అమెరికాలో ఘోర ప్రమాదం.. విమానాన్ని ఢీ కొట్టిన ఆర్మీ హెలికాప్టర్

60 మంది మృతి, వైట్ హౌజ్ కు దగ్గరగా ప్రమాదం జరగడంతో అప్రమత్తమైన అధికారులు;

Update: 2025-01-30 11:14 GMT

యూఎస్ఏ లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. వాషింగ్టన్ సమీపంలోని రోనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవుతున్న విమానాన్ని, ఆర్మీ హెలికాప్టర్ ఢీ కొట్టింది. ఇందులో కనీసం 60 మంది చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. రెండు ఢీ కొనడం వల్ల పక్కన ఉన్న నదీలో కూలిపోయాయి. ఇప్పటి వరకూ ఈ ప్రమాదంలో 18 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆర్మీ హెలికాప్టర్ లో నలుగురు సిబ్బంది ఉన్నారని తేలింది.

‘‘ప్రమాదం తరువాత అత్యవసర సేవల ద్వారా కనీసం 18 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాం’’ అని సీబీఎస్ న్యూస్ కు ఓ పోలీస్ అధికారి తెలిపారు. ఎవరు ప్రాణాలతో దొరకలేదు. మాకు ఆ నమ్మకం కూడా లేదన్నారు. ఈ దుర్ఘటనపై కాన్సాస్ సెనేటర్ రోజర్ మార్షల్ మాట్లాడుతూ.. రెండు విమానాల్లో ఉన్న మొత్తం 67 మంది చనిపోయారని అనుకుంటున్నామన్నారు. హెలికాప్టర్ లోని ముగ్గురు సిబ్బందిలో ఎవరూ సీనియర్స్ ఆర్మీ అధికారులు లేరని అధికారులు తెలిపారు.
ప్రమాదం జరిగిన పోటోమాక్ నదీలో భారీ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. ఎయిర్ బోట్ లు విమానాశ్రయానికి ఉత్తరానా ఉన్న జార్జ్ వాషింగ్టన్ పార్ వే వెంబడి విమానాశ్రాయానికి సమీపంలో ఒక పాయింట్ నుంచి నదీలోకి ప్రవేశపెట్టారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఈ భయంకరమైన ప్రమాదం గురించి పూర్తిగా వివరించారు... వారి ఆత్మలకు శాంతి కలగాలని ఆయన ప్రార్థించినట్లు అధికారులు చెప్పారు.
ప్రమాదం ఎలా జరిగింది..
ప్రమాదం జరగడానికి గల కారణాలు ఇంతవరకూ తెలియరాలేదు. అయితే ఈ ప్రాంతంలో అన్ని టేకాఫ్ లు, ల్యాండింగ్ నిలిపివేశారు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం.. కాన్సాస్ లోని ఓ ప్రాంతం నుంచి ఓ ప్రయివేట్ జెట్ రన్ వే దగ్గరకు రావడంతో అదే సమయంలో మిలిటరీ బ్లాక్ హోల్ హెలికాప్టర్ ను ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది.
అమెరికా కాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఇది వైట్ హౌజ్ కు కేవలం మూడు మైళ్ల దూరంలోనే సంభవించింది. ఇక్కడ గగనతలానికి సంబంధించి అత్యంత కఠిన ఆంక్షలు, నిఘా ఉన్న ప్రదేశంలో జరగడంతో అంతా అప్రమత్తమయ్యారు.
ప్రమాదం జరగడానికి ముందు రెండు కూడా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ తో టచ్ లో ఉన్నారా? లేదా దర్యాప్తు చేస్తున్నారు. ప్యాసింజర్ జెట్ ఎందుకు ఎత్తు తగ్గిందని అనుమానపడుతున్నారు. అమెరికన్ ఎయిర్ లైన్స్ ప్లైట్ 5342 దాని రేడియో ట్రాన్స్ పాండర్ నుంచి వచ్చిన డేటా ప్రకారం పోటోమాక్ నదిపై జెట్ వేగంగా తన ఎత్తును కోల్పోయింది.
ప్రమాదం జరిగే సమయంలో అది 400 అడుగుల ఎత్తులో 140 మైళ్ల వేగంతో ఉన్నాయి. కెనడా లో నిర్మాణం అయిన బాంబార్డియర్ సీఆర్జే 701 ట్విన్ ఇంజన్ జెట్ 2004 లో తయారీ అయింది. ఇది గరిష్టంగా 70 మందిని తీసుకెళ్లగలదు.
చిన్న రన్ వే..
ప్రయాణికుల విమానాన్ని ల్యాండింగ్ చేయడానికి ముందు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్.. రీగన్ నేషనల్ లోని చిన్న రన్ వేలో దిగగలరా అని ప్రశ్నించగా.. తాము చేయగలని పైలెట్లు బదులిచ్చారు. దానికి ఆపరేటర్లు క్లియర్ చేయగానే ఫ్లైట్ ట్రాకింగ్ సంస్థలు కూడా అనుమతి ఇచ్చాయి.
ప్రమాదం జరగడానికి కేవలం 30 సెకన్ల ముందు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ హెలికాప్టర్ మీకు కనిపిస్తుందా అని అడిగినట్లు రికార్డు అయింది. ఇదే సమయంలోనే రెండు ఢీ కొన్నాయి. విమానం ట్రాన్స్ పాండర్ రన్ వే కి 2400అడుగుల దూరంలో నది మధ్యలో ఆగిపోయినట్లు సిగ్నల్ ఇచ్చింది.
Tags:    

Similar News