‘బాగ్రామ్’ వైమానిక స్థావరంపై తాలిబన్లకు ట్రంప్ హెచ్చరిక

ఆప్ఘన్లు అమెరికా ఉనికిని ఇష్టపడట్లేదంటున్న తాలిబన్లు

Update: 2025-09-21 12:00 GMT
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

బాగ్రామ్ వైమానిక స్థావరంపై నియంత్రణను అమెరికాకు తిరిగి ఇవ్వకపోతే ఆఫ్ఘనిస్తాన్ కు కష్టాలు ఎదురవుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం హెచ్చరించారు. దానిని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి దళాలను పంపే అవకాశం కూడా ఆయన తోసిపుచ్చలేదు.

ఆప్ఘనిస్తాన్ లోని తాలిబన్ ప్రభుత్వం తమ దేశంలో అమెరికా ఉనికిని వ్యతిరేకించింది. కొంతమంది అమెరికా నిపుణులు మాట్లాడుతూ.. మా సైనిక అధికారులు వైమానిక స్థావరాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం వల్ల ఇరాన్ నుంచి అధునాతన క్షిపణి ముప్పుకు గురయ్యే అవకాశం ఉండటంతో సహ కొన్ని ప్రమాదాలు ఉంటాయని హెచ్చరించారు.
‘‘ఆఫ్ఘనిస్తాన్ బాగ్రామ్ ఎయిర్ బేస్ ను దానిని నిర్మించిన వారికి అమెరికాకు తిరిగి ఇవ్వకపోతే, చెడు జరగబోతోంది’’ అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్ లో హెచ్చరించారు.
బాగ్రామ్ ఎయిర్ బేస్ చరిత్ర ఏంటీ?
లండన్ లో యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ తో కలిసి జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో ట్రంప్ బాగ్రామ్ ఎయిర్ బేస్ మాట్లాడారు. ‘‘మేము వాటిని వారికి ఉచితంగా ఇచ్చాము’’ అని అన్నారు. దీనితో తాలిబన్ల పాలనలో ఉన్న బాగ్రామ్ ఎయిర్ బేస్ చుట్టూ చర్చ ప్రారంభమైంది.
‘‘మేము ఆ స్థావరాన్ని తిరిగి కోరుకుంటున్నాము’’ అని ట్రంప్ అన్నారు.‘‘చైనా తన అణ్వాయుధాలను తయారు చేసే ప్రదేశం నుంచి ఇది కేవలం ఒకే ఒక గంట దూరంలో ఉంది’’ అని అన్నారు.
సెప్టెంబర్ 19న అమెరికాలోని తన ఓవల్ కార్యాలయంలో విలేకరులను ఉద్దేశించి ప్రసంగించారు. అమెరికా దానిని ఎప్పటికీ వదులుకోకూడదని ఆయన గట్టిగా చెప్పారు. తాలిబన్ ప్రభుత్వంతో వైమానిక స్థావరంపై నియంత్రణ సాధించడం గురించి తాను మాట్లాడుతున్నానని అన్నారు.
సెప్టెంబర్ 11న , 2001న న్యూయార్క్, వాషింగ్టన్ లోని అల్ ఖైదా దాడుల తరువాత అమెరికన్ దళాలు ఆప్ఘనిస్తాన్ లో రెండు దశాబ్ధాలకు పైగా ఈ వైమానిక స్థావరాన్ని ఉపయోగించుకుంది. 2020 లో ట్రంప్ మొదటి పరిపాలన సమయంలో అమెరికా సైన్యం ఆప్ఘన్ నుంచి ఉపసంహరణపై సంతకాలు జరిగాయి.
2021 లో బో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడూ తాలిబన్లు ఆప్ఘనిస్తాన్ ను తమ ఆధీనంలోకి తీసుకునే ముందు అమెరికన్ దళాలు వైమానిక స్థావరాన్ని ఆప్ఘన్ సైన్యానికి అప్పగించాయి.
వాస్తవానికి ఈ వైమానిక స్థావరం 1950 లో సోవియట్ యూనియన్ నిర్మించింది. 1980 లలో ఆప్ఘనిస్తాన్ ను ఆక్రమించిన సమయంలో ఇది సోవియట్ యూనియన్ ప్రధాన స్థావరంగా పనిచేసింది. తరువాత 2001 లో అమెరికా తాలిబన్ ను పడగొట్టిన కొద్ది కాలానికే, అమెరికా సైన్యం వైమానిక స్థావరాన్ని ఆక్రమించింది. ఇది 30 చదరపు మైళ్లకు యూఎస్ సైన్యం విస్తరించింది.
