అమెరికా- ఇరాన్ మధ్య చర్చల్లో పురోగతి

అణు ఒప్పందం విషయంలో మాస్కో కీలక పాత్ర పోషించే అవకాశం;

Translated by :  Chepyala Praveen
Update: 2025-04-20 10:06 GMT

ఇరాన్ - అమెరికా మధ్య జరుగుతున్న శాంతిచర్యల్లో కీలక పురోగతి సాధించినట్లు రెండు దేశాలు ప్రకటించాయి. టెహ్రన్ చేస్తున్న కీలక అణు కార్యక్రమంపై వచ్చే వారం మళ్లీ సమావేశం కావాలని ఇరాన్ - యూఎస్ఏ నిర్ణయించాయి.

అణు ఒప్పందం పై ఒక సమగ్ర చట్టాన్ని రూపొందించడానికి రెండు దేశాలు అంగీకరించాయని ఇరాన్ విదేశాంగమంత్రి అబ్బాస్ అరఘ్చీ తెలిపారు. ఏప్రిల్ 26న ఒమన్ లో మళ్లీ సమావేశమయ్యే ముందు సాధ్యమయ్యే ఒప్పందం వివరాలను చర్చిస్తారని ఆయన అన్నారు.

రోమ్ లో చర్చల సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక రాయబారీ స్టీవ్ విట్ కాఫ్, అరాఘ్చీ ముఖాముఖీ మాట్లాడుకున్నారని ఒక అమెరికా అధికారి ధృవీకరించారు.
రెండు వైపులా సానుకూల ప్రకటన..
‘‘మా ప్రత్యక్ష, పరోక్ష చర్చలలో ఇరుపక్షాలు చాలా మంచి పురోగతి సాధించాము’’ అని ట్రంప్ పరిపాలనలోని ఒక సీనియర్ అధికారి తెలిపారు. ఆయన ప్రైవేట్ దౌత్య సమావేశం గురించి వివరించారు. అయితే ఆయన పేరు వెల్లడించడానికి ఇష్టపడలేదు.
‘‘చర్చలు నిర్మాణాత్మక వాతావరణంలో జరిగాయి, అది ముందుకు సాగుతుందని నేను చెప్పగలను. సాంకేతిక చర్చల తరువాత మనం మెరుగైన స్థితిలో ఉంటామని నేను ఆశిస్తున్నాను’’ అని అరాఘ్ఛి ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ తో అన్నారు. ‘‘ఈ సారి మేము ఒక రకమైన సూత్రాలు, లక్ష్యాల గురించి మంచి అవగాహానతో లక్ష్యాన్ని చేరుకోవడంలో విజయం సాధించాము’’ అని ఆయన అన్నారు.
అసంభవం కూడా సాధ్యమే
ప్రత్యక్ష, పరోక్ష చర్చలు జరిగాయని అమెరికా చెప్పినప్పటికీ, ఇరాన్ అధికారులు వాటిని పరోక్షంగా మాత్రమే బయటకు చెప్పారు. గత వారాంతంలో ఒమన్ లోని మస్కట్ లో ఆదేశ విదేశాంగమంత్రి బదర్ అల్ బుసైదీ వేర్వేరు గదుల్లో వారి మధ్య సంభాషించారు. ‘‘ఈ చర్చలు ఊపందుకుంటున్నాయి. ఇప్పుడు అసంభవం కూడా సాధ్యమే’’ అని అల్ బుసైదీ ఎక్స్ లో అన్నారు.
ఇరాన్ అణ్వాయుధాలు, ఆంక్షల నుంచి పూర్తిగా విముక్తి పొందిందని,శాంతియుత అణుశక్తిని అభివృద్ది చేసే సామర్థ్యాన్ని కొనసాగించగలదని నిర్ధారించే ఒప్పందాన్ని కోరుతూ చర్చలు కొనసాగించడానికి ఒమన్ విదేశాంగమంత్రిత్వ శాఖ ఒక ప్రత్యేక పోస్ట్ లో అంగీకరించిందని తెలిపింది.
ఒక చారిత్రాత్మక క్షణం..
1979 ఇస్లామిక్ విప్లవం, యూఎస్ ఎంబసీ సిబ్బందిని బందీలుగా చేయడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అంతకుముందు ఒబామా హయాంలో కుదిరిన మధ్య అణు ఒప్పందాన్ని 2018 లో ట్రంప్ ఏకపక్షంగా రద్దు చేశారు.
