టేలేకపోయింది.
ఇజ్రాయెల్ వాదన నిజమని రుజువైతే, 2016 నుంచి చంపబడిన అత్యంత సీనియర్ హిజ్బుల్లా కమాండర్ షుకూరే. సిరియాలోని గ్రూప్ మిలిటరీ కమాండర్ ముస్తఫా బద్రెద్దీన్ సిరియా రాజధాని డమాస్కస్‌లో పేలుడులో మరణించాడు. ఈ పేలుళ్లకు కారణం ఇజ్రాయెల్ అని అనుమానాలున్నాయి.
ఇజ్రాయెల్ మిలిటరీ వాదన
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం చెలరేగిన తరువాత, అక్టోబర్ 8 నుంచి ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా దాడులకు షుకూర్ నేతృత్వం వహిస్తున్నాడని, అనేక సంవత్సరాలుగా యూదు పౌరులు, విదేశీ పౌరులను హత్య చేయడంలో పాల్గొన్నాడని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. గైడెడ్ క్షిపణులు, క్రూయిజ్ క్షిపణులు, నౌకా నిరోధక క్షిపణులు, సుదూర శ్రేణి రాకెట్లు, UAVలతో సహా హిజ్బుల్లా అత్యంత ఆధునాతన ఆయుధాలలో ప్రయోగంలో ఎక్కువ భాగం షుకూర్‌దేనని పేర్కొంది.
ఎవరూ ఫౌద్ షుకూర్  ?
రహస్యంగా సంచరించే షుకూర్ ఇజ్రాయెల్‌తో సరిహద్దు వెంబడి దక్షిణ లెబనాన్‌లో హిజ్బుల్లా దళాలకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్నాడు. అతని వయస్సు 62 సంవత్సరాలు. షుకుర్ 2008లో డమాస్కస్‌లో కారు బాంబుతో హత్యకు గురైన హిజ్బుల్లా టాప్ మిలిటరీ చీఫ్ ఇమాద్ ముగ్నియెహ్‌కు సన్నిహిత సహాయకుడు.
షుకూర్ అప్పటి నుంచి హిజ్బుల్లా నాయకుడు హసన్ నస్రల్లాకు సన్నిహిత సైనిక సలహాదారుగా ఉన్నారు. ఇతడిని సయ్యద్ మొహసేన్ అని మరో పేరుతో కూడా పిలుస్తారు. 1982లో లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేయడంతో పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ లెబనాన్‌ను విడిచిపెట్టవలసి వచ్చినప్పుడు వెంటనే హిజ్బుల్లాహ్‌లో చేరాడు.
సిరియా వివాదంలో పాత్ర
చాలా మంది హిజ్బుల్లా సైనిక అధికారుల మాదిరిగానే, 2011లో జరిగిన సిరియా సంఘర్షణలో షుకూర్ కీలక పాత్ర పోషించాడు. దీనిలో ఇరాన్-మద్దతుగల హిజ్బుల్లా వేలాది మంది అనుచరులను అధ్యక్షుడు బషర్ అస్సాద్ సిరియన్ దళాలలో చేరడానికి పంపాడు.
అక్టోబరు 7న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైన తర్వాత, ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా జరిపిన అనేక డ్రోన్, క్షిపణి దాడుల వెనుక షుకూర్‌ని ఇజ్రాయెల్ ఆరోపించింది. శనివారం రక్తపాతానికి ముందు, దాని దాడుల వల్ల ఇజ్రాయెల్‌లో 13 మంది పౌరులు, 22 మంది సైనికులను మరణించారు. లెబనాన్‌లో. ఇజ్రాయెల్ దాడుల్లో 90 మంది పౌరులతో సహా 500 మందికి పైగా మరణించారు.
హిజ్బుల్లా తిరస్కరణ
మజ్దల్ షామ్స్ పట్టణంలో శనివారం జరిగిన రాకెట్ దాడిలో 12 మంది చిన్నపిల్లల మృతికి తాము కారణం కాదని హిజ్బుల్లా ప్రకటించింది. అయితే టెల్ అవీవ్ మాత్రం దీనిని నమ్మడం లేదు. ఉగ్రవాద సంస్థ రెడ్ లైన్ దాటిందని రక్షణమంత్రి యోవ్ గల్లట్ సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు. గాజా యుద్ధం పది నెలలుగా సాగుతోంది. ఇది ఇప్పుడు చర్చల దిశగా సాగుతోంది. ఈ నేపథ్యంలో జరిగిన దాడుల్లో పశ్చిమాసియాలో ఏం జరుగుతుందో అన్న భయం నెలకొంది.
బీరుట్‌ దాడుల్లో 74 మందికి గాయాలు..
లెబనాన్ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం బీరుట్‌లోని దక్షిణ శివారులో జరిగిన మెరుపుదాడిలో 74 మంది గాయపడ్డారని, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని ప్రకటించింది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. పేలుడు జరిగిన ప్రదేశానికి సమీపంలోని బహ్మాన్ హాస్పిటల్ రక్తదానం చేయాలని స్థానికులకు పిలుపునిచ్చింది.
"ఇజ్రాయెల్ శత్రువు పూర్తిగా పౌర ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకోవడం ద్వారా తెలివితక్కువ చర్యకు పాల్పడ్డాడు" అని హిజ్బుల్లా అధికారి అలీ అమ్మర్ అల్-మనార్ టీవీకి చెప్పారు. "ఇజ్రాయెల్ శత్రువు త్వరలో దీనికి మూల్యం చెల్లిస్తారు." ఆయన హెచ్చరించారు.
ఆసుపత్రి దగ్గర దాడులు
లెబనీస్ తాత్కాలిక ప్రధాన మంత్రి నజీబ్ మికాటి ఇజ్రాయెల్ దాడిని ఖండించారు, ఇది రాజధానిలోని అతిపెద్ద ఆసుపత్రులలో ఒకదాని నుంచి కొన్ని మీటర్లను దూరంలో జరిగిందని చెప్పారు. దాడి జరిగిన ప్రదేశంలోని క్షతగాత్రులను పరిశీలించడానికి వచ్చిన కొంతమంది పౌరులు ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా, ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లాకు అనుకూలంగా నినాదాలు చేశారు.
Tags:    

Similar News