లాజిస్టిక్ సవాల్..
రాయిటర్ వార్తా కథనాల ప్రకారం.. ప్రస్తుత మాజీ యూఎస్ అధికారులు ఆప్ఘనిస్తాన్ లోని బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని తిరిగి ఆక్రమించే ఏదైనా ప్రయత్నం తిరిగి దండయాత్ర పోలీ ఉంటుందని, దీనికి పదివేల కంటే ఎక్కువ మంది సైనికులు, ఆధునాతన వైమానిక రక్షణ వ్యవస్థలు అవసరమవుతాయని హెచ్చరించారు.
పనామా కాలువ, గ్రీన్ ల్యాండ్ వంటి వ్యూహాత్మక ప్రదేశాలను స్వాధీనం చేసుకోవడంలో గతంలో ఆసక్తి చూపిన ట్రంప్, బాగ్రామ్ పై కూడా దృష్టి పెట్టినట్లు సమాచారం. స్థావరాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి అమెరికా బలగాలను మోహరించే అవకాశం గురించి శనివారం ప్రశ్నించినప్పుడూ ఆయన మాట్లాడటానికి నిరాకరించారు.
పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ అధికారి మాట్లాడుతూ.. వైమానిక స్థావరం తిరిగి స్వాధీనం చేసుకోవడానికి పదివేల మంది సైనికులు అవసరమవుతాయని దానిని మరమ్మతు చేయడానికి చాలా కష్టనష్టాలకు ఓర్చుకోవాల్సి ఉంటుందని అన్నారు. ల్యాండ్ లాక్డ్ కంట్రీ అయిన ఆప్ఘన్ కు మౌలిక సదుపాయాల సరఫరా చేయడానికి అనేక తలనొప్పులు ఉంటాయని చెబుతున్నారు.
ఈ ప్రాంతంలో చురుగ్గా ఉన్న శక్తులు ఈ బాగ్రామ్ ప్రాజెక్ట్ కు ఆటంకాలు కలిగించే అవకాశం ఉందని హెచ్చరించారు. అమెరికాతో చర్చల తరువాత ఆప్ఘన్ ప్రభుత్వం బాగ్రామ్ ను ఇవ్వడానికి అంగీకరించింది. ఆప్ఘనిస్తాన్ లోపల ఇస్లామిక్ స్టేట్, అల్ ఖైదా సాయుధ ఉగ్రవాదుల నుంచి వచ్చే బెదిరింపు నుంచి రక్షణ పొందాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరించారు.
ఈ జూన్ ప్రారంభంలో ఇరాన్ మూడు అణు స్థావరాలు ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్ లపై అమెరికా చేసిన దాడులకు ప్రతీకారంగా ఇటీవల ఖతార్ లోని ప్రధాన అమెరికా స్థావరం అల్ ఉదీద్ లక్ష్యంగా దాడులు చేసింది. అలాగే బాగ్రామ్ కు కూడా ఇరాన్ నుంచి ఆధునాత క్షిపణి ముప్పుకు కూడా ఈ వైమానిక స్థావరం గురయ్యే అవకాశం ఉంది.
అమెరికా ఉనికి ఆఫ్ఘన్లు వ్యతిరేకిస్తున్నారు..
గౌరవం, ఉమ్మడి ప్రయోజనాల ఆధారంగా ఆర్థిక, రాజకీయ సంబంధాలను పెట్టుకోవచ్చు. ఆఫ్ఘనిస్తాన్ లోని ఏ ప్రాంతంలోనూ అమెరికా తన సైనిక ఉనికిని కొనసాగించకూడదు’’ అని ఆప్ఘన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి జకీర్ జలాల్ గురువారం ఎక్స్ లో ట్వీట్ చేశారు.
చరిత్రలో ఆప్ఘన్ లు సైనిక ఉనికిని అంగీకరించలేదని, దోహ చర్చలు, ఒప్పందం సమయంలోనూ ఈ అవకాశం చర్చకు వచ్చిన పూర్తిగా తిరస్కరించాం. కానీ తదుపరి పరస్పర సహకార చర్యకు తలుపులు తెరిచి ఉన్నాయి’’ అని అన్నారు.
Tags:    

Similar News