టెహ్రాన్ తనకు ఇచ్చిన మినహయింపును దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు. దేశంపై ఉన్న ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయడానికి బదులుగా యురేనియం శుద్ది ప్రక్రియను నిలిపివేయడానికి చర్చలు ప్రారంభిస్తున్నామని వాషింగ్టన్ ప్రకటించింది.
ఇరాన్ అణుకేంద్రాలపై అమెరికా, ఇజ్రాయెల్ సైనికదాడి జరిగే ప్రమాదం ఉంది. ఇరానియన్లు అణ్వాయుధాన్ని తయారు చేస్తామని బెదిరింపులు సైతం ప్రచారంలో ఉన్నాయి.
మధ్య ఆసియాలో ఉద్రిక్తతలు..
గాజాలో ఇజ్రాయెల్ - హమాస్ యుద్దం కారణంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగాయి. యెమెన్ లోని ఇరాన్ మద్దతుగల హౌతీ తిరుగుబాటుదారులను లక్ష్యంగా చేసుకుని అమెరికా వైమానిక దాడుల్లో 70 మందికి పైగా మరణించారు. డజన్ల కొద్దీ ప్రజలు గాయపడ్డారు.
‘‘ఇరాన్ అణ్వాయుధాన్ని ఆపడానికి నేను సిద్ధంగా ఉన్నాను.’’ అని ట్రంప్ శుక్రవారం అన్నారు. ‘‘ఇరాన్ గొప్పగా, సంపన్నంగా, అద్బుతంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను’’ అని ఆయన అన్నారు. ఇరాన్ లో చర్చలు ప్రారంభమయ్యే ముందు విట్కాఫ్ రోమ్ లో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ అధిపతి రాఫెల్ మరియానో గ్రాస్సీని కలిశారని తెలుస్తోంది.
రష్యా పాత్ర పోషించవచ్చు..
కొన్ని రోజుల క్రితం అరాఘ్ఛీ మాస్కోను సందర్శించారు. అక్కడ ఆయన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహ ఇతర అధికారులతో సమావేశమయ్యారు.
టెహ్రాన్ 2015 అణు ఒప్పందంలో పాల్గొన్న ప్రపంచ శక్తులలో ఒకటైన రష్యా, భవిష్యత్ లో టెహ్రాన్- వాషింగ్టన్ మధ్య కుదిరిన ఏదైన ఒప్పందంలో కీలక భాగస్వామి కావచ్చు.
ఇరాన్ దగ్గర 60 శాతం స్వచ్ఛమైన యురేనియం ఉంది. దీనిని మాస్కో స్వాధీనం చేసుకోవచ్చని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇది 90 శాతం ఆయుధ గ్రేడ్ స్థాయిలకు సాంకేతిక అడుగు దూరంలో ఉంది. గతవారం ఒమన్ రాజధాని మస్కట్ లో అరఘ్ఛి- విట్కాఫ్ మధ్య మొదటి రౌండ్ చర్చలను నిర్వహించింది. పరోక్ష చర్చల తరువాత ఇద్దరు వ్యక్తులు ముఖాముఖిగా కలుసుకున్నారు.
ఇరాన్ కు కష్టకాలం..
ఇరాన్ సుప్రీంలీడర్ అయతుల్లా ఖమేనీ సలహదారుడు అలీ షంఖానీ చర్చలకు ముందు ఎక్స్ లో ఇలా రాసుకొచ్చారు. ఇరాన్... లిబియా లాగా తన సుసంపన్న కార్యక్రమాన్ని వదులుకోవడానికి అంగీకరించదు. ‘‘ఇరాన్ లొంగిపోవడానికి కాదు, సమతుల్య ఒప్పందం కోసం వచ్చింది’’ అని ఆయన రాశారు.
ఇరాన్ లో ఇంక హిజాబ్ లేదా హెడ్ వర్క్స్ పై రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి. టెహ్రన్ వీధుల్లో మహిళలు ఇప్పటికీ చట్టాన్ని విస్మరిస్తున్నారు. దేశంలో సబ్సిడీ పెట్రోల్ ధరను ప్రభుత్వం పెంచే అవకాశం ఉందని ఫుకార్లు కూడా కొనసాగుతున్నాయి.
ఇది గతంలో దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది. ఈ నెల ప్రారంభంలో ఇరాన్ రియాల్ కరెన్సీ యూఎస్ డాలర్ తో పొలిస్తే 1 మిలియన్ డాలర్లకు పైగా పడిపోయింది.
Tags:    

Similar News