400 డ్రోన్లు, 40 క్షిపణులతో ఉక్రెయిన్ పై రష్యా దాడి
ఆపరేషన్ ఆపరేషన్ స్పైడర్ వెబ్ కు ప్రతీకారంగా దాడులు చేస్తున్న క్రిమ్లిన్;
By : The Federal
Update: 2025-06-07 05:32 GMT
రష్యా, ఉక్రెయిన్ పై భారీ ప్రతీకార దాడికి దిగింది. జూన్ 1న కీవ్, మాస్కో పై ఆపరేషన్ స్పైడర్ వెబ్ పేరుతో భారీ స్థాయిలో డ్రోన్లతో దాడికి దిగింది. ఈ దాడిలో క్రిమ్లిన్ కు చెందిన చాలా ఎయిర్ బేస్ లు తీవ్రంగా నష్టపోయాయి. దాదాపు 40 బాంబర్ ఫైటర్ జెట్లు ఈ దాడిలో నష్టపోయింది.
ఈ రోజు ఉదయం రష్యా, ఉక్రెయిన్ పై 400 కి పైగా డ్రోన్ లు, 40 క్షిపణులను ప్రయోగించింది. భారీ స్థాయిలో నష్టం కలుగజేసింది. ‘‘ఈ రోజు ఉదయం మా దేశంలోని వివిధ ప్రాంతాలు, నగరాల్లో రెస్క్యూ, అత్యవసర కార్యకలాపాలు రోజంతా కొనసాగుతాయి.
రష్యన్లు 400 కి పైగా డ్రోన్లు, 40 కి పైగా క్షిపణులను ప్రయోగించారు. 80 మంది గాయపడ్డారు. కొంతమంది శిథిలాల కింద ఉండవచ్చు’’ అని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ ఎక్స్ లో పోస్టు చేశారు.
‘‘దురదృష్టవశాత్తూ ప్రపంచంలోని కొంతమంది ఇటువంటి దాడులను ఖండించరు. పుతిన్ దీనిని సరిగానే ఉపయోగించుకుంటున్నాడు. యుద్దం కొనసాగించడానికి అతను తనకు తానుగా సమయం కేటాయిస్తున్నాడు’’ అని జెలెన్ స్కీ తన పోస్ట్ లో రాసుకొచ్చారు.
ఎంతమంది మరణించారు..
రష్యా దాడిలో కనీసం ఆరుగురు మరణించి ఉంటారని ఉక్రెయిన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ తెలిపింది. ఇందులో కీవ్ లో ముగ్గురు అగ్నిమాపక సిబ్బంది, లూట్స్ లో ఇద్దరు పౌరులు, చెర్నిహివ్ లో ఒక పౌరుడు ఉన్నాడని వెల్లడించింది.
దాదాపు మూడు సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ యుద్ధంలో రష్యా, ఉక్రెయిన్ పై చేసిన అతిపెద్ద దాడికి నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ దాడిలో మొత్తం ఉక్రెయిన్ ను లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగాయి.
తొమ్మిది ప్రధాన ప్రాంతాలు దాడుల వల్ల చాలా ఎక్కువగా ప్రభావితం అయ్యాయి. ప్రపంచ ఐక్యతలో చీలికలు రావడానికి రష్యన్లు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.
‘‘మనం మన ముందున్న పనిని స్పష్టంగా చూడలి. దౌత్యం పనిచేయాలి. భద్రతా హమీలు కల్పించాలి. శాంతిని నెలకొల్పాలి. దానికోసం ముఖ్యంగా కాల్పుల విరమణ ప్రారంభ చర్చలు అవసరం. అది జరిగేలా చేయడానికి, దాడులను ఆపడానికి రష్యాపై ఒత్తిడి తీసుకురావాలి’’ అని ఉక్రెయిన్ అధ్యక్షుడు అన్నారు.
కీవ్ ఉగ్రవాద చర్యలకు ప్రతిస్పందన..
రష్యా రక్షణమంత్రిత్వ శాఖ ప్రతినిధి మాట్లాడుతూ.. కీవ్ ఉగ్రవాద చర్యలు అని పిలిచే ఆపరేషన్ స్పైడర్ వెబ్ కు ప్రతిస్పందనగా ఈ దాడులు చేసినట్లు చెప్పారు. ఇది రష్యా వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణి వాహకనౌక ఆ దాడులు చేపట్టి శత్రువును నాశనం చేసిందని చెప్పారు.