కాశ్మీర్ హింసకు మూలం అమెరికా, పాక్ ఆర్ధిక బంధమే

రాక్షసత్వాన్ని సృష్టించిన "$32 బిలియన్ కూటమి";

Update: 2025-05-09 13:40 GMT
పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్ ఇటీవల ఓ సంచలన వ్యాఖ్య చేశారు.. అమెరికా, బ్రిటన్ల కోసం ఉగ్రవాదులకు, ఉగ్రవాద సంస్థలను శిక్షణ ఇచ్చి, నిధులు సమకూర్చే "డర్టీ వర్క్- (దుర్మార్గపు పని)" చేశామని ఆయన అంగీకరించారు. మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో కూడా దీన్ని "ఓ బహిరంగ రహస్యం" అంటూ గొంతు కలిపారు.
భారత్‌లో చాలామంది ఈ ప్రకటనను పాకిస్తాన్- కాశ్మీర్ తీవ్రవాదానికి పాల్పడిందన్న- దానికి ఓ నిదర్శనంగా భావించినా, దీని వెనుక లోతైన కథ ఉంది. అమెరికా ప్రచ్ఛన్న యుద్ధ వ్యూహం ఎలా పాకిస్తాన్‌ను మతపరమైన తీవ్రవాదం వైపు నెట్టిందో తెలుసుకోవాలి.

Full View

ఫాస్టియన్ ఒప్పందం
1947 నుంచి పాకిస్తాన్ ఎక్కువగా అమెరికా పైన్నే ఆధారపడింది. 1971 భారత–పాకిస్తాన్ యుద్ధ సమయంలో అమెరికా బహిరంగంగానే పాకిస్తాన్‌కు మద్దతిచ్చింది. బంగ్లాదేశ్ విముక్తికి ముందు 7వ నౌకాదళాన్ని (7th Fleet) మోహరించింది కూడా. అయితే 1979లో సోవియట్ యూనియన్ అఫ్ఘానిస్తాన్‌పై దాడి చేయడం అతి పెద్ద వాస్తవిక మలుపు.
ఆనాటి సోవియెట్ యూనియన్ ను ఎదుర్కొనే తాపత్రయంతో అమెరికా పాకిస్తాన్ ద్వారా $32 బిలియన్ డాలర్లను (సుమారు ₹2,66,000 కోట్లు) అఫ్ఘాన్ ముజాహిదీన్ సంస్థకు అందించింది. "సౌదీల ద్వారా పాకిస్తాన్‌కు నిధులు, ఆయుధాలు పంపేది అమెరికానే" అని ఈ విశ్లేషణ తెలియజేస్తుంది. దీంతో పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలు జిహాదీ శిక్షణ కేంద్రాలుగా మారాయి.
2 మిలియన్లకు పైగా అఫ్ఘాన్ శరణార్థులు, కరుడుకట్టిన మత చాంధసులుగా తయారయ్యారు. మత భావజాలాన్ని మనసంతా నింపుకున్న వీరు పాకిస్తాన్ సమాజాన్ని మరింత ఇస్లామీకరించారు.
బ్లోబ్యాక్ ప్రభావం
1989లో సోవియట్ సైన్యం అఫ్ఘానిస్తాన్ నుంచి వెనక్కి వెళ్లిన తర్వాత, పాకిస్తాన్ ISI ఈ ముజాహిదీన్‌ను కాశ్మీర్‌కు మళ్లించింది. "సోవియట్‌లు వెనక్కి వెళ్లిన 1989 సంవత్సరం నుంచే కాశ్మీర్‌లో హింస పెరిగింది" అని ఓ నివేదిక చెబుతోంది. సరిగ్గా అప్పటి నుంచే కాశ్మీర్ లో కలహాలు పెరిగాయి. 1999 కార్గిల్ యుద్ధానికి మూలం కూడా అదే.
బయటికి చెప్పకపోవొచ్చు గాని పాకిస్తాన్ అంతర్గతంగానూ దీనికి భారీ మూల్యం చెల్లించింది. సైనిక నియంత జియా-ఉల్-హక్ చేపట్టిన ఇస్లామీకరణ విధానాలు, ముజాహిదీన్ ప్రభావం కలసి ప్రభుత్వ వ్యవస్థలను తీవ్రవాదం దిశగా నెట్టాయి.
9/11 తర్వాత అమెరికా ఉగ్రవాదులపై చర్యలు తీసుకోమని ఒత్తిడి చేయడంతో, ముషారఫ్ లాంటి నాయకులు బ్లాస్ఫెమీ (మత) చట్టాలు లేదా మదర్సాలను సంస్కరించాలన్న ప్రయత్నం చేసినా పెద్దఎత్తున వ్యతిరేకత వచ్చింది. చివరకు వారు హత్యకు గురయ్యే స్థితి వచ్చింది.
చక్రబంధంలో గిలగిలా...
ఈరోజు పాకిస్తాన్ తన దేశంలో తీవ్రవాదానికి అమెరికా కారణమని వాపోతోంది. కానీ తమ సొంత ప్రాధాన్యతలను మాత్రం లెక్కలోకి తీసుకోవడం లేదు.
ఈ విశ్లేషణ చివరగా ఏమి చెబుతోందంటే.. "వాస్తవానికి 1971లో విడిపోయిన (బంగ్లా విముక్తి) తర్వాత, పాకిస్తాన్‌కి మరో గత్యంతరం లేదు" అనే భావించారు తప్ప ప్రత్యామ్నాయాన్ని విస్మరించారు. అంతిమంగా, $32 బిలియన్ డాలర్ల కూటమి ఒక రాక్షసాన్ని సృష్టించింది. అది ఈరోజుకీ పాకిస్తాన్‌ను, దాని పొరుగుదేశాలనూ వెంటాడుతోంది.
(ఈ విశ్లేషణ The Federal మేనేజింగ్ ఎడిటర్ కెఎస్ దక్షిణమూర్తి నిర్వహిస్తున్న 'Worldly-Wise' ప్రోగ్రామ్‌లో భాగంగా రాసింది. అంతర్జాతీయ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న సంక్లిష్ట మార్పులను వివరించేందుకు ఆయన ఈ కాలమ్ రాస్తున్నారు.)
Tags:    

Similar News